Crime Investigation Thriller: మర్డర్ మిస్టరీ సినిమాలు అంటే చాలా మందికి ఇష్టమే. కానీ మొదటి అరగంటకే హంతకుడు ఎవరో తెలిసిపోతే ఆ సినిమా మీద ఆసక్తి తగ్గిపోతుంది. అయితే ప్రతి పదిహేను నిమిషాలకు ఒక కొత్త ట్విస్ట్ ఇస్తూ, ప్రేక్షకుడి అనుమానాలను పదేపదే మార్చే సినిమాలు మాత్రం చాలా అరుదుగా వస్తుంటాయి. అలాంటి గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లేతో తెరకెక్కిన మలయాళ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ Paithalattam. తాజాగా తెలుగులోనే ఓటీటీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమాను తెలుసులో ఏ ఓటీటీలో చూడవచ్చు ? కథ ఏంటి ? అనే విషయాలను వివరంగా తెలుసుకుందాం పదండి.
ఒక ప్రముఖ వ్యాపార కుటుంబానికి చెందిన యువతి తన ఇంట్లోనే దారుణ హత్యకు గురవుతుంది. ఈ ఘటన నగరవ్యాప్తంగా సంచలనంగా మారుతుంది. అయితే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులకు ఒక్క ఆధారం కూడా దొరకదు. హంతకుడు ముందే అన్నీ ప్లాన్ చేసుకున్నట్లు ప్రతి క్లూను జాగ్రత్తగా తొలగించి వెళ్లిపోతాడు. దీంతో కేసు మరింత క్లిష్టంగా మారుతుంది.
ఈ కేసును ఛేదించే బాధ్యత ఎక్స్పీరియెన్స్డ్ పోలీస్ అధికారికి అప్పగిస్తారు. దర్యాప్తు మొదలైన తర్వాత పరిస్థితి మరింత ఆసక్తికరంగా మారుతుంది. ఇన్వెస్టిగేషన్ లో భాగంగా చనిపోయిన యువతి వ్యాపార భాగస్వామి, ఆమె మాజీ ప్రేమికుడు, కుటుంబ సభ్యులు, ఇంట్లో పనిచేసే వ్యక్తులు… ఇలా ప్రతి ఒక్కరి దగ్గర ఏదో ఒక రహస్యం బయట పడుతుంది. అసలు ఎవరిని నమ్మాలి ? ఎవరిని అనుమానించాలి ? అనే సందేహం పోలీసులకే కాదు, సినిమా చూసే ప్రేక్షకుడికీ కలుగుతుంది.
ఇదే సమయంలో హంతకుడు పోలీసుల దర్యాప్తును తప్పుదారి పట్టించేలా మెంటల్ గేమ్స్ స్టార్ట్ చేస్తాడు. ఒక క్లూ దొరికిందనుకుంటే, వెంటనే మరో ట్విస్ట్ ఎదురవుతుంది. ఒక్కోసారి అసలు హంతకుడు దొరికిపోయాడనిపించినా, తర్వాత జరిగే పరిణామాలు కథను మరో మలుపు తిప్పేస్తాయి. సినిమాకు పెట్టిన పేరు ‘పైథాలాట్టం’ కూడా ఈ మైండ్ గేమ్స్‌కు అద్దం పడుతుంది.
చివరికి ఆ యువతిని చంపింది ఎవరు అనేది తెలిసిందా ? హత్య వెనుక ఉన్న అసలు ఉద్దేశం ఏమిటి ? హంతకుడు పోలీసులను ఎలా తప్పుదారి పట్టించాడు ? ఇన్ని అనుమానాల మధ్య నిజాన్ని పోలీసులు ఎలా బయట పెట్టారు ? అసలు ఆ మర్డరర్ ఎవరు ? అనే మిస్టరీ క్లైమాక్స్ వరకు సస్పెన్స్‌గానే సాగుతుంది.
థియేటర్లలో సస్పెన్స్ థ్రిల్లర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ చిత్రం జూలై 31 నుంచి ప్రముఖ ఓటీటీ వేదిక Sun NXTలో స్ట్రీమింగ్ అవుతోంది. ఓటీటీలో తెలుగులోనే కాదు, మలయాళం, తమిళం, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. దర్శకుడు బిజు మాధవన్ కథను పూర్తిగా సస్పెన్స్‌పై నడిపిస్తూ, ప్రతి ట్విస్ట్‌కు సరైన న్యాయం చేశారు. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, ఇన్వెస్టిగేషన్ సన్నివేశాలు, క్లైమాక్స్‌లో వచ్చే రివీల్ ఈ సినిమాఓ హైలెట్ అని చెప్పవచ్చు.
మర్డర్ మిస్టరీలు, పోలీస్ ఇన్వెస్టిగేషన్ డ్రామాలు, చివరి వరకు హంతకుడిని ఊహించలేని సస్పెన్స్ థ్రిల్లర్లు చూడాలనుకుంటే దీన్ని మాత్రం మిస్ అవ్వొద్దు. సినిమాలో ప్రతి ట్విస్ట్‌తో ఉత్కంఠను పెంచుతూ, చివరి వరకు ఆసక్తిని కొనసాగిస్తుంది. ఈ వీకెండ్‌లో ఒక మంచి క్రైమ్ థ్రిల్లర్ చూడాలని అనుకుంటే తెలుగు వెర్షన్‌లో అందుబాటులో ఉన్న ఈ మూవీపై ఒక లుక్కేయండి.
Read Also: రోగి మరణం వెనుక గత జన్మల మిస్టరీ… సైకియాట్రిస్ట్‌కే మైండ్ బ్లాంకయ్యే ట్విస్ట్