Rachana Gurjar: యూట్యూబ్‌లో కాస్త క్రేజ్ రాగానే చాలామంది చేసే అతిపెద్ద తప్పు ఇదే. తమ లైఫ్‌స్టైల్‌ను, ఇంట్లో ఉన్న గుట్టును మొత్తం సోషల్ మీడియా లో పెట్టి ప్రపంచానికి చూపించేస్తుంటారు. సరిగ్గా ఇలాంటి షోఆఫ్ వల్లే మధ్యప్రదేశ్‌కు చెందిన ఒక పాపులర్ యూట్యూబర్ ఇప్పుడు నిలువునా మునిగిపోయింది. శివపురి జిల్లా మోహని గ్రామానికి చెందిన రచన గుర్జార్ అనే మహిళా యూట్యూబర్.. బుందేల్‌ఖండ్ ఫోక్ సాంగ్స్ పాడుతూ సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది.
అయితే, కేవలం టాలెంట్‌ను చూపిస్తే సరిపోదనుకుందో ఏమో, రీసెంట్ వీడియోల్లో తన ఒంటిపై ఉన్న భారీ బంగారు ఆభరణాలను, తన రిచ్ లైఫ్ స్టైల్ ని తెగ ప్రమోట్ చేసుకుంది. రీల్స్ కోసం చేసిన ఈ ఓవర్ యాక్షనే ఇప్పుడు ఆమె కొంపముంచింది.ఏమైందంటారా దాదాపు 10 లక్షల రూపాయల విలువైన ఆ నగలు, నగదుని దొంగలు దోచుకుపోయారు మరి.
ఈ షాకింగ్ ఘటన శనివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. రచన గుర్జార్ తన కుటుంబంతో కలిసి ఇంట్లో గాఢనిద్రలో ఉన్న సమయంలో దొంగలు పక్కా ప్లాన్‌తో ఎంట్రీ ఇచ్చారు. దొంగలు ముందుగా ఇంటి చుట్టూ ఉన్న ఫెన్సింగ్‌ను కట్ చేశారు. ఆ తర్వాత ఒక చెక్క నిచ్చెన సహాయంతో ఇంట్లోకి చొరబడ్డారు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. దొంగలు కేవలం బంగారం, వెండి, క్యాష్ మాత్రమే కాదు.. ఇంట్లో ఉన్న ఎనర్జీ డ్రింక్స్ కార్టన్‌ను కూడా వదలకుండా పట్టుకెళ్లడం గమనార్హం. మొత్తం దొంగతనం విలువ రూ. 8 లక్షల నుండి రూ. 10 లక్షల వరకు ఉంటుందని అంచనా .
also read :‘గాడ్ ఆఫ్ వార్’ తో ఎన్టీఆర్ నెక్స్ట్ లెవెల్ స్కెచ్.. కోలీవుడ్ డైరెక్టర్‌కు నో ఛాన్స్?
ఇక దొంగలు ఎంత ప్రొఫెషనల్ గా ప్లాన్ చేశారంటే.. రచన కుటుంబ సభ్యులు ఎవరూ బయటకు రాకుండా వారు పడుకున్న రూమ్ తలుపులను బయటి నుంచి లాక్ చేసేశారు. తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో మెలకువ వచ్చిన కుటుంబ సభ్యులు, రూమ్ డోర్ తీయడానికి ప్రయత్నించగా అది లాక్ చేసి ఉండటంతో అసలు విషయం అర్థమైంది. వెంటనే ఫోన్ ద్వారా చుట్టుపక్కల ఉండే బంధువులను అలర్ట్ చేయడంతో, వారు వచ్చి తలుపులు తెరిచి వీరిని కాపాడారు. బయటకు వచ్చి చూసేసరికి ఇల్లంతా గుల్ల అయిపోయింది. తాము లోపల ఉండగానే దొంగలు ఈ దారుణానికి ఒడిగట్టారని, అంతకంటే ముందు ఇంటి చుట్టూ ఉన్న సిసిటివి కెమెరాలను ఒక లాఠీ (కర్ర) సహాయంతో వేరే వైపు తిప్పేసారని, దీనివల్ల వాళ్ల ముఖాలు రికార్డ్ కాలేదని రచన గుర్జార్ మీడియాతో తన ఆవేదన వ్యక్తం చేసింది.
అయితే ఈ చోరీకి పాల్పడింది కచ్చితంగా ఆ గ్రామానికి చెందినవారో లేక చుట్టుపక్కల ఉంటూ ఆ కుటుంబంతో సన్నిహితంగా ఉండేవాళ్లో అయి ఉండొచ్చని భావిస్తున్నారు. ఎందుకంటే ఆ ఇంట్లో ఎక్కడ ఏముంది, ఏ సమయంలో ఎవరు ఎక్కడ పడుకుంటారు అనే పూర్తి సమాచారం ఉన్నవారే ఇంత పక్కాగా స్కెచ్ వేయగలరు. ఈ వైరల్ న్యూస్ కాస్తా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారడంతో నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.
also read :మ్యూజిక్ డైరెక్టర్‌ను ఇసుకలో పాతిపెట్టిన టాలీవుడ్ స్టార్ డైరెక్టర్.. షాకింగ్ వీడియో వైరల్!
కొంతమంది “రీల్స్ ద్వారా వచ్చే ఫేమ్, వ్యూస్ ముందు ఈ బంగారం చాలా చిన్నదని ఆమె అనుకుని ఉంటుంది, వ్యూస్ పిచ్చి ఏ స్థాయికి చేరిందో చెప్పడానికి ఇదొక ఉదాహరణ” అంటూ విమర్శిస్తుంటే.. మరికొందరు మాత్రం “ప్రపంచ కుబేరులు కూడా వాళ్ల లగ్జరీ కార్లు, యాట్లను షోఆఫ్ చేస్తారు, కానీ వాటికి ప్రాపర్ ఇన్సూరెన్స్, హై-సెక్యూరిటీ సిస్టమ్స్ ఉంటాయి. ఇలాంటి కనీస అవగాహన లేకుండా సోషల్ మీడియాలో బంగారం ప్రదర్శిస్తే ఇలాగే జరుగుతుంది” అంటూ ఉచిత సలహాలు ఇస్తున్నారు. ఏదేమైనా డిజిటల్ పబ్లిసిటీ పిచ్చి ఏ రేంజ్ లో కొంపముంచుతుందో చెప్పడానికి ఈ ఘటనే ఒక లైవ్ ఎగ్జాంపుల్.మరి మీరూ ఇలాగే మీ ఇంటిని,నగలు షో ఆఫ్ చేస్తున్నారా ? చెక్ చేసుకోండి !