Zomato Mother Delivery| వేగంగా పరుగులు తీసే జీవనంలో చాలామంది ఆన్‌లైన్ లో ఫుడ్ ఆర్డర్ చేస్టుంటారు. కోరుకున్న భోజనం డోర్ డెలివరీ అంటే ఈ కాలంలో అందరికీ సరదాగా మారింది. కానీ ఫుడ్ డెలివరి చేసే డెలివరీ బాయ్స్, డెలివరి ఏజెంట్స్ పడుతున్న కష్టం గురించి ఎంత మంది ఆలోచిస్తారు?. ఈ డెలివరి బాయ్స్ సమయానికి కస్టమర్ వరకు ఆర్డర్ చేర్చడానికి ప్రతిరోజు ఎన్నో ఇబ్బందులు పడుతుంటారు. వాతావరణం ఎండగా ఉన్నా? భారీ వర్షాలు కురుస్తున్నా.. ఈ డెలివరీ ఏజెంట్లు కస్టమర్ సంతృప్తి కోసం కష్టపడి పనిచేస్తున్నారు. అయితే ఇదంతా ఒక ఎత్తు. తాజాగా ఒక మహిళా డెలివరి ఏజెంట్ పడుతున్న కష్టాలు మరో ఎత్తు.
ఆమె కేవలం ఒక డెలివరి ఏజెంట్ మాత్రమే కాదు.. ఒక బిడ్డకు తల్లి కూడా. పైగా తాను ఇంటి వద్ద బిడ్డను వదిలేసి పనికోసం వెళ్లలేని పరిస్థితి. ఈ మహిళా డెలివరి ఏజెంట్ గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక పోస్ట్ తెగవైరల్ అవుతోంది.
Also Read: విమాన ప్రయాణంలో ప్రైవేట్ పార్ట్స్ కాలిపోయాయి.. ఎయిర్‌లైన్స్‌పై కేసు పెట్టిన ప్రయాణికుడు!
వివరాల్లోకి వెళ్తే.. @vishvid అనే యూజర్ ఇన్‌స్టాగ్రామ్ లో ఇటీవల ఒక వీడియో పోస్ట్ చేశాడు. ఆ వీడియోలో ఒక మహిళ జొమాటో డెలివరి ఏజెంట్ గా పనిచేస్తోంది. అయితే ఆమె ఒంటరిగా ఆ పని చేయడం లేదు. డెలివరీ సమయంలో తన రెండేళ్ల బిడ్డను తోడుగా తీసుకెళుతోంది. ప్రతిరోజు ఆమె ఇంటి నుంచి బయలు దేరే సమయంలో బిడ్డను తన బైక్ పై ముందుభాగంలో కూర్చోబెట్టుకొని.. వెనుక జొమాటో ఫుడ్ బాక్స్ బైక్ పై కట్టుకొని బయలుదేరుతుంది. ఆమె ఇలా ఇబ్బంది పడుతూ పనిచేస్తుండడం చూసిన విష్ విడ్ యూజర్ ఆమెతో కాసేపు మాట్లాడాడు.
ఆమె ఎందుకు ఈ పనిచేయాల్సి వస్తోంది. ఫుడ్ డెలివరీలో ఆమె పడుతున్న కష్టాలేంటి? బిడ్డను తనకు తోడుగా ఎందుకు తీసుకురావాల్సి వస్తోంది? అని ప్రశ్నించాడు. అప్పడు ఆమె తన వ్యక్తిగత జీవితం గురించి కొన్ని విషయాలు చెప్పింది. తాను ఒక హోటల్ మేనేజ్ మెంట్ కోర్సు చేశానని.. కానీ ఉద్యోగం లభించకపోవడంతో ఇంట్లో పెళ్లి చేశానని చెప్పింది. అయితే పెళ్లి తరువాత ఇంట్లో ఆర్థిక సమస్యలు మరింత తీవ్రం కావడంతో తిరిగి ఉద్యోగం చేయాల్సిన అవసరం వచ్చిందని తెలిపింది. కానీ ఎక్కడికి ఉద్యోగం కోసం వెళ్లినా.. తన బిడ్డను వెంటబెట్టుకొని వెళ్లితే.. వాళ్లు ఉద్యోగం ఇవ్వడానికి నిరాకరించారని ఆవేదన వ్యక్తం చేసింది.
Also Read: 56 ఏళ్ల రాజుకు 16వ భార్యగా 21ఏళ్ల సుందరి.. ‘రాజకీయం కాదు ప్రేమే కారణం’!
చివరికి కొందరు డెలివరి ఏజెంట్లు పనిచేస్తుండడం చేసి వారిలాగా తాను కూడా చేయగలనని అనిపించింది. ఎందుకంటే తన ఇంట్లో ముందు నుంచే బైక్ ఉంది. దాంతో వెంటనే బైక్ నడపడం నేర్చుకొని.. నెల రోజుల క్రితం పనిప్రారంభించానని చెప్పింది. మొదట్లో ఏ పని అయినా కష్టంగా అనిపిస్తుంది. కానీ తనకు ఇప్పుడు ఇప్పుడలా అనిపించడం లేదని చెప్పుకొచ్చింది. కష్టపడేతత్వం ఉంటే ఏ పని కూడా చిన్నది.. పెద్దది కాదని.. వ్యాఖ్యానించింది.
ఈ వీడియో వైరల్ కావడంతో విపరీతమైన కామెంంట్లు వస్తున్నాయి. చాలా మంది నెటిజెన్లు.. ఆమెను ఆడ సింహంతో, ఝాన్సీ లక్ష్మిబాయ్ తో పోలుస్తున్నారు.