Nindu Noorella Saavasam Serial Today Episode: మనోహరి ప్లాన్ ప్రకారం మిస్సమ్మను తీసుకుని ఆశ్రమానికి బయలుదేరుతుంది. మధ్యలో చంభా అడ్డగించి మిస్సమ్మలోని అరుంధతి ఆత్మను బంధించాలని ప్లాన్ చేస్తారు. అనుకున్నట్టుగానే బయలుదేరుతారు. అయితే రోడ్డు మీద చంభా మేకులు వేస్తుంది. అవి కారు టైరులో గుచ్చుకుని పంక్చర్ అయితే కారు ఆగిపోతుంది. అప్పుడు ఆరు ఆత్మను బంధించాలని చంభా ఎదురుచూస్తూ ఉంటుంది. కానీ కారు టైర్‌కు మేకులు గుచ్చుకోవు దీంతో కారు వెళ్లిపోతుంది. మనోహరి షాక్ అవుతుంది. కారు ఆశ్రమం ముందు ఆగుతుంది. రాథోడ్, మిస్సమ్మ లోపలికి వెళితే మనోహరి కారు దగ్గరే నిలబడుతుంది.
లోపలి నుంచి రాజు, సరస్వతి వార్డెన్ బయటకు గుమ్మం దగ్గరకు వస్తారు. వార్డెన్‌ను చూడగానే.. మిస్సమ్మలోని ఆరు ఆత్మ ఎమోషనల్ అవుతుంది. వెంటనే వెళ్లి వార్డెన్‌ను హగ్ చేసుకుంటుంది. మిస్సమ్మ హగ్ చేసుకోగానే.. వార్డెన్ పులకించిపోతుంది. నువ్వు హగ్ చేసుకుంటే అరుంధతి హగ్ చేసుకున్నట్టే ఉందని చెప్తుంది. అరుంధతి పెళ్లి చేసుకుని ఆశ్రమం నుంచి వెళ్లిపోతూ ఇలాగే హగ్ చేసుకుందని చెప్పగానే.. ఇప్పుడు మిమ్మల్ని హగ్ చేసుకున్నది కూడా అరుంధతి మేడమే.. మిస్సమ్మలో మేడం ఆత్మ ఉంది అని రాథోడ్ చెప్పగానే.. రాజు, వార్డెన్ షాక్ అవుతారు. వార్డెన్ వెంటనే తేరుకుని ఎమోషనల్ అవుతూ ఆరును మరోసారి హగ్ చేసుకుంటుంది. నువ్వు ఎందుకు వచ్చావమ్మా అని అడిగితే.. మీ అందరినీ ఒకసారి చూడాలనిపించింది మేడం.. అలాగే మనోహరి పెళ్లి చేయాలి అందుకే వచ్చాను అని చెప్తుంది మిస్సమ్మలోని ఆరు.
మీ ప్రాణాలు తీసేసిన మనోహరి పెళ్లి మీరు చేయడం ఏంటి మేడం అని రాజు అడిగితే.. అది ప్రాణాలు తీసేసినా నేను మనోహరికి మాటిచ్చాను రాజుగారు. ఇచ్చిన మాట ప్రకారం పెళ్లి చేయాలని వచ్చాను అంటూ చెప్పగానే.. సరస్వతి వార్డెన్ ఎమోషనల్ అవుతూ.. నీలాంటి మంచి వ్యక్తిని దేవుడు త్వరగా తీసుకెళ్లాడు.. మనోహరి లాంటి రాక్షసిని ఇంకా భూమ్మీదే ఉంచేశాడు అంటూ ఏడుస్తుంటే.. వార్డెన్‌ను ఆరు ఓదారుస్తుంది. మీరు ఇప్పుడు మనోహరిని ఆశీర్వదించాలి మేడం అని చెప్పగానే.. రాథోడ్, మనోహరిని పిలుస్తాడు. దగ్గరకు వచ్చిన మనోహరికి వార్డెన్ మంచి మాటలు చెప్తుంటే.. మనోహరి కోపంగా తిడుతుంది. నీ నీతులు వినడానికి రాలేదు ఇక్కడకు ఆశీర్వదిస్తే వెళ్లిపోతాను అంటుంది. ఆ విషయం మేడంకు తెలుసులే మనోహరి ఎందుకు తొందరపడతావు రాజుగారు వెళ్లి అక్షింతలు తీసుకురండి అని చెప్పగానే.. రాజు లోపలికి వెళ్లి అక్షింతలు తీసుకుని వస్తాడు. సరస్వతి వార్డెన్ మనోహరిని ఆశీర్వదిస్తుంది. అప్పుడే మనోహరికి చంభా ఫోన్ చేస్తుంది. ఫోన్ మాట్లాడటానికి మనోహరి పక్కకు వెళ్లిపోతుంది.
కాల్ లిఫ్ట్ చేసిన మనోహరి కోపంగా చంభాను తిడుతుంది. భాగీని తీసుకొస్తున్న దారిలోనే ఏదో చేస్తానని ప్రగల్బాలు పలికావు ఏమీ చేయలేకపోయావు అంటూ కోప్పడితే.. మనోహరి నేను చెప్పేది విను.. మీ కారు టైర్ పంక్చర్ కావాలని కొన్ని మేకులు రోడ్డు మీద వేశాను కానీ మేకులు టైరుకు గుచ్చుకోలేదు.. ఈసారి రిటర్న్‌లో వస్తారు కదా నేను చెప్పిన దగ్గర కారు ఆగేలా చూడు.. భాగీ కారులోంచి దిగేలా చేయి అప్పుడు కచ్చితంగా ఆరు ఆత్మను బంధిస్తాను అంటూ చంభా చెప్పగానే.. సరే అలాగే చేస్తాను అంటుంది మనోహరి.
చంభా, మిస్సమ్మ కోసం ఎదురుచూస్తూ రోడ్డు పక్కన నిల్చుని ఉంటుంది. అదే దారిలో ఒక కారు వస్తుంది. ఏదో కారు వస్తుందని చెట్టు చాటుకు వెళ్లి దాక్కుంటుంది చంభా. ఆ కారు దగ్గరకు వచ్చి రోడ్డు మీద చంభా వేసిన మేకులు గుచ్చుకుని పంక్చర్ అవుతుంది. కారులోంచి అమర్ దిగుతాడు. అమర్‌ను చూసిన చంభా షాక్ అవుతుంది. ఇంతటితో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్ అయిపోతుంది.