BigTV English

YouTube: యూట్యూబ్‌లో ‘నెమలి కూర’ వంటకం.. జంతుప్రేమికుల ఆగ్రహం!

YouTube: యూట్యూబ్‌లో ‘నెమలి కూర’ వంటకం.. జంతుప్రేమికుల ఆగ్రహం!

Traditional peacock curry on YouTube video viral: నెమలి.. జాతీయ పక్షి. అలాంటి నెమలిని వెంటాడం చట్టరీత్యానేరం. ఇలా కొన్ని రకాల జంతువులను వేటడడం నేరంగా పరిగణిస్తారు. ఇప్పటికీ కొంతమంది పలు రకాల జంతువులను వేటాడి జైళ్లకు వెళ్లిన సంఘటనలు కూడా చోటుచేసుకున్నాయి. మరికొంతమంది ఆ కేసులను బయటకు వచ్చేందుకు నానా తంటాలు పడుతున్నారు. అయితే తాజాగా, ఓ యూట్యూబర్ ఏకంగా నెమలి కూర ఎలా చేయాలంటూ వీడియో చేయడంతో జంతు ప్రేమికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.


వివరాల ప్రకారం..సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లికి చెందిన ప్రణయ్ కుమార్..గత కొంతకాలంగా యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తున్నాడు. ఈ క్రంలోనే ‘నెమలి కూర సంప్రదాయ పద్ధతిలో ఎలా వండాలి’ అంటూ ఛానల్ లో వీడియో అప్ లోడ్ చేశారు. ఇంకేముంది..ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో మార్మోగుతోంది. దీంతోపాటు అడవిపంది కూడం వండటం గురించి కూడా ఛానల్ లో ఉండడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

ఈ విషయంపై జంతుప్రేమికులు స్పందించారు. శ్రీటీవి యూట్యూబ్ నిర్వాహకుడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ మురకు పోలీసులు, అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. నెమలిని జాతీయపక్షిగా భారత ప్రభుత్వం 1963 జనవరి 26న గుర్తించింది. అయితే నెమలిని వెంటాడితేనే కేసు నమోదు అవుతున్న తరుణంలో ఈయన ఏకంగా నెమలి కూరపై వీడియో చేశాడు. మరి ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.


Related News

Russian Girl: రష్యన్ బాలిక కన్నడ కవితను ఎంత ముద్దుగా పాడుతుందో చూడండి..

Lucknow News: కిలాడీ టాలెంట్.. నైపుణ్యంతో చెవి రింగులు కొట్టేసింది, ఆ తర్వాత

Uttar Pradesh : పారిపోయిన అక్కాచెల్లెళ్లు.. చివరకు ఒక్కటయ్యారు, అసలు మేటరేంటి?

Gurgaon man: మోడల్ ను చూసి ఆపుకోలేక.. రోడ్డు మీదే ఆ పాడు పని.. మరీ ఇలా తయారయ్యారేంట్రా?

Liquor party: కోడలు మందు పార్టీ.. మామ రివేంజ్.. పోలీసుల ఎంట్రీ!

Beggar Viral News: ఆ బిచ్చగాడికి ఇద్దరు భార్యలు.. కలెక్టర్ కు.. వింత రిక్వెస్ట్, నవ్వకండి సీరియస్ మేటర్!

Big Stories

×