BigTV English

Groom Relative Attack Guests: పెళ్లిలో అతిథులపై కారు ఎక్కించేసిన వరుడి బంధువు.. టివి రిమోట్ ఇవ్వలేదని హత్య

Groom Relative Attack Guests: పెళ్లిలో అతిథులపై కారు ఎక్కించేసిన వరుడి బంధువు.. టివి రిమోట్ ఇవ్వలేదని హత్య

Groom Relative Attack Guests| క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయాలు లాభదాయకంగా ఉండవు. చివరికి నష్టమే జరుగుతుంది. తాజాగా ఒక వ్యక్తి పెళ్లిలో చిన్న గొడవ కారణంగా అతిథులను కారుతో తొక్కించేశాడు. దీంతో ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన రాజస్థాన్ రాష్ట్రంలో జరిగింది.


వివరాల్లోకి వెళితే.. రాజస్థాన్ లోని దౌసా నగరానికి సమీపంలోని ఒక గ్రామంలో ఆదివారం నవంబర్ 18, 2024న రాత్రి పెళ్లి జరుగుతుండగా.. వరుడి తరపున బంధువు పెళ్లికూతురి బంధువలపై కారు ఎక్కించేశాడు. పోలీసుల కథనం ప్రకారం.. పెళ్లిలో వరుడి కుటుంబం కారులో వచ్చింది. అయితే కల్యాణ మండపం బయట కారు పార్కింగ్ ప్రాంతంలో వధువు తరపున వచ్చిన కొందరు బంధువులు టపాసులు కాలుస్తున్నారు. అప్పుడే అక్కడికి కారు నడిపే వ్యక్తి వారిని అక్కడ కారు పార్కింగ్ చేసేందుకు ఖాళీ చేయాలని చెప్పాడు. కానీ వారంతా అందుకు నిరాకరించారు.

కారు నడిపే వ్యక్తితో వారంతా గొడవపడ్డారు. వాగ్వాదం పెరిగి ఒకరిపై మరొకరు దాడి చేసుకున్నారు. ఏడుగురు కలిసి ఆ కారు నడిపే వ్యక్తిని చితకబాదారు. దీంతో ప్రతీకారం తీర్చుకోవడానికి వరుడు తరపున వచ్చిన వ్యక్తి కారు తీసుకొని వచ్చి వారందరినీ కారుతో తొక్కేశాడు. అనూహ్యంగా జరిగిన ఈ ఘటనలో అందరికీ కాళ్లు, చేతుల ఎముకలు విరిగిపోయాయి. ఘటన జరిగిన వెంటనే దాడి చేసిన వ్యక్తి అక్కడి నుంచి కారు తీసుకొని పారిపోయాడు. పెళ్లికి వచ్చిన అతిధులు కొందరు కారు పార్కింగ్ లో వచ్చి చూడగా.. ఏడుగురు అపస్మారక స్థితిలో కింద పడి ఉన్నారు. అందరూ రక్తపు మడుగులో ఉన్నారు.


Also Read: పిల్లాడిని వెంటబెట్టుకొని జొమాటో డెలివరీ.. మహిళపై ప్రశంసల వర్షం కురిపిస్తున్న నెటిజెన్లు

ఆ వ్యక్తి ఇదంతా వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టాడు. ఇప్పుడా వీడియో బాగా వైరల్ అవుతోంది. మరోవైపు ఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని విచారణ ప్రారంభించారు. గాయపడిన ఏడుగురిని రాజధాని జైపూర్ లో ఒక ఆస్పత్రికి తరలించారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. మరోవైపు దాడి చేసిన వ్యక్తి పరారీలో ఉన్నాడని.. త్వరలోనే అతడిని పట్టుకుంటామాని పోలీసులు హామీ ఇచ్చారు.

టివి రిమోట్ ఇవ్వలేదని హత్య
ఉత్తరా ఖండ్ లో ఇద్దరు సోదరులు.. ఇంట్లో ఎవరూ లేని సమయంలో మద్యం సేవించి టివి రిమోట్ కోసం గొడవపడ్డారు. ఈ గొడవ పెరిగి తమ్ముడి ఛాతీ భాగంలో అన్న కత్తితో పొడిచాడు. ఈ ఘటన ఉత్తరాఖండ్ లోని దెహ్రాదూన్ నగరంలో జరిగింది. అక్కడ ఒకే ఇంట్లో నివసిస్తున్న విజయ్ కుమార్ (36), నీరజ్ కుమార్ (38) నివసిస్తున్నారు. ఇద్దరూ కూలి పని జీవనం సాగిస్తున్నారు. నీరజ్ కుమార్ భార్య అతనితో గొడవ పడి పుట్టింటికి వెళ్లిపోయింది. విజయ్ కుమార్ కు ఇంతవరకు వివాహం కాలేదు. ఇంట్లో వారి తల్లి కూడా ఉంటుంది. కానీ ఘటన జరిగిన రోజు రాత్రి ఆమె బంధువుల ఇంటికి వెళ్లింది.

రాత్రి ఇద్దరు సోదరులు మద్యం సేవించి టివి చూస్తున్నారు. కానీ నీరజ్ కుమార్ కాసేపటికే నిద్ర పోయాడు. ఆ తరువాత కూడా విజయ్ టివి చూస్తున్నాడు. అయితే టివి శబ్దాల కారణంగా నిద్రపోతున్న నీరజ్‌కు ఇబ్బంది కలిగింది. దీంతో తమ్ముడిని టివి స్విచాఫ్ చేయాలని చెప్పాడు. కానీ విజయ్ తన అన్న మాటలను పట్టించుకోలేదు. దీంతో నీరజ్ నిద్రలేచి తమ్ముడి చేతిలోని రిమోట్ లాగేసుకున్నాడు. కానీ విజయ్ కూడా అన్న చేతి నుంచి రిమోట్ లాగేసుకోవాలని ప్రయత్నించాడు. ఈ క్రమంలో ఇద్దరూ కొట్టుకున్నారు. చివరికి నీరజ్ ఒక కత్తి తీసుకొని విజయ్ ఛాతీలో పొడిచాడు. ఆ తరువాత భయపడిపోయి తన తొడల్లడు శంకర్ కు ఫోన్ చేసి విషయం చెప్పాడు. శంకర్ వెంటనే అక్కడికి చేరుకొని అపస్మారక స్థితిలో ఉన్న విజయ్ ని ఆస్పత్రికి తీసుకెళ్లాడు. కానీ అప్పటికే విజయ్ చనిపోయాడని డాక్టర్ల చెప్పారు. ఆ తరువాత జరిగినదంతా పోలిసులకు సమాచారం అందించారు. నీరజ్ తన నేరాన్ని అంగీకరించి పోలిసుల వద్ద లొంగిపోయాడు.

Related News

Cyber scam: 80 ఏళ్ల వృద్ధుడికి హాయ్ చెప్పి.. 8 కోట్లు నొక్కేసిన కి’లేడి’.. పెద్ద మోసమే!

Shamli News: భర్త వద్దన్నాడు.. అయినా భార్య వినలేదు, చివరకు ఏం జరిగిందంటే

Hyderabad incident: టిఫిన్ బాక్స్‌తో చిన్నారిపై టీచర్ దాడి.. తలకు 3 కుట్లు పడేలా కొట్టడమేంటి?

New Bride Incident: ఫ్రెండ్సే చంపేశారా? నవ వధువు కేసులో బిగ్ ట్విస్ట్!

Tamilnadu Crime: రాజకీయ నేత ఫామ్‌హౌస్.. ఎస్ఐని చంపేశారు, ఏం జరిగింది?

Karimnagar Crime: యూట్యూబ్ చూసి డైరెక్షన్ ఇచ్చింది.. పనంతా ప్రియుడు చేశాడు, చివరకు ఏమైంది?

Big Stories

×