BigTV English

Mystery Parcel : పట్టుబడ్డ ‘ పార్సిల్’ నిందితులు.. ఎట్టకేలకు కేసును చేధించిన పోలీసులు.. ఎవరిది ఈ క్రూర ఆలోచన అంటే..

Mystery Parcel : పట్టుబడ్డ ‘ పార్సిల్’ నిందితులు.. ఎట్టకేలకు కేసును చేధించిన పోలీసులు.. ఎవరిది ఈ క్రూర ఆలోచన అంటే..

Mystery Parcel :


⦿ పోలీసుల అదుపులో చిన్నల్లుడు, ఓ మహిళ
⦿ వదిన ఆస్తిపై కన్నేసిన మరిది
⦿ బెదిరించడానికే పంపిన డెడ్ బాడీ పార్సిల్
⦿ రూ.1.30 కోట్లు చెల్లించాలని లేఖ
⦿ సంఘటన జరిగాక పరారీలో నిందితుడు
⦿ పరారీకి ముందు నుంచే పనిచేయని సీసీ కెమెరాలు

ఏలూరు, స్వేచ్ఛ: పశ్చిమగోదావరి జిల్లా యండగండి గ్రామంలో డెడ్ బాడీ పార్సిల్ కేసులో కీలక నిందితులను పోలీసులు మంగళవారం అదుపులో తీసుకున్నారు. అప్పటికే బాగా శిథిలావస్థలో ఉన్న పార్సిల్ లో వచ్చిన డెడ్ బాడీని గుర్తించేందుకే పోలీసులకు నాలుగు రోజులు పట్టడం గమనార్హం. అయితే ఈ కేసుకు సంబంధించి మొదటి నుంచి చిన్నల్లుడు సిద్ధార్థ వర్మ ఇలియాస్ శ్రీధర్ వర్మపై పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తూ వచ్చారు. ఎందుకంటే పార్సిల్ తులసి ఇంటికి వచ్చినప్పటి నుంచే చిన్న అల్లుడు శ్రీధర్ వర్మ అతని భార్య కనిపించకుండా పోయారు. దీనితో పోలీసుల అనుమానాలు మరింతగా బలపడ్డాయి. విచారణ చేపట్టిన పోలీసులు ఈ కేసును 5 రోజుల్లో ఛేదించారు.


చెల్లిని ప్రేమ వివాహం

డెడ్ బాడీ పార్సిల్ అందుకున్న సాగి తులసి చెల్లి రేవతిని ప్రేమ వివాహం చేసుకున్నాడు శ్రీధర్ వర్మ. అప్పటికే మూడు పెళ్లిళ్లు చేసుకున్న శ్రీధర్ రేవతిని కూడా చేసుకున్నాడు. వదిన ఆస్తిపై మొదట నుంచి కన్నేశాడు. సాగి తులసి తన భర్త చనిపోవడంతో అతని ఆస్తి కూడా తులసికే దక్కింది. ఎలాగైనా తులసిని బెదిరించి ఆస్తిని సొంతం చేసుకోవాలని మరిది శ్రీధర్ వర్మ భావించాడు. పార్సిల్ లో డెడ్ బాడీని పంపించి బెదిరించాలని చూశాడు. నిందితుడి క్రైమ్ మెంటాలిటీ చూసి పోలీసులే నోరెళ్లబెడుతున్నారు.

సంతకాల కోసం ఒత్తిడి

నిందితుడు పారిపోయేందుకు ముందు రోజు నుంచే సీసీ కెమెరాలు పనిచేయకపోవడంతో స్థానికులు అనేక అనుమానాలు వ్యక్తం చేశారు. తన వదిన తులసి అవసరాన్ని ఆసరాగా చేసుకొని ప్రణాళికతో స్వచ్ఛంద సంస్థ సహాయం పేరిట నిర్మాణ సామగ్రిని పంపించాడు చిన్నల్లుడు శ్రీధర్ వర్మ. మొత్తం సమాచారాన్ని ఒక మహిళతో మాట్లాడించాడు చినల్లుడు శ్రీధర్. చెక్క పెట్టెలో గుర్తు తెలియని శవాన్నిపార్సిల్ పంపి రూ.1.30 కోట్లు చెల్లించాలంటూ లేఖను పంపిస్తే భయాందోళనకు గురై వదిన తులసి తన మాట వింటోందని ఊహించుకున్నాడు.

Also Read :  శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. పాలకమండలిలో కీలక నిర్ణయం

పర్లయ్యను హతమార్చి పార్శిల్ల్లో పంపించి ఆ రోజునే ఆస్తిపత్రాలపై సంతకాలు సేకరించుకునే ప్రయత్నం చేశాడు శ్రీధర్. అయితే చాకచక్యంగా మూత్రశాలకి అని వెళ్లి తన సెల్ ఫోన్ ద్వారా బంధువులకు సమాచారం చెరవేసింది తులసి. బంధువుల రాకతో పోలీసులకు సమాచారం వెళ్తుందని గుర్తించి పరారయ్యాడు శ్రీధర్. అప్పటినుండి శ్రీధర్ వర్మ కోసం గాలిస్తున్న పోలీసులు ఎట్టకేలకు శ్రీధర్ వర్మతో పాటు అతనికి సహాయం చేసిన మహిళను కూడా అదుపులోకి తీసుకున్నారు.

Related News

Roja Hot Comments: శుక్రవారం వస్తే జంప్.. జగన్‌పై రోజా సెటైర్లు?

Digital Book: డిజిటల్ బుక్‌తో వైసీపీ వార్నింగ్.. రెడ్ బుక్ విజృంభించే టైమ్ వచ్చిందా?

Mother Killed Son: కళ్లలో కారం, చీరతో ఉరి.. ఎకరం భూమి కోసం కొడుకును చంపిన తల్లి

Jagan: ప్రతిపక్ష హోదా వల్ల లాభం ఏంటి? ఎమ్మెల్యేలకు ప్రశ్నించే హక్కు ఉండదా? జగన్ లాజిక్ ఏంటి?

Tirumala News: భక్తులకు నేరుగా శ్రీవారి దర్శనం, సాయంత్రం తిరుమలకు సీఎం చంద్రబాబు

Amaravati News: హెచ్ 1 బీ వీసా ఎఫెక్ట్.. ఏపీకి టెక్ కంపెనీ యాక్సెంచర్, విశాఖలో కొత్త క్యాంపస్‌

Nellore News: రెచ్చిపోయిన హిజ్రాలు.. న‌ర్సుపై మూకుమ్మడిగా దాడి, అడిగినంత ఇవ్వలేదని

Rajahmundry News: క్రిమినల్ బత్తుల జాడెక్కడ? జైలులో ప్రభాకర్ ఏమేమి చేసేవాడు?

Big Stories

×