TCS Land Allotment: ఏపీ అతి పెద్ద నగరాల్లో ముఖ్యమైనది వైజాగ్. అయితే విశాఖ త్వరలో పెద్ద ఐటీ హబ్ గా మారబోతుంది. దేశంలోనే అతిపెద్ద ఐటీ కంపెనీల్లో ఒకటి అయినా టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ కు సంబంధించి ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది.
వైజాగ్ లో టీసీఎస్ (TCS) కు ఏకంగా 21.16 ఎకరాల భూమిని నామమాత్రపు ధర, అంటే కేవలం రూ.99 పైసలకే (టోకెన్ ధర) కేటాయించేందుకు నిర్ణయం తీసుకుంది. అంటే దీని అర్థం ఏడాదికి 99 పైసల లీజుకు అన్నమాట. సీఎం చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో జరిగిన కేబినెట్ భేటీ ఈ సంచలన నిర్ణయం తీసుకున్నారు. గుజరాత్ రాష్ట్రానికి ప్రధాని నరేంద్ర మోదీ గతంలో ముఖ్యమంత్రిగా పని చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ సమయంలో టాటా మోటార్స్ కు రూ.99 పైసలకే భూమిని కేటాయించిన సిస్టమ్ నే చంద్రబాబు సర్కార్ ఫాల్లో అయినట్టు తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: CSIR-CRRI: ఇంటర్ అర్హతతో ఉద్యోగాలు.. జీతం అక్షరాల రూ.63,200, దరఖాస్తుకు లాస్ట్ డేట్ ఎప్పుడంటే..?
ఆ సమయంలో అప్పటి గుజరాత్ సీఎం అయిన మోదీ తీసుకున్న నిర్ణయం రాష్ట్రంలో ఆటోమొబైల్ పరిశ్రమ అభివృద్ధికి ఎంతోగానూ దోహదపడింది. ఇప్పుడు చంద్రబాబు సర్కార్ తీసుకున్న నిర్ణక్ష్ం ఒక ప్రధాన ఐటీ కేంద్రంగా అభివృద్ధి చేయాలనే ప్రభుత్వ సంకల్పాన్ని చాటుతోందని ప్రముఖులు చెబుతున్నారు. టీసీఎస్ రాకతో వైజాగ్ లో ఐటీ విప్లవానికి నాంది పలుకుతోందని సీఎం చంద్రబాబు నాయుడు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కీలక నిర్ణయం ద్వారా టీసీఎస్ లో దాదాపు రూ. 1,370 కోట్లు పెట్టుబడి పెట్టనుంది. తద్వారా సుమారు 10,000 మందికి ఉద్యోగాలు లభించనున్నాయి. దీంతో నిరుద్యోగులకు ఎంతో మేలు కలుగుతోంది.
ఇది కూడా చదవండి: NTPC-NGEL: డిగ్రీ ఉన్న వారికి గోల్డెన్ ఛాన్స్.. ఈ జాబ్ వస్తే లక్షల్లో జీతం.. వెంటనే దరఖాస్తు చేసుకోండి..