Botsa Satyanarayana: బొత్స సత్యనారాయణ.. ఉమ్మడి రాష్ట్రంలో ఢిల్లీలో చక్రం తిప్పారు. వైసీపీ హయాంలో ప్రభుత్వానికి చాలా సార్లు ట్రబుల్ షూటర్ లా పని చేశారు. కానీ, ఇప్పుడు సీన్ మారింది. గ్రామస్థాయి నేతలతో వరుసగా భేటీ అవుతున్నారు. వార్డు మెంబర్లను కూడా పేరుపెట్టి పలకరిస్తున్నారు. కొన్ని కీలకమైన గ్రామాల్లో పర్యటనకు కూడా రెడీ అవుతున్నారు. దీనంతటకీ కారణం ఒకటే.. సత్తిబాబు మేనల్లుడు చిన్న శ్రీను టీడీపీ తీర్థం పుచ్చుకోవడమే.
రంగంలోకి దిగిన బొత్స
సత్తిబాబు రాష్ట్ర రాజకీయాలను చూసుకుంటే చిన్నశ్రీను జిల్లాలో కార్యకర్తలను సమన్వయం చేసుకునేవారు. దీంతో రాజకీయంగా ఎలాంటి ఇబ్బంది ఉండేది కాదు. కానీ, చిన్న శ్రీను లేకపోవడంతో.. ఇప్పుడు స్వయంగా బొత్సయే రంగంలోకి దిగారు. క్షేత్ర స్థాయి నేతలకు టచ్ లోకి వెళ్తున్నారు. మేనల్లుడు తనని మోసం చేశాడని సెంటిమెంట్ డైలాగ్స్ కొడుతున్నారాయన. కార్యకర్తలంతా తనకు అండగా ఉండాలని కోరుతున్నారు. వచ్చే ఎన్నికల్లో గెలిచి మంత్రి నైతే కార్యకర్తలంతా మంత్రులైనట్టేనని చెబుతూ.. క్యాడర్ తన నుంచి జారిపోకుండా జాగ్రత్తపడుతున్నారు బొత్స.
మేనమామకు షాక్ ఇచ్చిన శ్రీను..
మేనమామకు షాక్ ఇచ్చిన చిన్న శ్రీను పరిస్థితి దాదాపుగా అలాగే ఉంది. గతంలో వైసీపీ కార్యకర్తలకు ఇంట్లో మనిషిగా ఉన్న ఆయనకు ఇప్పుడు టీడీపీలోని పాలిటిక్స్ కొత్తగా అనిపిస్తున్నాయి. టీడీపీ క్యాడర్‌తో కనెక్ట్ అవ్వడానికి గ్రౌండ్ లెవెల్‌కి వెళ్తున్నారు. ఏ గ్రామంలో ఎవరు కీలకం? టీడీపీకి ఏ ప్రాంతంలో పట్టుంది అని పరిశీలిస్తున్నారు. ఒకప్పుడు ప్రత్యర్థులుగా భావించినవారితో కనెక్ట్ అవ్వడం కాస్త ఇబ్బందిగా ఉన్నా తప్పడం లేదు. వైసీపీలో గ్రౌండ్‌లో ఎంత పట్టు ఉండేదో.. ఇప్పుడు టీడీపీలో అంతే పట్టు కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అందుకే సర్పంచ్, ఎంపీటీసీ స్థాయి నేతలతో కాల్స్ మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో బలం పెంచుకుంటున్నారు. చిన్న శ్రీను వైసీపీని వీడి టీడీపీలో చేరడంతో.. ఇద్దరి కీలక నేతలు కూడా కొత్తరకమైన వ్యూహాలతో ప్రజల్లోకి వెళ్లాల్సి వస్తోంది.
Also Read: అక్టోబర్ 15 నుంచి మారనున్న యూపీఐ రూల్స్.. రూ. 2,000 లోపు చెల్లింపులకు బిగ్ రిలీఫ్!