E-Paper
Advertisement

మెగా డీఎస్సీ రచ్చ.. 250 మంది వైసీపీ నేతలపై అట్రాసిటీ కేసులు!

మెగా డీఎస్సీ రచ్చ.. 250 మంది వైసీపీ నేతలపై అట్రాసిటీ కేసులు!
Advertisement

Mega DSC: మెగా డీఎస్సీ స్పోర్ట్ కోటాలో అవకతవకలు జరిగాయంటూ.. విజయవాడ శాప్ ఆఫీస్‌ని ముట్టడించారు వైసీపీ నేతలపై కేసులు నమోదయ్యాయ్. ఇందులో.. అట్రాసిటీ సెక్షన్లు కూడా చేర్చారు. మాజీ మంత్రులపైనా ఎఫ్ఐఆర్ నమోదైంది. సూర్యారావుపేట, మాచవరం, కృష్ణలంక పీఎస్‌ల పరిధిలో అందిన ఫిర్యాదులతో.. 250 మందికి పైగా వైసీపీ నేతలపై పోలీసులు కేసులు నమోదు చేశారు. మాచవరం పీఎస్‌లో శాప్ డైరెక్టర్ ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా.. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టారు. వీడియోలు, సీసీ ఫుటేజీల ఆధారంగా దాడికి పాల్పడిన వారిని గుర్తిస్తున్నారు. పరారీలో ఉన్న నేతల కోసం పోలీసులు గాలిస్తున్నారు.

సీఎం చంద్రబాబు సీరియస్..

Advertisement

హత్యాయత్నం, ప్రభుత్వ ఉద్యోగులపై దాడి, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద సెక్షన్లు చేర్చినట్లు తెలుస్తోంది. కేసులు నమోదైన వారిలో.. మాజీ మంత్రులు జోగి రమేశ్, వెలంపల్లి శ్రీనివాస్‌తో పాటు దేవినేని అవినాశ్, జక్కంపూడి రాజా, పేర్ని కిట్టు, నాగార్జున యాదవ్, రవిచంద్ర లాంటి నేతల పేర్లు ఉన్నాయి. టీచర్లపై దాడికి పాల్పడిన వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. దాడిని సహించేది లేదని మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. డీఎస్సీపై తాను ఎప్పుడైనా చర్చకు సిద్ధమని.. జగన్ సిద్ధమా? అని లోకేశ్ సవాల్ చేశారు. టీచర్లపై దాడి చేసిన వారిని ఎవరినీ వదిలిపెట్టబోనని హెచ్చరించారు.

సీబీఐ విచారణ జరపాల్సిందే..

Advertisement

వైసీపీ మాత్రం కేసులు నమోదు చేయడాన్ని ఖండించింది. డీఎస్సీ స్పోర్ట్స్ కోటా నియామకాల్లో అవకతవకలు జరిగాయని, సీబీఐ విచారణ జరపాల్సిందేనని డిమాండ్ చేస్తోంది. తమ ఆందోళన ప్రశాంతంగా సాగిందని, దానిపైనా కేసులు పెట్టడమేంటని ప్రశ్నిస్తోంది. ఇక.. కాజా టోల్ ప్లాజా దగ్గర అంబటి రాంబాబు సహా పలువురు నేతలను పోలీసులు అడ్డుకున్నారు. ఇదంతా చూస్తుంటే.. మెగా డీఎస్సీ వివాదం ఇప్పట్లో చల్లారేలా లేదు. ఈ అరెస్టుల పర్వం ఎక్కడిదాకా వెళ్తుందన్నది ఆసక్తి రేపుతోంది.

Also Read: తెలంగాణ భవన్, ఎయిర్‌పోర్టు డిజైన్లలో కాకతీయ మార్కు.. సీఎం రేవంత్ కీలక నిర్ణయం!

Tags

Related News

సాయికృష్ణ లాకప్ డెత్ కేసు.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. హైకోర్టు విచారణపై స్టే, ఈనెల 30 లోపు..

శ్రీకాకుళంలో విషాదం.. టెక్కలి వద్ద రైలు ఢీకొని నలుగురు యువకులు దుర్మరణం!

ఏపీలో పొంగి ప్రవహిస్తున్న వాగులు-వంకలు, అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష, కంట్రోల్ రూమ్ నెంబర్లు

ఏపీలో పింఛన్‌దారులకు బిగ్ అలర్ట్.. కేంద్రం వాటా బ్యాంక్ ఖాతాలోకి, ఒకసారి చెక్ చేసుకోండి?

ధర్మవరంలో కేతిరెడ్డి మాస్టర్ స్ట్రోక్.. ఆ మాజీ కౌన్సిలర్లకు మైండ్ బ్లాంక్!

నన్ను మోసం చేశాడు!.. మేనల్లుడిపై బొత్స సెంటిమెంట్ అస్త్రం.. వర్కవుట్ అవుతుందా?

టెక్నికల్ గ్లిచ్ వెనుక ఏం జరిగింది? బెంగళూరు–విజయవాడ విమానం డిలే, అందులో ఏపీ మంత్రి

Big Stories

Advertisement
×