BigTV English
Advertisement

Viral Video: రైలు కింద పడి రెండు ముక్కలైన యువకుడు, బంగ్లాదేశ్ లో ఘోరం

Viral Video: రైలు కింద పడి రెండు ముక్కలైన యువకుడు, బంగ్లాదేశ్ లో ఘోరం

Young Man falls From Moving Train:  చేతిలో డబ్బులు లేక.. లేదంటే సమయానికి రైలు దొరక్క కొంత మంది అక్రమంగా ప్రయాణం చేస్తుంటారు. గూడ్స్ రైళ్ల మీద వెళ్లడం, ప్యాసింజర్ రైల్లో రెండు బోగీల నడుమ కూర్చొని ప్రయాణించడం చేస్తుంటారు. ఇలాంటి ప్రయాణాలు ఒక్కోసారి తమ ప్రాణాల మీది తెస్తాయి. తాజాగా ఇలాంటి ఘటన బంగ్లాదేశ్ లో జరిగింది. గూడ్స్ రైలు మీద ఇద్దరు యువకులు అక్రమంగా ప్రయాణిస్తూ, దిగే క్రమంలో ఓ యువకుడు అదే రైలు కింద పడి రెండు ముక్కలు అయ్యాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.


ఆయిల్ తీసుకెళ్లే గూడ్స్ రైలు మీద ప్రయాణం

బంగ్లాదేశ్ లో జిబ్రాన్, సులేమాన్ అనే ఇద్దరు యువకులు ఆయిల్ ను తీసుకెళ్లే గూడ్స్ రైలు మీద ప్రయాణించారు. తాము దిగాల్సిన స్టేషన్ వచ్చినా, గూడ్స్ బండి కావడంతో ఆపకుండా వెళ్తున్నది. అయినప్పటికీ సులేమాన్ ముందుగా రైలు మీది నుంచి దూకేశాడు. తనకు ఎలాంటి అపాయం కలగలేదు. జిబ్రాన్ కూడా సులేమాన్ మాదిరిగా రైలు మీది నుంచి దూకేందుకు ప్రయత్నించాడు. ఆ సమయంలో అతడి కాలు స్లిప్ అయ్యి రైలు పట్టాల మీద పడ్డాడు. సరిగ్గా అతడి నడుము మీది నుంచి రైలు చక్రాలు వెళ్లాయి. ఈ ప్రమాదంలో జిబ్రాన్ రెండు ముక్కలు అయ్యాడు. అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. అదే రైల్వే స్టేషన్ లో ఉన్న కొంతమంది వ్యక్తులు ఈ యువకులు రైలు దూకుతుండగా తీసిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. బంగ్లాదేశ్ రైల్వే అధికారులు ఈ ఘటనపై దర్యాప్తు మొదలుపెట్టారు.


నెటిజన్లు ఏమంటున్నారంటే?

ఈ వైరల్ వీడియోపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. చిన్న చిన్న పొరపాట్లతో ప్రాణాలు కోల్పోకూడదంటున్నారు. “గూడ్స్ రైల్ మీద అక్రమంగా ప్రయాణించడానికి కారణాలు ఏవైనా కావచ్చు. కానీ, ఓ నిండు ప్రాణం పోయింది. దయచేసి యువకులు ఇలాంటి తప్పులు చేయకండి. అనవసరంగా ప్రాణాలు కోల్పోకండి” అంటూ ఓ నెటిజన్ సూచించాడు. “గూడ్స్ రైలు సిబ్బంది అలర్ట్ గా ఉండి ఉంటే, ఇలాంటి ఘోరం జరిగేది కాదు. రైల్వే అధికారులు గూడ్స్ సిబ్బంది మీద తగిన చర్యలు తీసుకోవాలి” అని మరో వ్యక్తి డిమాండ్ చేశాడు. “పిచ్చి పనులతో ప్రాణాలు కోల్పోవడం ఇప్పటి యువతకు ఫ్యాషన్ అయ్యింది. చేసిన తప్పుకు శిక్ష పడింది. ఈ వీడియో చూసిన తర్వాత అయినా, ఇలాంటి వ్యక్తులు మారుతారని ఆశిస్తున్నా” అంటూ ఇంకో వ్యక్తి రాసుకొచ్చాడు. మొత్తంగా ఈ వీడియోను చూసి కొంతమంది బాధపడుతుంటే, మరికొంత మంది సరైన పని జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా ఇలాంటి మూర్ఖపు పనులు చేయకూదని సూచిస్తున్నారు.

Read Also: రైల్వే ట్రాక్‌పై సెల్ఫీ.. వేగంగా దూసుకొచ్చిన రైలు, రెప్పపాటులో ఎగిరిపడ్డ యువకుడు

Related News

Longest Name: ప్రపంచంలోనే పొడవైన పేరున్న వ్యక్తి ఇతడే.. ఏకంగా గిన్నిస్ రికార్డు కొట్టేశాడు!

Shocking Video: లక్నోలో రెచ్చిపోయిన యువతి.. కారులో నగ్నంగా ప్రయాణం.. వీడియో వైరల్

Viral Video: ఆఫీసులో తింగరి వేషాలేంటి? హీటెక్కిపోయిన బ్యాంక్ మేనేజర్, ఆ తర్వాత ఏం జరిగిందంటే

Man Wins Rs 240 Cr Lottery: తెలంగాణ బిడ్డకు రూ.240 కోట్ల లాటరీ.. ఇదిగో ఇలా చేస్తే మీరూ కోటీశ్వరులే!

Hanumakonda: కోయ్.. కోయ్.. కొక్కొరొక్కో.. కోళ్ల కోసం జనం పరుగుల వేట

Orange Shark: అరుదైన ఆరెంజ్ షార్క్.. భలే బాగుంది, కానీ చాలా డేంజర్ సుమా!

Safety Pin: ఈ పిన్నీసు కొనాలంటే ఆస్తులు అమ్మాల్సిందే, మరీ అంత ధర ఏంట్రా అయ్యా?

Uber Driver Story: పగటిపూట రూ.1,500 కోట్ల వ్యాపారాన్ని నడుపుతున్న వ్యక్తి, రాత్రిపూట ఉబర్ డ్రైవర్‌గా మారుతున్నాడు.. ఎందుకంటే?

Big Stories

×