BigTV English

Raagi Vadalu: హెల్దీ స్నాక్.. నిమిషాల్లోనే అదిరిపోయే రాగివడలు మీ పిల్లలకు పెట్టండి..

Raagi Vadalu: హెల్దీ స్నాక్.. నిమిషాల్లోనే అదిరిపోయే రాగివడలు మీ పిల్లలకు పెట్టండి..

నిమిషాల వ్యవధిలోనే అదిరిపోయే రాగివడలు.. పిండి రుబ్బుకునే పని లేకుండా తయారు చేసుకోవచ్చు. ఈ స్నాక్ ను పిల్లలకు సాయంత్రం వేళ పెడితే.. ఒక్కటి కూడా మిగల్చకుండా లాగించేస్తారు. పైకి క్రిస్పీగా లోపల మెత్తగా ఉండే రాగి వడలు హెల్త్ కు కూడా మంచిది. రాగి వడలు చేసుకునేందుకు పిండి రుబ్బి పెట్టుకోవాల్సిన పనిలేదు. కేవలం రాగిపిండి, పెరుగు, బొంబాయిరవ్వ ఉంటే చాలు. మరి రాగివడలను ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం.


రాగి వడలు తయారీకి కావలసిన పదార్థాలు

రాగిపిండి – 1.1/2 కప్పు

బొంబాయి రవ్వ – 1 కప్పు


ఉప్పు – రుచికి కావలసినంత

తరిగిన ఉల్లిపాయ – 1

సన్నగా తరిగిన పచ్చిమిర్చి – 3

పెరుగు – 1.1/2 కప్పు

కరివేపాకు – 1 రెమ్మ

తరిగిన కొత్తిమీర – కొద్దిగా

రాగివడలు తయారీ విధానం

బొంబాయిరవ్వను మిక్సీ జార్ లో వేసుకుని మెత్తగా పౌడర్ చేసి పెట్టుకోవాలి. ఒక గిన్నెలోకి రాగిపిండి, పొడి చేసుకున్న బొంబాయిరవ్వ, ఉప్పు, పెరుగు, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిర్చి వేసుకుని కొద్దిగా నీళ్లు కలుపుకుంటూ.. పిండిని వడలకు కావలసిన టెక్స్చర్ లో కలిపి పెట్టుకోవాలి.

ఇప్పుడు కళాయిని స్టవ్ పై పెట్టి.. డీప్ ఫ్రై కి కావలసినంత ఆయిల్ వేసుకుని.. వడలను ఆయిల్ వేసి వేయించుకోవాలి. అంతే.. వేడి వేడి రాగి వడలు రెడీ. వీటిని కొబ్బరి పల్లీ చట్నీ లేదా టొమాటో చట్నీతో కలిపి తింటే చాలా బాగుంటుంది. ఇంకెందుకు లేటు.. మీరు కూడా ఒకసారి రాగి వడలను ట్రై చేయండి.

Related News

Pineapple Benefits: ఖాళీ కడుపుతో పైనాపిల్ తింటే.. ఇన్ని లాభాలా ?

Night Shift Workers: నైట్ షిప్ట్ చేస్తున్నారా ? ఈ టిప్స్ మీకోసమే !

Late Sleep: రాత్రి 11 తర్వాత నిద్రపోతున్నారా ? ఈ సమస్యలు తప్పవంటున్న నిపుణులు !

Japanese Interval Walking: జపనీస్ ఇంటర్వెల్ వాకింగ్.. ప్రయోజనాలు తెలిస్తే ఈ రోజు నుంచి మొదలెడతారు !

Momos side effects: మొమోస్ తింటున్నారా? అయితే ఈ నిజం తప్పక తెలుసుకోండి..

White Foods: ఆరోగ్యాన్ని దెబ్బతీసే.. 3 తెల్లటి ఆహార పదార్థాలు, వీటితో.. ఇంత డేంజరా ?

Big Stories

×