Anglerfish: ఇన్‌స్టా, ఫేస్‌బుక్, యూట్యూబ్ వీటిలో ఏది ఓపెన్ చేసిన చాలు.. ఒక వీడియో బాగా వైరల్ అవుతుంది. ఎక్కడో సముద్రం లోపల ఉండాల్సిన చేప పైకి వచ్చి సూర్యుడిని చూసి చనిపోయిందంటూ.. వరల్డ్ వైడ్‌గా అందరూ కూడా ఈ రీల్‌కి కామెంట్స్ చేస్తున్నారు. అంతే కాదు ఈ రీల్ చూసి కనెక్ట్ అవుతున్నారు కూడా. ఇంతకీ ఆ చేప పేరు మీకు తెలిసిపోయే ఉంటుంది.. అదే యాంగ్లర్ ఫిష్.. కానీ దీనికి సంబంధించి చాలా డౌట్స్ ఖచ్చితంగా మీకు ఉండే ఉంటాయి. అసలు యాంగ్లర్ ఫిష్ సైజు ఎంత ఉంటుంది. పిక్చర్‌లో చూపించునట్టుగా నిజంగానే యాంగ్లర్ ఫిష్ అనేది ఉంటుందా..? అసలు ఏంటి ఈ యాంగ్లర్ ఫిష్..? ఇన్ని రోజులు మనకు ఎందుకు కనిపియ్యలేదు..? ఇలాంటి డౌట్స్ ఉన్నాయా అదే ఈ స్టోరీ చదవాల్సిందే.
యాంగ్లర్ ఫిష్ సముద్రంలో లోతుగా ఉంటుంది. దాదాపు 8,200 ఫీట్ కిందకి ఈ చేప ఉంటుంది. అందుకే ఇప్పటి వరకు మనలో ఎవ్వరికి కూడా ఇటువంటి భయంకరమైన ఒకచేప.. అసలు భూమి మీద ఉందని కూడా తెలియదు. చాలా మంది ఈ చేపను చూసి ఫస్ట్ అనుకుంది ఖచ్చితంగా అదే. ఇంకా యాంగ్లర్ ఫిష్ సైజు గురించి మాట్లాడుకుంటే.. ఈ చేపను చూసిన ప్రతి ఒక్కరు కూడా ఇది ఇంత భయంకరంగా ఉంది.. ఇంత పెద్ద సైజులో ఉంది. ఇన్నిరోజులు ఎందుకు కనిపించలేదు అనుకుంటునే ఉంటారు. కానీ యాంగ్లర్ ఫిష్ సైజు మాత్రం చాలా చిన్నది. అంటే మీ చేతిలో సరిపోయే ఒక టోఫీ సైజు అన్నమాట.
యాంగ్లర్ ఫిష్ మీద ఇన్ని డౌట్స్ ఉన్నవాళ్లు కొందరైతే.. మరి కొంతమందికి యాంగ్లర్ ఫిష్ ముందుగానే తెలుసు. నీము మూవీ చూసిన వాళ్లందరికి కూడా ఒక భయంకరమైన చేప గుర్తుండే ఉంటుంది. అదే ఈ యాంగ్లర్ ఫిష్. అవును నిజంగానే ఈ మూవీలో చూపించినట్లు, ఫోటోలో కనిపిస్తున్నట్టు యాంగ్లర్ ఫిష్‌కి లైట్ ఉంటుందా అనేది అందరికి ఉండే మేజర్ డౌట్. అయితే నిజంగానే యాంగ్లర్ ఫిష్‌కి లైట్ ఉంటుంది. కానీ ఫీమేల్ యాంగ్లర్ ఫిష్‌కి మాత్రమే ఈ లైట్ ఉంటుందట. ఫిమేల్ యాంగ్లర్ ఫిష్‌కి తన ముక్కు నుండి ఫిష్షింగ్ రాడ్ లాగా ఒక ఆకారం అనేది ఉంటుంది. దాని చివర ఒక సంచి ఉంటుంది. దాన్నే ఎస్కా అంటారు. ఈ ఎస్కాలో ఒక బ్యాక్టీరియా ఉంటుంది. దీన్ని బయోల్యూమినిటిక్ బ్యాక్టీరియా అంటారు. దీని అర్ధం కాంతిని వెదజల్లే బ్యాక్టీరియా. ల్యూమినా అంటే కాంతి అని అర్ధం. సో ఇలాగా యాంగ్లర్ ఫిష్‌కి లైట్ అనేది ఉంటుంది.
యాంగ్లర్ ఫిష్‌కి ఉంటే ఇంపార్టెన్స్ ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ చేప సముద్రంలో చాలా లోతుగా ఉంటుంది. అక్కడ మొత్తం చీకటిగా ఉంటుంది. అయితే ఫీమేల్ యాంగ్లర్ ఫిష్ తనకున్న ఆ లైట్‌ని ట్రీని ఎట్రాక్ట్ చేయడానికి వాడుతుందన్నమాట. అయితే ఆహారం ఈ లైట్‌ని చూసి దగ్గరగా వస్తుంది. ఆ తర్వాత తన పదునైన పళ్లతో ఆహారాన్ని తీసుకుంటుంది యాంగ్లర్ ఫిష్. అలా ఈ చేపకు ఉండే లైట్ తనకు చాలా ఇంపార్టెంట్.
అయితే ఈ వైరల్ వీడియో చూసిన కామెన్ పీపుల్ మాత్రం ద బ్రేవ్ యాంగ్లర్ ఫిష్ అంటున్నారు. మరికొంత మంది చనిపోయేటప్పుడు ఆఖరి సారిగా సూర్యూడిని చూసి చనిపోదాం అనుకుందని, ది లాస్ట్ అడ్వెంచర్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. కానీ సైంటిస్టులు మాత్రం దీన్ని తప్పుపడుతున్నారు. అయితే సముద్రంలో టెంపరేచర్ ఛేంజెస్ వల్ల, లేకపోతే ఎల్‌నినో ఎఫెక్టు వల్ల ఇటువంటి చేపలు పైకి వస్తున్నాయంటూ కూడా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఏది ఏమైనా సరే.. మనకు చాలా దూరంగా.. కనిపించకుండా ఉండే ఇటువంటి ప్రాణులు కనపించాయంటే.. అది ప్రమాదానికి సాంకేతం అనే చూడాలి.