BigTV English

Nindu Noorella Saavasam Serial Today November 4th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌:   మనోహరి ట్రాప్ లో పడిపోయిన మిస్సమ్మ – రామ్మూర్తిని కూడా దూరం పెట్టిన పిల్లలు

Nindu Noorella Saavasam Serial Today November 4th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌:   మనోహరి ట్రాప్ లో పడిపోయిన మిస్సమ్మ – రామ్మూర్తిని కూడా దూరం పెట్టిన పిల్లలు

Nindu Noorella Saavasam Serial Today Episode :  మనోహరి ట్రాప్‌ లో పడిపోయిన మిస్సమ్మకు నిజం చెప్తానని ఆరు వెళ్తుంటే.. గుప్త వద్దని వారిస్తాడు. నువ్వు ఇప్పుడు ఆ బాలికకు నిజం చెప్తే నువ్వు ఎవరన్న నిజం కూడా తెలిసిసోతుందని అది మరిన్ని కష్టాలకు కారణం అవుతుందని గుప్త చెప్పడంతో ఆరు ఆగిపోతుంది.


స్కూల్‌ కు వెళ్లిన పిల్లలు రామ్మూర్తిని పలకరించకుండా క్లాస్‌ లోకి వెళ్తుంటే..  రామ్మూర్తే వెళ్లి పలకరిస్తాడు. అయినా పిల్లలు పలకరు. దీంతో ఏమైందని ఎందుకు డల్లుగా ఉన్నారని రామ్మూర్తి అడుగుతాడు. పిల్లలు ఏం చెప్పకుండా అలాగే నిలబడి ఉంటారు. దీంతో ఇంట్లో ఏమైనా గొడవ జరిగిందా..? నాన్న ఏమైనా అన్నారా..? అని రామ్మూర్తి మళ్లీ అడగ్గానే అమ్ము లేదు తాతయ్యా.. ప్రేయర్‌ కు లేట్‌ అవుతుంది వెళ్తాము. అని వెళ్లబోతుంటే ప్రిన్సిపాల్‌ వచ్చి రామ్మూర్తిని పిలిచి తన రూంలో టేబుల్‌ క్లీన్‌ చేయమని చెప్తుంది.

దీంతో రామ్మూర్తి సరేనమ్మా అంటూ లోపలికి వెళ్తాడు. రామ్మూర్తి వెళ్లగానే అమ్ము… ఓరేయ్‌ మిస్సమ్మ తప్పు చేస్తే తాతయ్యతో ఎందుకు మాట్లాడకూడదు అని అడుగుతుంది. దీంతో ఆకాష్‌ బాధగా అసలు మిస్సమ్మ అమ్మ ఫోటో అలా చేస్తుందని మనం ఎప్పుడూ అనుకోలేదు అంటాడు. అంజు మాత్రం నేను ఎప్పుడూ అనుకుంటూనే ఉన్నా.. మీకు చెప్తూనే ఉన్నాను. ఇవాళ్టీ నుంచి మనం మిస్సమ్మకు సంబంధించిన వాళ్లతో ఎవరితో మాట్లాడకూడదు అని ముగ్గురు పిల్లలు వెళ్లిపోతారు. అమ్ము వాళ్ల వెనకాలే వెళ్తుంది.


మనోహరి తన రూంలోంచి కత్తెర తీసుకుని బయటకు వచ్చి ఒసేయ్‌ భాగీ పిల్లల విషయంలో నీపై విషాన్ని నింపాను. ఇక అమర్‌ మనసులో కూడా నింపే కార్యక్రమం చేస్తున్నాను. అసలైన మనోహరిని పరిచయం చేసే టైం వచింది అనుకుటుంది. కిటికీలోంచి గమనిస్తున్న ఆరు ఇది ఏం చేయబోతుంది గుప్తగారు అని అడుగుతుంది. దీంతో గుప్త ఆ బాలిక విధ్వంసం సృష్టించబోతుంది అని  చెప్తాడు. ఆరు షాక్‌ అవుతుంది. దీంతో గుప్త అవును బాలిక. ఆ బాలిక చేయబోయే పని వలన ఇంట్లో వాళ్ల మనసులు ఇరిగిపోవును. మనఃశాంతి లేకుండా అయిపోవును అంటాడు గుప్త. దీంతో అన్నీ తెలిసి మీరెందుకు ఆపకుండా ఉండిపోయారు గుప్త గారు అంటూ తాను ఆపుతానని వెళ్లబోతుంటే గుప్త కోపంగా ఆరును ఆపుతాడు. నువ్వు విధికి ఎదురెళ్లే ప్రతిసారి నీ కుటుంబం కష్టాల పాలవుతుందని చెప్తాడు. దీంతో ఆరు ఆగిపోతుంది.

కత్తెర తీసుకుని వచ్చిన మనోహరి దేవుడి రూంకు ఉన్న కర్టెన్స్‌ కత్తిరించి వెళ్లిపోతుంది. బయటి నుంచి వచ్చిన మిస్సమ్మ కర్టెన్స్‌ చిరిగిపోయి ఉండటం చూసి షాక్‌ అవుతుంది. ఎవరు కట్ చేసి ఉంటారు అని ఆలోచిస్తుంటే.. మనోహరి వచ్చి పిల్లల అల్లరి రోజు రోజుకు మితిమీరి పోతుంది అంటుంది. ఉదయం అంజు కత్తెర పట్టుకుని ఉండటం చూశాను. వాళ్లే కట్‌ చేసి ఉంటారు అని మనోహరి చెప్తుంది. అలాగే అమర్‌ వచ్చే టైం అయింది. ఈ కర్టెన్స్‌ చూస్తే ఇక పిల్లలకు ఉంటుంది కదా? అంటూ చెప్పబోతూ అసలు ఆరు ఉంటే ఈ పాటికి పాత చీరలు తీసుకొచ్చి కర్టెన్స్‌ కుట్టేది తెలుసా..? మిస్సమ్మ అంటుంది. అవునా అని మిస్సమ్మ అయితే నేను కూడా కుడతాను అంటుంది.

ఇంతలో మనోహరి లోపలికి వెళ్లి ఆరు చీరను తీసుకొచ్చి మిస్సమ్మకు ఇస్తుంది. ఆ చీరను పట్టుకున్న మిస్సమ్మ ఎమోషనల్‌ అవుతుంది. ఈ చీర ఎవరిది అని అడుగుతుంది. ఇది పట్టుకోగానే నా మనసుకు ఏదో అవుతుందని చెప్తుంది. దీంతో మనోహరి షాక్‌ అవుతుంది. అది మీ అక్క రక్తం అంటుకున్న చీర కాబట్టి.. మీ అక్క ప్రాణం పోయిన చీర కాబట్టి నీకలా అనిపించడం తప్పు కాదు మిస్సమ్మ అని  మనసులో అనుకుంటుంది మనోహరి. ఇంతలో మిస్సమ్మ నేను ఈ చీరతో నేను కర్టెన్‌ కుట్టలేను అంటుంది. దీంతో మనోహరి ఏయ్‌ నీకేమైనా పిచ్చా.. అమర్‌ వచ్చే టైం అయింది. పిల్లల్ని కాపాడాలి అటే త్వరగా కర్టెన్‌ కుట్టు.. నీకు అంతగా చేతగాకపోతే ఇలా ఇవ్వు అంటూ చీరను లాక్కుని వెళ్లబోతుంటే మిస్సమ్మ వద్దులే ఇటివ్వండి అంటూ చీరను తీసుకుని వెళ్లిపోతుంది.

మిస్సమ్మ చీరను తీసుకుని పోవడంతో మనోహరి హ్యాపీగా ఫీలవుతుంది. తన ప్లాన్‌ వర్కవుట్‌ అవుతుందని సంతోషపడుతుంది. అంతా కిటికీలొంచి గమనిస్తున్న ఆరు ఇప్పుడెలాగైనా మిస్సమ్మను ఆపాలని గుప్త దగ్గరకు వెళ్లి ఎలాగైనా సాయం చేయమని అడుగుతుంది. గుప్త పలకకుండా నవ్వుతూ ఉంటాడు. ఇంతలో అమర్‌, నిర్మల, శివరాం, రాథోడ్‌ ఇంటికి వస్తారు. లోపల కర్టెన్‌ కుట్టిన మిస్సమ్మ దేవుడి రూంకి వేసి చాలా బాగుంది అనుకుంటుంది. ఇంతలో లోపలికి వచ్చిన అమర్‌, శివరాం, నిర్మల, రాథోడ్‌ ఆ కర్టెన్‌ చూసి షాక్‌ అవుతారు. అమర్‌ కర్టెన్‌ దగ్గరకు వెళ్లి పరిశీలనగా చూస్తుంటాడు. ఇంతటితో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్‌ అయిపోతుంది.

Related News

Intinti Ramayanam Serial Today September 25th: ‘ఇంటింటి రామాయణం’ సీరియల్‌: జాబ్‌ కు రిజైన్‌ చేసిన అక్షయ్‌

Illu Illalu Pillalu Serial Today September 25th: ‘ఇల్లు ఇల్లాలు పిల్లలు’ సీరియల్‌: రామరాజు మీద పగ తీర్చుకుంటానన్న విశ్వ

Gunde Ninda Gudi Gantalu Serial Today September 25th: ‘గుండె నిండా గుడి గంటలు’ సీరియల్‌: రోహిణిని అనుమానించిన బాలు    

Brahmamudi Serial Today September 25th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: రాజ్‌ ను గల్లా పట్టుకుని నిలదీసిన కావ్య  

Nindu Noorella Saavasam Serial Today September 25th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరిని తోసేసిన మిస్సమ్మ

Tv Actress: విడాకులు తీసుకొని విడిపోయిన బుల్లితెర జంట…పెళ్లైన నాలుగేళ్లకే?

Nindu Noorella Saavasam Serial Today September 24th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మిస్సమ్మకు నిజం చెప్పిన సరస్వతి   

Brahmamudi Serial Today September 24th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కావ్యకు అబార్షన్‌ చేయించనున్న రాజ్‌ –  ఆఫీసుకు వెళ్లిన సుభాష్‌   

Big Stories

×