Big Alert AP Pensioners: ఏపీలో పింఛనుదారులకు ఇచ్చే తమ వాటా నగదు నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలో జమ చేయనుంది కేంద్ర ప్రభుత్వం. కేవలం ఏపీ ప్రభుత్వం ఇచ్చే డబ్బులు వారి చేతికి ఇవ్వకున్నారు అధికారులు. ఈ క్రమంలో లబ్దిదారులు తమ బ్యాంకు అకౌంట్లు పని చేస్తున్నాయో లేవో ఒక్కసారి చెక్ చేసుకోవాలి. ఖాతా యాక్టివ్‌గా లేకుంటే బ్యాంక్ కు వెళ్లి చెక్ చేసుకోవడం బెటర్.
ఏపీలో ఫించన్‌దారులకు ముఖ్యగమనిక. అక్టోబరు నెల నుంచి కొత్త రూల్స్ రానున్నాయి. ఈనెల వరకు కేంద్రం-రాష్ర్టాలు కలిసి ఫించన్‌దారులకు డబ్బులు ఇచ్చేవారు. ఇకపై కేంద్రానికి సంబంధించిన వాటా నిధులు నేరుగా లబ్దిదారుల ఖాతాల్లోకి జమ చేయనుంది. రాష్ట్ర వాటానికి సంబంధించిన నిధులు సచివాలయ ఉద్యోగులు ఇవ్వనున్నారు. డబ్బులు తగ్గాయని ఏ మాత్రం లబ్దిదారులు కంగారు పడాల్సిన అవసరం లేదు. గతంలో మీరు ప్రభుత్వానికి ఇచ్చిన బ్యాంక్ అకౌంట్లలో ఆయా నిధులు పడనున్నాయి. మంచిది లబ్దిదారులు తమ బ్యాంకులు కంటిన్యూ అవుతున్నాయో లేవో ఒక్కసారి వెళ్లి చెక్ చేసుకోండి.
ఎన్టీఆర్ భరోసా పథకం కింద వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు, వివిధ వృత్తుల అర్హులకు పెన్షన్లు ఇస్తోంది ఏపీ ప్రభుత్వం. రాష్ట్రంలో 62 లక్షల మంది లబ్దిదారుల్లో 9.34 లక్షల మందికి జాతీయ సామాజిక సహాయ కార్యక్రమం కింద ఈ మార్పులు జరుగుతున్నాయి. మిగిలినవారికి ఎప్పటి మాదిరిగా చేతికి నగదు ఇవ్వనున్నారు. వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు నెలకు రూ.200 నుంచి రూ.500 వరకు పింఛను ఇస్తోంది కేంద్రం. వాటిని కలిపి రాష్ట్ర ప్రభుత్వం రూ.4 వేలు, రూ.6 వేల (దివ్యాంగులు) పింఛను ఇస్తోంది. కేంద్ర ప్రాయోజిత పథకాలకు సంబంధించిన కేంద్ర వాటా నిధులు నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయాలని నిబంధన తీసుకొచ్చారు.
దీనికి సంబంధించి ఎన్‌ఎస్‌ఏపీకి అమలు చేస్తూ సెర్ప్ సీఈవో వాకాటి కరుణ ఉత్తర్వులు ఇచ్చారు. జాతీయ సామాజిక సహాయ కార్యక్రమం పరిధిలోకి వచ్చే 9.34 లక్షల మంది లబ్ధిదారులకు కేంద్రం రూ.382.82 కోట్లు కేటాయించింది. ఈ విషయాన్ని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వెల్లడించారు. కేంద్ర మార్గదర్శకాల ప్రకారం, ఈ నిధులను లబ్ధిదారుల ఆధార్ అనుసంధానిత బ్యాంకు ఖాతాల్లో అక్టోబర్ ఒకటి నుంచి జమ చేస్తారు. లబ్ధిదారులకు అందే పింఛనులో ఎలాంటి మార్పు ఉండదని వెల్లడించారు. , మిగిలిన రాష్ట్ర ప్రభుత్వ వాటాను ‘స్వర్ణ గ్రామం / స్వర్ణ వార్డు’ సిబ్బంది ద్వారా ఎప్పటిలాగే ఇంటి వద్దే నగదు రూపంలో అందజేస్తామని మంత్రి పేర్కొన్నారు.
ALSO READ: ధర్మవరంలో కేతిరెడ్డి మాస్టర్ స్ట్రోక్.. ఆ మాజీ కౌన్సిలర్లకు మైండ్ బ్లాంక్!
వృద్ధాప్య పింఛన్ 60 నుంచి 79 ఏళ్ల వారికి
బ్యాంకులో రూ.200 + చేతికి రూ. 3800 = మొత్తం: రూ.4,000
వృద్ధాప్య పింఛన్ 80 ఏళ్లు పైబడిన వారికి
బ్యాంకులో రూ.500 + చేతికి: రూ3500 = మొత్తం రూ. 4,000
వితంతు పింఛన్ 40 నుంచి 79 ఏళ్లవారికి
బ్యాంకులో రూ. 300 + చేతికి రూ.3700 = మొత్తం రూ. 4,000
వితంతు పింఛన్ 80 ఏళ్లు పైబడిన వారు :
బ్యాంకులో రూ. 500 + చేతికి రూ.3500 = మొత్తం రూ. 4,000
వికలాంగుల పింఛన్ 18 నుంచి 79 ఏళ్లువారికి
బ్యాంకులో రూ. 300 + చేతికి రూ.5700 = మొత్తం రూ.6,000
వికలాంగుల పింఛన్ 80 ఏళ్లు పైబడిన వారు
బ్యాంకులో రూ.500 + చేతికి రూ.5500 = మొత్తం రూ.6,000