Mike Hesson On IND VS PAK: ఏషియన్ గేమ్స్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో టీమిండియాతో మ్యాచ్ జరిగితే, చిత్తుగా ఓడిస్తామని శపథం చేశారు పాకిస్తాన్ హెడ్ కోచ్ మైక్ హెసన్. టీమిండియా జట్టును ఓడించే శక్తి, సామర్ధ్యాలు పాకిస్తాన్ దగ్గర ఉన్నాయని వ్యాఖ్యానించారు. వైట్ బాల్ క్రికెట్ లో టీమిండియా చాలా బలమైన జట్టని తమకు తెలుసని వివరించారు. కానీ, బలమైన టీమిండియాను ఓడించి శక్తి పాకిస్తాన్ జట్టు దగ్గర ఉందని.. వచ్చే ఏషియన్ గేమ్స్ లో తలపడితే తమ సత్తా ఏంటో చూపిస్తామని సవాల్ విసిరారు. ఈ ఆసియా క్రీడలలో టీమిండియన్ ఓడించకపోయినా, తీవ్ర ఒత్తిడిలోకి నెట్టేస్తామని హెచ్చరించారు. కచ్చితంగా ఫుట్ బాల్ ఆడుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. అలా కాకపోతే తానే కోచ్ పదవీ నుంచి తప్పుకుంటానని సవాల్ విసిరినట్లు తెలుస్తోంది. దీంతో పాకిస్తాన్ కోచ్ మైక్ హెసన్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.
పాకిస్తాన్ క్రికెట్ జట్టు క్రమక్రమంగా బలపడుతోందని హెడ్ కోచ్ మైక్ హెసన్ వ్యాఖ్యానించారు. అప్పట్లో పాకిస్తాన్ వరుసగా ఓడిపోయేదని.. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉందని తెలిపారు. డెబ్బై శాతం విజయాలను నమోదు చేసుకునే శక్తి సామర్థ్యాలు పాకిస్థాన్ కు వచ్చాయని వివరించారు. స్వదేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా పాకిస్తాన్ క్రికెటర్లు తమ విజయాన్ని అవకాశాలను పెంచుకున్నట్లు తెలిపారు. కొత్త ప్లేయర్లు జట్టులోకి వచ్చిన నేపథ్యంలో పాకిస్తాన్ బలంగా తయారైందని తెలిపారు. దీని రిజల్ట్ భవిష్యత్తులో కనిపిస్తుందని ప్రత్యర్థులను హెచ్చరించారు.
2027 వన్డే వరల్డ్ కప్ గెలవడమే లక్ష్యంగా పెట్టుకున్నామని పాకిస్తాన్ హెడ్ కోచ్ మైక్ హెసన్ స్పష్టం చేశారు. ఇప్పటినుంచి వైట్ బాల్ క్రికెట్ పై దృష్టి సారించినట్లు తెలిపారు. దీని కోసం ఎంతకైనా తెగిస్తామన్నారు. 2027 వన్డే వరల్డ్ కప్ దక్షిణాఫ్రికాలో జరుగుతుంది కాబట్టి… అక్కడి వాతావరణం చేయబోతున్నట్లు తెలిపారు. దక్షిణాఫ్రికా తరహా పిచ్ పై ఆడేందుకు ప్లేయర్లను సన్నద్ధం చేస్తున్నట్లు వివరించారు.
ఏ ఒక్క ఛాన్స్ కూడా ఈ వరల్డ్ కప్ లో పోగొట్టబోమని తెలిపారు. అంతేకాదు ఈ టోర్నమెంట్ లోనే టీమ్ ఇండియాతో కూడా మ్యాచ్ జరిగే ఛాన్స్ ఉన్నాయని వెల్లడించారు. అక్కడ కూడా టీం ఇండియాను చిత్తుచిత్తుగా ఓడిస్తామని హెచ్చరించారు. అయితే పాకిస్తాన్ హెడ్ కోచ్ మైక్ హెసన్ చేసిన స్టేట్మెంట్ కు ఇండియన్ అభిమానులు కూడా కౌంటర్ ఇస్తున్నారు. ఇండియాకు ప్రతి ఒక్కడు సవాల్ విసరడమే… కానీ ఇప్పటివరకు ఎవడు ఏం పీకింది లేదంటూ సెటైర్లు విసురుతున్నారు. పాకిస్తాన్ జట్టునే తాము చిత్తుగా ఓడిస్తామని వార్నింగ్ ఇస్తున్నారు.