Lock Aadhaar Card| భారతదేశంలో ఎక్కడైనా మన గుర్తింపుని ధ్రువపరచుకోవడానికి ఉపయోగపడే బెస్ట్ ఐడీ కార్డు.. ఆధార్ కార్డ్. సిమ్ కార్డు కొనుక్కోవడం నుంచి ప్రభుత్వ పథకాల లబ్ది పొందడం వరకు ఏం చెయ్యాలన్నా ఆధార్ కార్డు తప్పనిసరి. ఇలా ఇన్ని అవసరాలకు ఉగయోగపడే ఆధార్ కార్డు వివరాలు దొంగతనం చేసి కొంతమంది నేరాలకు ఈజీగా పాల్పడుతున్నారు. దాన్ని వాళ్లు దుర్వినియోగం చెయ్యడానికి ఆస్కారం కూడా చాలా ఎక్కువ. అంతేకాదు, దాన్ని ఉపయోగించుకొని ఇప్పుడు మనల్నే స్కాం చేసేవాళ్లు కూడా పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నారు. కాబట్టి.. ఎవరైనా మన ఆధార్ కార్డును దుర్వినియోగం చేస్తున్నారేమో? కనుక్కొని, వెంటనే దాన్ని భద్రపరుచుకోవడం బెటర్. అది ఎలా చెయ్యాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఆధార్ కార్డ్ ప్రాముఖ్యత, దాన్ని ఎక్కడ దుర్వినియోగం చేస్తారు?
ఆధార్ కార్డ్ అంటే అది కేవలం ఒక కార్డు కాదు. దాంట్లో మనకు సంబంధించిన అత్యంత సున్నితమైన వ్యక్తిగత, బయోమెట్రిక్ వివరాలు ఉంటాయి. ఇది ఎవరైనా క్రిమినల్స్ చేతుల్లో పడితే మనకు తెలియకుండానే భారీ నష్టం జరిగిపోతుంది. అందుకే దీన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజలు తమ గుర్తింపుని ధ్రువీకరించుకోవడానికి కూడా చాలాచోట్ల ఆధార్ కార్డునే చూపిస్తుంటారు. అందుకే మన ఐడెంటిటీ కాపాడుకోవడానికి కూడా ఆధార్ కార్డును భద్రపరుచుకోవడం కూడా చాలా ముఖ్యమైన పనిగా భావించాలి. ప్రస్తుతం టెక్నాలజీ బాగా ఎక్కువై, హ్యాకర్లు తెలివి మీరి ఉన్నారు. ఇలాంటి టైంలో మన ఆధార్ నంబర్ దుర్వినియోగం అయ్యే ప్రమాదం కూడా చాలా ఎక్కువ. అదే జరిగితే ఒక్కోసారి మనం తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. మన బ్యాంకు నుంచి పాస్‌పోర్టు వరకు అన్నింటికి లింక్ అయి ఉన్న ఈ కార్డును భద్రం చేసుకోవడం చాలా ముఖ్యం.
Also Read: శోభనం రాత్రి గంజాయి, మటన్ కావాలన్న పెళ్లికూతురు.. ఆమె ఆడది కాదన్న అనుమానంతో వరుడు!
ముందుగా మన ఆధార్ కార్డ్ వివరాలను ఇతరులు ఎవరైనా ఉపయోగిస్తున్నారా? లేదా? అని చెక్ చేసుకోండి. అది తెలుసుకోవడానికి ఈ స్టెప్స్ ఫాలో అవ్వండి.
1. మైఆధార్ పోర్టల్ (MyAadhaar Portal) ఓపెన్ చెయ్యండి. లేదా మైఆధార్ వెబ్‌సైట్‌కి వెళ్లి లాగిన్ అవ్వండి.
2. ఆధార్ వివరాలు నమోదు చేయడం:
మీ ఆధార్ నంబర్‌ని ఇన్‌పుట్ చేయండి.
క్యాప్చా కోడ్ ఫిల్ చేయండి.
“ఓటీపీతో లాగిన్” ఆప్షన్ ఎంచుకోండి.
3. ఓటీపీ లాగిన్:
మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు ఓటీపీ వస్తుంది.
ఓటీపీ కోసం ఇచ్చిన బాక్సులో ఆ ఓటీపీ ఫిల్ చెయ్యండి.
4. ఆథెంటికేషన్ హిస్టరీని యాక్సెస్ చెయ్యడం:
“ఆథెంటికేషన్ హిస్టరీ” విభాగానికి నావిగేట్ చేయండి.
అక్కడ, మీ ఆధార్‌ను ఎక్కడెక్కడ ఉపయోగించారో హిస్టరీని చూడొచ్చు.
5. మిస్‌యూజ్‌ను రిపోర్ట్ చెయ్యండి.
మీకు తెలియకుండా ఎక్కడైనా ఆధార్ కార్డును ఉపయోగించినట్లు కనిపిస్తే.. వెంటనే భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI)కి ఫిర్యాదు చెయ్యండి.
ఆధార్ కార్డ్‌ని ఆన్‌లైన్‌లో ఎలా లాక్ చేయాలి?
మెరుగైన సెక్యూరిటీ కోసం మీరు ఆధార్ కార్డ్ యొక్క బయోమెట్రిక్ వివరాలను ఆన్‌లైన్‌లో లాక్ చేయవచ్చు. అలా ఎలా చెయ్యాలో ఇప్పుడు తెలుసుకుందాం:
1. లాక్/అన్‌లాక్ ఆధార్ ఆప్షన్‌కి వెళ్లడం
మైఆధార్ పోర్టల్‌కి వెళ్లండి.
“లాక్/అన్‌లాక్ ఆధార్” ఎంచుకోండి.
2. వర్చువల్ ఐడీని నమోదు చెయ్యడం
మీ వర్చువల్ ఐడీని నింపండి
3.పూర్తి పేరు, పిన్ కోడ్ పూరించండి.
క్యాప్చా కోడ్ పూర్తిచెయ్యండి.
4. ఓటీపీని సబ్‌మిట్ చెయ్యడం:
మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు పంపిన ఓటీపీని నమోదు చేయండి.
“సబ్‌మిట్” పై క్లిక్ చేయండి.
5. దాంతో మీ బయోమెట్రిక్ లాక్ యాక్టివేట్ అవుతుంది.
ఈ వివరాలను అన్‌లాక్ చేయడానికి, మళ్లీ ఇదే ప్రాసిస్‌ను రిపీట్ చెయ్యండి.
ఆధార్ వివరాల విషయంలో ఎప్పుడూ అప్రమత్తంగా ఉండండి.
మన ఆధార్ వివరాలను ఎవరూ దుర్వినియోగం చెయ్యకుండా కాపాడుకోవడానికి బయోమెట్రిక్ వివరాలను లాక్ చేసుకోవడం చాలా ముఖ్యం. అలాగే ఎప్పటికప్పుడు మన ఆధార్ వివరాలు లాక్ అయి ఉన్నాయో? లేదో? చెక్ చేసుకుంటూ ఉండండి.