Kethi Reddy: ధర్మవరం నియోజకవర్గంలో అభ్యర్థుల ఎంపిక విషయంలో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు. గత ఎన్నికల్లో పోటీచేసి కౌన్సిలర్లుగా గెలిచిన వారే ఈ ఎన్నికల్లో కూడా పోటీచేయాలని చెప్పరాయన. చాలా వ్యూహాత్మకంగా ఆయన ఈ సూచనలు చేశారని చర్చ నడుస్తోంది. అధికారంలో ఉన్నప్పుడు అంతా తామై వ్యవహరించిన వారు.. పార్టీ కష్ట కాలంలో ఉన్నప్పుడు కూడా అండగా ఉండాలని ఆయన ఆలోచనగా తెలుస్తోంది. పదవులు అనుభవించి అధికారం పోయిన తర్వాత చాప కింద నీరుల జారిపోవాలనుకునే వారికి ఓ మెసేజ్ కేతిరెడ్డి ఇస్తున్నారని ధర్మవరంలో జరుగుతున్న చర్చ.
కేడర్‌కు ఇన్ డైరెక్ట్ వార్నింగ్!
దీనికి తోడు మున్సిపాలిటీల్లో, కార్పొరేషన్లలో ఐదేళ్లపాటు ప్రజలతో ఉన్నవారికి అక్కడి సమస్యలు అర్థం అవుతాయని కేతిరెడ్డి ఉద్దేశ్యం. దీంతో ప్రజలతో కనెక్షన్ ఈజీగా ఉంటుందని భావిస్తున్నారాయన. కొత్త అభ్యర్థులు బరిలో దిగితే ఓటర్లతో కనెక్ట్ అవ్వడానికి సమయం పడుతుందని అంటున్నారు కేతిరెడ్డి. అధికారంలో ఉన్నప్పుడు కింగుల్ల వ్యవహరించిన వాళ్ళు ఇప్పుడు పార్టీకి అండగా ఉండాల్సిందేనని చెప్పకనే చెబుతున్నారా ఆయన. కౌన్సిలర్లుగా ఉన్న ఐదేళ్లు వార్డుల్లోకి ఇతర నేతలని అడుగుపెట్టనివ్వలేదు కదా అని గుర్తు చేస్తున్నారు. అందుకే ఇప్పుడు పార్టీకి ఆ నేతల సపోర్ట్ అవసరమని ఇన్ డైరెక్ట్ గా చెబుతున్నారు కేతిరెడ్డి.
పాత కౌన్సిలర్లకే మళ్లీ బాధ్యతలు!
ఒకవేళ రిజర్వేషన్లు మారితే మొన్నటి వరకు కౌన్సిలర్ గా ఉన్నవారే అభ్యర్థిని సూచించి గెలిపించాల్సిన బాధ్యత తీసుకోవాలని తేల్చి చెప్పేస్తున్నారు. పోటీ చేయడానికి వెనకడుగు వేస్తె అలాంటివారు తమకు అవసరం లేదని నిర్మొహమాటంగా చెప్పేస్తున్నారు. పైగా ఎన్నికల్లో డబ్బులు పంచొద్దని కూడా సూచిస్తున్నారు. డబ్బులు పంచితే గెలిచిన తర్వాత ప్రజలకు సర్వీస్ చేయడానికి ఏమీ ఉండదని ఆయన ఆలోచన. మరి కేతిరెడ్డి వ్యూహాత్మక అడుగులు ఎంతవరకు ఫలిస్తాయో చూడాలి.
Also Read:నన్ను మోసం చేశాడు!.. మేనల్లుడిపై బొత్స సెంటిమెంట్ అస్త్రం.. వర్కవుట్ అవుతుందా?