E-Paper
Advertisement

కళింగపట్నం వద్ద తీరం దాటిన తీవ్ర వాయుగుండం, ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు, విద్యాసంస్థలకు సెలవు

కళింగపట్నం వద్ద తీరం దాటిన తీవ్ర వాయుగుండం, ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు, విద్యాసంస్థలకు సెలవు
Advertisement

Heavy Rains In AP: బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తీరం దాటింది. శ్రీకాకుళం జిల్లా కళింగపట్నానికి నైరుతి దిశలో తీరం దాటినట్టు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఈ క్రమంలో ఉత్తరాంధ్ర జిల్లాల్లో 24 గంటలపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. పరిస్థితి గమనించిన ప్రభుత్వం, SDRF, NDRF బృందాలను రెడీ చేసింది.

అర్ధరాత్రి కళింగపట్నం వద్ద తీరం దాటిన తీవ్ర వాయుగుండం

బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత శ్రీకాకుళం జిల్లా కళింగపట్నం వద్ద తీరం దాటింది. తీరం దాటే సమయంలో గంటకు 55 నుంచి 75 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచాయి. ఆ సమయంలో గాలులు బీభత్సం సృష్టించాయి. చెట్లు విరిగిపోయాయి, విద్యుత్ స్తంభాలు కూలిపోయాయి. శ్రీకాకుళంతోపాటు విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే కురుస్తాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఫలితంగా పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాను నిలిపివేశారు.

ఉత్తరాంధ్ర జిల్లాల్లో అతి  భారీ వర్షాలు, విద్యా సంస్థలకు సెలవు

Advertisement

ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. వర్షం దాటికి గురువారం స్కూళ్లు, అంగన్వాడి కేంద్రాలు సెలవు ప్రకటించారు అధికారులు. ఒడిషాలో కురుస్తున్న భారీ వర్షానికి నాగావళి నదికి వరద నీరు అమాంతంగా పెరిగింది. ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా ఉండేందుకు తగిన చర్యలు తీసుకోవాలని, అధికారులంతా అలర్ట్‌గా ఆయా జిల్లాల కలెక్టర్లు సూచన చేశారు. బుధవారం ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు కొత్తవలసలో అత్యధికంగా 65 మిల్లీమీటర్ల వర్షం పడింది. గురువారం ఉదయం 4 గంటలకు 79 మిల్లీమీటర్ల వర్షం కురిసినట్టు అధికారులు తెలిపారు.

కళింగపట్నం, గార్ల, శ్రీకాకుళం రూరల్, ఎచ్చెర్ల, రణస్థలం, నరసన్నపేట మండలాల్లో బలమైన ఈదురు గాలులతోపాటు కుండపోత వర్షం కురుస్తోంది. ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు చేరుతుండటంతో నాగావళి, వంశధార నదులు, వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. కళింగపట్నం తీరప్రాంత రహదారుల్లో పలుచోట్ల చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరగడంతో రాకపోకలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. కళింగపట్నం, బారువా, భవానీపట్నం తీరాల్లో తీవ్ర అలజడిగా మారింది. ఇప్పటికే ఐదో నెంబర్ ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది.

Advertisement

ALSO READ: సాయికృష్ణ లాకప్ డెత్ కేసు.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. హైకోర్టు విచారణపై స్టే, ఈనెల 30 లోపు..

మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని అధికారులు ఆదేశించారు. కళింగపట్నం తీరప్రాంత గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు, పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. సహాయక చర్యల కోసం ఎన్డీఆర్‌ఎఫ్,ఎస్డీఆర్‌ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. గురువారం రోజంతా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ అంచనా వెల్లడించింది.

Related News

సాయికృష్ణ లాకప్ డెత్ కేసు.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. హైకోర్టు విచారణపై స్టే, ఈనెల 30 లోపు..

శ్రీకాకుళంలో విషాదం.. టెక్కలి వద్ద రైలు ఢీకొని నలుగురు యువకులు దుర్మరణం!

మెగా డీఎస్సీ రచ్చ.. 250 మంది వైసీపీ నేతలపై అట్రాసిటీ కేసులు!

ఏపీలో పొంగి ప్రవహిస్తున్న వాగులు-వంకలు, అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష, కంట్రోల్ రూమ్ నెంబర్లు

ఏపీలో పింఛన్‌దారులకు బిగ్ అలర్ట్.. కేంద్రం వాటా బ్యాంక్ ఖాతాలోకి, ఒకసారి చెక్ చేసుకోండి?

ధర్మవరంలో కేతిరెడ్డి మాస్టర్ స్ట్రోక్.. ఆ మాజీ కౌన్సిలర్లకు మైండ్ బ్లాంక్!

నన్ను మోసం చేశాడు!.. మేనల్లుడిపై బొత్స సెంటిమెంట్ అస్త్రం.. వర్కవుట్ అవుతుందా?

Big Stories

Advertisement
×