BigTV English

Hair Loss Treatment: టర్కీకి చెక్కేస్తున్న బట్టతల బాధితులు.. ఇంతకీ అక్కడి ప్రత్యేకత ఏమిటో తెలుసా?

Hair Loss Treatment: టర్కీకి చెక్కేస్తున్న బట్టతల బాధితులు.. ఇంతకీ అక్కడి ప్రత్యేకత ఏమిటో తెలుసా?

Hair Loss Treatment: ఈ  రోజుల్లో ఉరుకుల పరుగుల జీవితాలకు తోడు పొల్యూషన్ జనాల మీద తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయి. జీవన శైలిలో మార్పుల కారణంగా మగాళ్లలో జుట్టు ఇట్టే రాలిపోతోంది. 30 ఏండ్లు నిండక ముందే హెడ్డు గడ్డిలేని క్రికెట్ గ్రౌండ్ లా మారిపోతుంది. కొంత మంది జుట్టు ఊడిపోతుందనే టెన్షన్ తో లేనిపోని ఆరోగ్య సమస్యలను తెచ్చుకుంటున్నారు. మరికొంత మంది ఏ టెన్షన్ లేకుండా హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ చేయించుకుంటున్నారు. అంటే, బట్టతల మీద పర్మింనెంట్ గా జుట్టు మొలిపించుకుంటున్నారు. సెలబ్రిటీల నుంచి మొదలుకొని సాధారణ ప్రజల వరకు ఇదే బాట పడుతున్నారు.


హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ క్యాపిటల్ గా టర్కీ  

ఇక హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ లో టర్కీ వరల్డ్ క్యాపిటల్ గా మారిపోయింది. తక్కువ ఖర్చు, పర్పెక్ట్ ట్రీట్మెంట్ కారణంగా ప్రపంచ నలుమూలల నుంచి బట్టతల బాబులంతా గుండు మీద జుట్టు మొలిపించుకునేందుకు టర్కీకి క్యూ కడుతున్నారు.  టర్కీలో ప్రభుత్వం హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ ఇండస్ట్రీకి మంచి సపోర్టు అందిస్తున్నది. జుట్టు మార్పిడి కోసం ప్రభుత్వ గుర్తింపు పొందిన క్లినిక్‌ లు ఉన్నాయి,. ఇక్కడ అధిక ప్రమాణాలతో పాటు మంచి క్వాలిటీ ట్రీట్మెంట్ లభిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఎక్కువ మంది హెయిర్ సంబంధ చికిత్సల కోసం టర్కీకి వెళ్తున్నారు.


ఖర్చు కూడా చాలా తక్కువ!

అమెరికా, ఆస్ట్రేలియా లాంటి దేశాల్లో కనీసం 10 నుంచి 12 వేల డాలర్లు అవుతుండగా, టర్కీలో 3 నుంచి 4 వేల డాలర్లలోనే హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ ప్రక్రియ పూర్తవుతోంది. అందుకే గత కొంత కాలంగా టర్కీకి హెయిర్ ట్రాన్స్ ఫ్లాంటేషన్ కోసం వెళ్లే వారి సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. టర్కిష్ విమానాలతో పాటు టర్కీ వీధుల్లోనూ ఎక్కువగా బట్టతల బాబులే కనిపిస్తున్నారు. టర్కీలో కేవలం హెయిర్ ప్లాంటేషన్ రంగం మూడు బిలియన్ల మార్కెట్ కు చేరుకుంది. అత్యాధునిక హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్  సౌకర్యాలతో పాటు తక్కువ ధరకే బట్టతలపై జుట్టు మొలిపిస్తున్నారు ఇక్కడి వైద్యులు. ఇక్కడి క్లినిక్ లు కూడా ప్రపంచ స్థాయి సౌకర్యాలను కలిగి ఉన్నాయి. అందుకే సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు టర్కీకి వెళ్లి హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ చేయించుకుంటున్నారు.

టర్కిష్ ‘హెయిర్ లైన్స్’ అంటూ ఫన్నీ కామెంట్స్

ఇక టర్కీలో ఎక్కడ చూసినా హెయిర్ ప్లాంటేషన్ కోసం వచ్చిన వాళ్లే కనిపిస్తున్నారు. విమానాల్లో వచ్చిపోయే వాళ్లలోనూ ఎక్కువ మంది హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కోసం వచ్చిన వాళ్లే ఉంటున్నారు. ఒక్కో విమానంలో సగానికి పైగా బట్టతల వాళ్లే కనిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో టర్కిష్ ఎయిర్ లైన్స్ ను టర్కిష్ హెయిర్ లైన్స్ గా మార్చితే బాగుంటుందంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.

ఇండియాలో ఈ రంగం ఎందుకు సత్తా చాటలేకపోతుంది?

ఇక ఇండియాలో మంచి హెయిర్ ట్రాన్స్ ఫ్లాంటేషన్ నిపుణులు ఉన్నప్పటికీ ప్రభుత్వం నుంచి సరైన ప్రోత్సాహం లేదని భారతీయ వైద్యులు అంటున్నారు. ప్రభుత్వ గుర్తింపు పొందిన క్లినిక్ లు కూడా లేవంటున్నారు. అందుకే భారతీయ క్లినిక్‌ లు ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటున్నాయని అభిప్రాయపడుతున్నారు. స్త్రీ, పురుషులలో బ్యూటీ సర్జరీల పట్ల అవగాహన, డిమాండ్ పెరుగుతున్నందున భారతదేశంలో ఇప్పుడిప్పుడే హెయిర్ ప్లాంటేషన్ మంచి ఆదరణ పొందుతుందంటున్నారు.

Read Also: రోజు రోజుకు జుట్టు పలచబడుతోందా ? కారణాలివే !

Tags

Related News

Ajwain Water Benefits: వాము నీరు తాగితే.. ఈ ఆరోగ్య సమస్యలు పరార్ !

Fact Check: నవ్వితే కళ్ల నుంచి నీరు వస్తుందా? అయితే కారణం ఇదీ?

Skin Whitening Tips: ఛాలెంజ్, ఈ టిప్స్ పాటిస్తే.. 7 రోజుల్లోనే నిగనిగలాడే చర్మం

Steel Pans: స్టీల్ పాత్రల్లో.. వీటిని పొరపాటున కూడా వండకూడదు !

Oral Health: వర్షాకాలంలో తరచూ వచ్చే గొంతు నొప్పికి.. ఈ టిప్స్‌తో చెక్ !

Diabetic Patients: షుగర్ పేషెంట్లు ఎలాంటి ఫుడ్ తినాలో తెలుసా ?

Big Stories

×