BigTV English
Advertisement

iPhone Models No More Sale : ఆ ఐఫోన్ మోడల్స్ విక్రయాల నిలిపివేత.. అభిమానులకు షాకిచ్చిన యాపిల్ కంపెనీ

iPhone Models No More Sale : ఆ ఐఫోన్ మోడల్స్ విక్రయాల నిలిపివేత.. అభిమానులకు షాకిచ్చిన యాపిల్ కంపెనీ

iPhone 14 Models Sale Stopped | టెక్​ దిగ్గజం యాపిల్ తన చౌకైన ‘ఐఫోన్ 16e’ను లాంఛ్ చేసింది. ఈ నేపథ్యంలో కంపెనీ తన పాత మూడు ఐఫోన్ మోడళ్ల విక్రయాలను నిలిపివేసింది. ‘ఐఫోన్ 16e’ మూడేళ్ల పాత ఫోన్‌పై అనేక అప్‌గ్రేడ్‌లను అందిస్తున్నందున కొత్త మోడల్‌కు చోటు కల్పించేందుకు యాపిల్ తన మూడవ తరం ఐఫోన్ SEని దశలవారీగా తొలగించింది. ఈ అప్​గ్రేడ్​లలో యాపిల్ ఇంటెలిజెన్స్‌ సపోర్టుతో A18 చిప్, ఛార్జింగ్ కోసం USB టైప్-C పోర్ట్ ఉన్నాయి. ఈ కొత్త ఎంట్రీ-లెవల్ స్మార్ట్‌ఫోన్‌ను ప్రారంభించిన తర్వాత కుపెర్టినో ఆధారిత కంపెనీ 2022లో ప్రారంభించిన స్టాండర్డ్ ఐఫోన్ 14 మోడళ్లను యాపిల్ తన వెబ్‌సైట్ నుంచి తొలగించినట్లు కనిపిస్తోంది.


యాపిల్ నిలిపివేసిన ఐఫోన్ మోడల్స్​ ఇవే!: ‘ఐఫోన్ 16e’ లాంఛ్ అయిన వెంటనే యాపిల్ తన పాత ‘ఐఫోన్ SE’, ‘ఐఫోన్ 14’, ‘ఐఫోన్ 14 ప్లస్’ మోడల్స్ కంపెనీ అధికారిక వెబ్​సైట్​ నుంచి తొలగించినట్లు కన్పిస్తుంది. అయితే ఈ మోడల్స్ ఇప్పటికీ ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ వంటి థర్డ్-పార్టీ రిటైలర్లు లేదా భారతదేశంలో పునరుద్ధరించిన స్టోర్​ల ద్వారా కొనుగోలు చేసేందుకు అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ స్టాక్‌లు కూడా త్వరలోనే అయిపోయే అవకాశం ఉంది.

ఇక యాపిల్ తన ‘ఐఫోన్ SE’ మోడల్​ను మార్చి 2022లో ప్రారంభ ధర రూ. 43,900 కంపెనీ లాంఛ్ చేసింది. మరోవైపు ‘ఐఫోన్ 14’, ‘ఐఫోన్ 14 ప్లస్’ సెప్టెంబర్ 2022లో వరుసగా రూ. 79,900, రూ. 89,900 ధరలతో వచ్చాయి.


Also Read:  వై ఫై స్పీడు తక్కువగా ఉందా?.. ఈ ట్రిక్స్ పాటిస్తే ఫుల్ స్పీడ్ ఖాయం

ఇదిలా ఉండగా ‘ఐఫోన్ 16’ ఫ్యామిలీని ప్రారంభించిన తర్వాత యాపిల్ గతేడాది ‘ఐఫోన్ 15 ప్రో’ సిరీస్, ‘ఐఫోన్ 13’ మోడళ్ల సేల్స్​ను నిలిపివేసింది. యూరోపియన్ యూనియన్ దేశాల్లో అన్ని స్మార్ట్ ఫోన్ పరికరాలకు తప్పనిసరిగా USB టైప్-C ఛార్జింగ్ పోర్ట్‌లు ఉండాలని కొత్త చట్టాన్ని తీసుకువచ్చారు. ఆ చట్టం అమలులో ఉండడం కారణంగా యాపిల్ సంస్థ అనేక యూరోపియన్ దేశాల్లో ఉన్న తన ఆన్‌లైన్ స్టోర్‌ల నుంచి ఐఫోన్ 14 సిరీస్ మోడల్స్ అయిన ‘ఐఫోన్ 14’, ‘ఐఫోన్ 14 ప్లస్’, ‘ఐఫోన్ SE’ఈ మూడు మోడల్స్​ను ఉపసంహరించుకోవడం ప్రారంభించింది.

దీంతో యాపిల్ స్మార్ట్​ఫోన్ పోర్ట్‌ఫోలియోలో ప్రస్తుతం బేస్ ‘ఐఫోన్ 15’ సిరీస్, ‘ఐఫోన్ 16’ సిరీస్, కొత్త ‘ఐఫోన్ 16e’ మోడల్స్​ ఉన్నాయి. ఇక ‘ఐఫోన్ 17’ లైనప్ ప్రకటించినప్పుడు కంపెనీ స్టాండర్డ్ ‘ఐఫోన్ 15’, ‘ఐఫోన్ 15 ప్లస్‌’లను వదులుకునే అవకాశం ఉంది.

ఐఫోన్ 16e ధర, ప్రత్యేకతలు:

డిస్​ప్లే: 60Hz రిఫ్రెష్ రేట్‌తో ఈ కొత్త మోడల్ 6.1-అంగుళాల OLED స్క్రీన్‌ను కలిగి ఉంది.

కెమెరా సెటప్: ఇది ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS)తో కూడిన సింగిల్ 48-మెగాపిక్సెల్ వెనుక కెమెరాను కలిగి ఉంది. దీంతోపాటు సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం ఈ ఫోన్ ముందు భాగంలో 12-మెగాపిక్సెల్ ట్రూడెప్త్ కెమెరా ఉంది.

ప్రాసెసర్: ఈ కొత్త ఫోన్ లో పవర్ ఫుల్ ప్రాసెసర్ అందుబాటులో ఉంది. ఈ ప్రాసెసర్ లో హుడ్ 3nm A18 చిప్‌ను అమర్చారు.

ప్రొటెక్షన్: ఇది డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్సీ కోసం IP68 రేటింగ్‌ను కలిగి ఉంది.

కనెక్టివిటీ ఫీచర్లు: ఈ హ్యాండ్‌సెట్ ఛార్జింగ్ కోసం USB టైప్-C పోర్ట్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్ 18W వైర్ ఛార్జింగ్ తో పాటు 7.5W వైర్‌లెస్ ఛార్జింగ్‌ ను కూడా సపోర్ట్ చేస్తుంది.

ఆపరేటింగ్ సిస్టమ్: ఈ కొత్త మోడల్.. ‘ఐఫోన్ 16e’ iOS 18తో నడుస్తుంది. వీటన్నింటితో పాటు ఈ ఫోన్ యాపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్‌లకు సపోర్ట్ చేస్తుంది.

ఐఫోన్​ 16e​ ధర:

బేస్​ మోడల్​ ధర: రూ.59,900 (128GB ఇంటర్నల్​ స్టోరేజ్)

సెకండ్ వేరియంట్​ ధర: రూ.69,900 (256GB)

మూడో వేరియంట్ ధర: రూ.89,900(512GB)

ఈ మోడల్ ప్రీ-ఆర్డర్స్​ ఫిబ్రవరి 21 నుంచి ప్రారంభం కానున్నాయి. ఫిబ్రవరి 28 నుంచి దీని సేల్​కి అందుబాటులోకి వస్తుంది.

Related News

WhatsApp: ఇకపై ఆ ఫోన్లలో వాట్సప్ బంద్.. ఈ లిస్టులో మీ ఫోన్ ఉందేమో చెక్ చేశారా?

Redmi Note 16 Pro 5G: కేవలం రూ.18 వేలలో ఫ్లాగ్‌షిప్‌ లుక్‌.. రెడ్‌మి నోట్ 16 ప్రో 5జి పూర్తి వివరాలు

Flight Mode: మీ ఫోన్లో దాగున్న సూపర్ ఫీచర్.. ఫ్లైట్‌మోడ్‌తో ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయని తెలుసా?

AI Smart Glasses: సోనీ కెమెరా, AI అసిస్టెంట్‌.. లెన్స్‌ కార్ట్ స్మార్ట్‌ గ్లాసెస్‌ చూస్తే మతిపోవాల్సిందే!

OPPO A6 Pro Mobile: 7000 mAh భారీ బ్యాటరీతో ఒప్పో ఎంట్రీ.. ఏ6 ప్రో 5జి ఫుల్ డీటెయిల్స్ ఇండియాలో ఇవే..

Vivo 400MP cameraphone: ప్రపంచంలోనే మొదటి 400MP కెమెరాఫోన్.. ఫొటోగ్రఫీ రంగంలో వివో సంచలన మోడల్

Samsung Galaxy F67 Neo 5G: శామ్‌సంగ్‌ నుంచి మరో సూపర్‌ హిట్‌ ఫోన్ ఎంట్రీ.. గెలాక్సీ ఎఫ్67 నియో 5జి స్పెషల్‌ ఫీచర్లు

Realme Narzo 50: రూ.15వేల లోపే బెస్ట్ 5జీ మొబైల్.. రియల్‌మీ నార్జో 50 5జీ పూర్తి రివ్యూ

Big Stories

×