Amaravati: పశ్చిమ మధ్య వాయువ్య బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం చురుగ్గా కదులుతోంది. దీని కారణంగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో మంగళవారం ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. ఈ క్రమంలో ప్రజలు అలర్ట్‌గా ఉండాలని సూచన చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు. భారీ వర్షాలు నేపథ్యంలో వివిధ జిల్లాలకు సంబంధించి కంట్రోల్ రూమ్ నెంబర్లు ప్రకటించింది ఏపీ ప్రభుత్వం.
పశ్చిమ మధ్య వాయువ్య బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం జోరుగా కదులుతోంది. గంటకు 5 కి.మీ వేగంతో కదులుతోంది. ప్రస్తుతానికి గోపాల్‌పూర్‌కు 150 కి.మీ- విశాఖపట్నానికి 140 కి.మీ దూరంలో కేంద్రీకృతమైంది. బుధవారం రాత్రికి విశాఖపట్నం- గోపాల్‌పూర్ మధ్య కళింగపట్నం సమీపంలో తీరం దాటే అవకాశం అవకాశముందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది. దీని ప్రభావంతో బుధ, గురువారాల్లో ఉత్తరాంధ్ర, కోస్తాంధ్రలో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. ఆకస్మిక వరదలు వల్ల లోతట్టు ప్రాంత ప్రజలు జాగ్రత్తులు తీసుకోవాలని సూచన చేసింది.
తీవ్ర వాయుగుండం కారణంగా రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలపై సిఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. సీఎస్, డీజీపీతోపాటు వివిధ శాఖల అధికారులు, మంత్రులతో సమీక్ష నిర్వహించారు. తుఫాను బుధవారం మధ్యాహ్నం శ్రీకాకుళం జిల్లాలోని శ్రీకాకుళం- కవిటి మధ్య తీరం దాటే అవకాశం ఉందని తెలిపారు అధికారులు. తీరం దాటే సమయంలో గాలుల వేగం గంటకు 85 కిలోమీటర్ల వరకు ఉండొచ్చని వివరించారు. తుఫాన్ ప్రభావంతో శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, పోలవరం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలియజేశారు. పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, కోనసీమ, కాకినాడ, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి అతి భారీ వర్షాలు పడతాయని తెలిపారు.
24, 25న పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశముందని తెలిపారు. 261 మండలాల్లో 129 మండలాలకు భారీ వర్షం, 121 మండలాల్లో సాధారణ వర్షం, 9 మండలాలకు అతి భారీ వర్షం, 2 మండలాలకు తీవ్ర వర్షం అంచనా వేశారు. ఉత్తర కోస్తా, గోదావరి పరీవాహక ప్రాంతాల్లో భారీ వర్షాలతో వాగులు, వంకల్లో ఆకస్మిక ప్రవాహాలు ఏర్పడే అవకాశాలు ఉంది. జిల్లా కలెక్టర్లు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని సిఎం చంద్రబాబు ఆదేశం. ఆకస్మిక వరదలు ఉండే ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు. నదుల్లో ప్రవాహాలను ఎప్పటికప్పుడు మానిటర్ చేసి రిజర్వాయర్లలో నీటి నిల్వలకు అవసరమైన చర్యలు తీసుకోవాలని నిర్దేశం చేశారు. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరు జిల్లా కలెక్టర్లు ఎప్పటికప్పుడు డివిజన్, మండల స్థాయి అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి వర్షాల పరిస్థితిని సమీక్షిస్తున్నారు.
ALSO READ: ఏపీలో పింఛన్‌దారులకు బిగ్ అలర్ట్.. కేంద్రం వాటా బ్యాంక్ ఖాతాలోకి, ఒకసారి చెక్ చేసుకోండి?
భారీ వర్షాల నేపథ్యంలో కంట్రోల్ రూమ్ నెంబర్లు ప్రకటించింది ఏపీ ప్రభుత్వం
శ్రీకాకుళం- 9701400865.
టెక్కలి – 9490610050.
పలాస – 08945241084.
పాలకొండ – 8332843546.
పార్వతీపురం – 9398594750.
విజయనగరం టౌన్ & రూరల్ – 9490610102.
బొబ్బిలి – 9490610121.
విశాఖ జోన్-1- 9490610019.
టోల్ ఫ్రీ నెంబర్- 1912, కార్పొరేట్ ఆఫీస్- 8331018762.
విశాఖ జోన్-2 – 9849628880.
విశాఖ జోన్-3 – 9491030722.
అనకాపల్లి – 9490610023
కశింకోట – 8333810597.
నర్సీపట్నం – 9491030723.
పాడేరు – 9490610027.
కాకినాడ – 9490610856
పెద్దాపురం – 9493178728.
జగ్గంపేట – 9490610097.
రాజమహేంద్రవరం టౌన్ – 9490610855.
రాజమహేంద్రవరం రూరల్ – 9490610859.
నిడదవోలు – 9493177540.
అమలాపురం – 9490610101.
కొత్తపేట – 9493178821.
రంపచోడవరం – 8309771508.
ఏలూరు – 9440904037.
జంగారెడ్డిగూడెం – 9491030712.
భీమవరం – 9490610143.
తాడేపల్లిగూడెం – 9493177806.
నరసాపురం – 7382050943.