Jio, Airtel Lost Users: బీఎస్ఎన్ఎల్‌కు పూర్వ వైభవం వస్తుందా? బీఎస్ఎన్ఎల్ ధాటికి జియో, ఎయిర్‌టెల్ కంపెనీలు గింజుకుంటున్నాయా? బీఎస్ఎన్ఎల్‌ను ఆదరించే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోందా? గడిచిన రెండునెలల్లో కస్టమర్లు పెరిగారా? జియో, ఎయిర్ టెల్ కంపెనీలకు వినియోగదారులు దూరం అవుతున్నారా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి.
మార్కెట్‌లో టెలికాం టారిఫ్ వార్ తీవ్రమవుతోంది. ఒకప్పుడు ప్రైవేటు కంపెనీల మధ్య ధరల యుద్ధం జరిగింది. టెలికాం సేవల రంగంలోకి జియో దిగడంతో పలు కంపెనీలు మర్జ్ కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక తమకు ఎదురులేదని భావించాయి జియో, ఎయిర్‌టెల్ కంపెనీ. మార్కెట్‌లో వీరిదే అగ్ర భాగం. పరిస్థితి గమనించిన బీఎస్ఎన్ఎల్ రంగంలోకి దిగేసింది.
జియో, ఎయిర్‌టెల్‌కు గట్టి పోటీ ఇస్తోంది. బీఎస్ఎన్ఎల్ దెబ్బకు వినియోగదారులు ఆ కంపెనీలకు దూరమవుతున్నారు. లేటెస్ట్‌గా రెండు నెలల వ్యవధిలో 6.5 మిలియన్ల కొత్త వినియోగదారులు బీఎస్ఎన్ఎల్ వైపు వెళ్లిపోయారు. అటు జియో, ఎయిర్‌టెల్ దూరమవుతున్నారు వినియోగదారులు.
ఇటీవల కాలంలో జియో, ఎయిర్‌టెల్ కంపెనీలు వినియోగదారులపై ఎడాపెడా ఛార్జీలు మోపడం మొదలుపెట్టాయి. వినియోగదారుల నుంచి అవుట్‌పుట్ తీసుకున్న బీఎస్ఎన్ఎల్, నెట్‌వర్క్ కవరేజీని మెరుగుపరచడం, తక్కువ ధరలకు ప్లాన్‌లను ప్రవేశపెట్టడం, కొత్త సేవలను అందుబాటులోకి తీసుకురావడం వంటి వ్యూహాత్మక ఎత్తుగడలు వేసింది.. సక్సెస్ అయ్యింది.
ALSO READ: గుడ్ న్యూస్.. మళ్లీ తగ్గిన బంగారం ధరలు.. తులం ఎంతంటే..
ప్రైవేటు టెలికాం కంపెనీలైన జియో, ఎయిర్‌టెల్ నుంచి యూజర్స్ డ్రాపవ్వడం మొదలైంది. వినియోగదారులు తగ్గిపోవడంతో ఏం చెయ్యాలో తెలియక దిక్కుతోచని పరిస్థితుల్లో పడ్డాయి ఆయా కంపెనీలు. సమీప భవిష్యత్తులో టారిఫ్‌లను పెంచబోమని ప్రకటించింది బీఎస్ఎన్ఎల్ (BSNL). బీఎస్ఎన్ఎల్ స్టేట్మెంట్‌పై ప్రైవేటు టెలికాం కంపెనీలు కాసింత గుర్రుగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.
గతంలో కంటే ప్రతి ఒక్కరి చేతిలో సెల్‌ఫోన్ సాధారణమైంది. ఫోన్ కాల్స్‌తోపాటు డేటాను కూడా ఉపయోగిస్తున్నారు. దీన్ని గమనించిన బీఎస్ఎన్ఎల్, ఇటువైపు దృష్టి సారించింది. గ్రామీణ ప్రాంతాల్లో బీఎస్ఎన్ఎల్ సేవలు ఉండడంతో అటు వైపు దృష్టి సారించడంతో వినియోగదారులు క్రమంగా పెరుగుతున్నారు.
ఈ లెక్కన బీఎస్ఎన్ఎల్‌కు పూర్వ వైభవం రావడం ఖాయమనే ప్రచారం టెలికాం సెక్టార్‌లో సాగుతోంది. అన్నట్లు 5జీ మొబైల్ సిమ్‌లను సైతం ప్రారంభించింది. మొత్తానికి ‘బీఎస్ఎన్ఎల్ అందరికీ కనెక్ట్’ అవుతుందన్నమాట.
🚨 BSNL has added 6.5 million new users in the last two months while Jio and Airtel lost users.
BSNL announced that it will not raise tariffs in the near future. pic.twitter.com/AQ5OWtj3uC
— Indian Tech & Infra (@IndianTechGuide) November 16, 2024
🚨 BSNL launched a 5G SIM card. pic.twitter.com/7CJ87Eb0r6
— Indian Tech & Infra (@IndianTechGuide) November 18, 2024