E-Paper
Advertisement

తెలంగాణలో తీవ్ర వాయుగుండం ఎఫెక్ట్.. బూర్గంపాడులో తుఫాన్ బీభత్సం, హుద్ హుద్‌ని తలపించిన గాలులు

తెలంగాణలో తీవ్ర వాయుగుండం ఎఫెక్ట్.. బూర్గంపాడులో తుఫాన్ బీభత్సం, హుద్ హుద్‌ని తలపించిన గాలులు
Advertisement

Bhadradri Kothagudem: బంగాళాఖాతంలో ఏర్పడిన ఆర్నబ్ తీవ్ర వాయుగుండం బీభత్సం సృష్టించింది.  ఒడిషా, ఏపీకే కాకుండా తెలంగాణ లోనూ తీవ్ర ప్రభావం చూపింది. వాయుగుండం తీరం దాటే సమయంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో బీభత్సం సృష్టించింది. బూర్గంపాడు మండలం మొరంపల్లి బంజరలో తుఫాన్ ఊహించని విధంగా విధ్వంసం చేసింది. భారీ వర్షాలతోపాటు బలమైన ఈదురుగాలులు ఆ ప్రాంతాన్ని చుట్టేశాయి. పలువురు గాయపడ్డారు.

తెలంగాణలో తీవ్ర వాయుగుండం ఎఫెక్ట్

బంగాళాఖాతంలో ఏర్పడిన ఆర్నబ్ వాయుగుండం అర్ధరాత్రి కళింగపట్నం వద్ద తీరం ధాటింది. ఆ సమయంలో ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు, బలమైన ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. గంటకు 100 కిలోమీటర్లు వేగంతో ఈదురుగాలులు వీచాయి. ఒకవిధంగా చెప్పాలంగా దశాబ్దం కిందట విశాఖను అతలాకుతలం చేసిన హుద్ హుద్‌ను తలపించేలా గాలులు బీభత్సం సృష్టించాయి. ముఖ్యంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం మొరంపల్లి బంజరలో ఆర్నబ్ బీభత్సం చేసింది. ఈదురుగాలుల ధాటికి చెట్లు విరిగిపోవడం, షాపుల పైకప్పు షీట్లు కొట్టుకుపోయాయి.

కొత్తగూడెం జిల్లా బూర్గంపాడులో తుఫాన్ బీభత్సం

Advertisement

బుధవారం సాయంత్రం ఐదు గంటలను భారీ వర్షాలు కుమ్మేశాయి. ఆ సమయంలో దట్టమైన మేఘాలు, భారీగా ఈదురు గాలులు వణికించాయి. చెట్లు విరిగిపడడం, షెడ్లపై రేకులు గాలికి ఎగిరిపడ్డాయి. ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు. గురు- శుక్రవారాల్లో ఉత్తర, తూర్పు తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ- IMD హెచ్చరించింది. బుధవారం నాడు కుమరం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో భారీ వర్షాలు పడ్డాయి.

ALSO READ: రూ. 20 చిల్లర కోసం వివాదం.. ఆటో డ్రైవర్ దారుణ హత్య!

Advertisement

గురువారం రోజు ఆదిలాబాద్, జగిత్యాల, కరీంనగర్, పెద్దాపల్లి, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ జిల్లాల్లో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం అంచనా వేసింది వాతావరణ కేంద్రం. ఇక హైదరాబాద్‌ నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం పడింది. గురువారం ఉదయానికి కాస్త శాంతించింది. ఇవాళ కూడా భారీ వర్షం పడే అవకాశముందని తెలిపింది. బుధవారం ఉదయం నుంచి గడిచిన 24 గంటల్లో హైదరాబాద్‌లో 21.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.

 

Related News

హైదరాబాద్ గణేష్ నిమజ్జనంలో విషాదం.. ట్యాంక్ బండ్ వద్ద హిట్ అండ్ రన్, ఎస్ఐ మృతి

రూ. 20 చిల్లర కోసం వివాదం.. ఆటో డ్రైవర్ దారుణ హత్య!

SLBC సొరంగ మార్గం పూర్తయితే.. ఇక నా జన్మధన్యమే.. మంత్రి కోమటిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!

హైదరాబాద్‌లో గణేష్ నిమజ్జనం ట్రాఫిక్ ఆంక్షలు విడుదల.. ఈ రూట్లన్నీ క్లోజ్..?

విద్యుత్ ప్రజల జీవనరేఖ.. దాన్ని ఆరిపేస్తారా? కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డ కేటీఆర్

ముంబయిలో దోపిడికి స్కెచ్.. నగరంలో క్యాబ్ డ్రైవర్ హత్య.. పటాన్ చెరు మర్డర్ కేసులో సంచలన నిజాలు!

వాహనదారులకు గుడ్ న్యూస్.. ఆర్‌టీఓ ఆఫీసుల్లో దళారీల నిషేధం!

Big Stories

Advertisement
×