BigTV English

Jagan with PK: జగన్, ప్రశాంత్ కిషోర్ మళ్లీ కలుస్తారా? అసలు సంగతి ఇది!

Jagan with PK: జగన్, ప్రశాంత్ కిషోర్ మళ్లీ కలుస్తారా? అసలు సంగతి ఇది!

Jagan with PK: వైసీపీ కొత్త స్కెచ్ వేసిందా? ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఫ్యాన్ పార్టీ వీకయ్యిందా? నేతలు ఎందుకు ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నారు? మనుముందు రాజీనామాలు ఆ పార్టీ నుంచి ఉంటాయా? ఈ విషయంలో వైసీపీ ఎందుకు సైలెంట్‌గా ఉంది? ఇవే ప్రశ్నలు ఆ పార్టీ నేతలను వెంటాడుతున్నాయి.


రీసెంట్‌గా వైసీపీకి సంబంధించిన ఓ వార్త తెగ హంగామా చేసింది. విషయం ఏంటంటే.. రాజకీయ వ్యూహకర్త పీకె అలియాస్ ప్రశాంత్ కిషోర్‌తో వైసీపీ మంతనాలు జరుపుతుందన్నది దాని సారాంశం. పీకెతో మంతనాలు జరిపేందుకు జగన్ సిద్ధమవుతున్నారని దాని ఉద్దేశం. మరి ఇందులో నిజమెంత? లేక వైసీపీ ఆడుతున్న డ్రామాలా? అనే దానిపై ఆ పార్టీ నేతలు చర్చించుకోవడం మొదలైంది.

కొద్దిరోజులుగా బెంగుళూరులో మకాం వేసిన జగన్‌కు జాతీయస్థాయి నాయకుడు ఒకరు ఓ సలహా ఇచ్చారట. పీకేతో కలిసి పని చేయాలని ఆయన చెప్పారట. అందుకు జగన్ సుముఖంగా లేరని ఆ పార్టీ వర్గాల మాట. ఆ సమయంలో జగన్‌ని కలిసేందుకు ఆయన ప్రయత్నాలు చేశారని, అందుకు అధినేత సుముఖంగా లేరని వైసీపీ నుంచి ఓ వార్త చక్కర్లు కొట్టింది. ఇది వైసీపీ వెర్షన్.


ALSO READ: బాలీవుడ్ నటి వ్యవహారం.. ఆ పెద్దాయన చుట్టూ ఉచ్చు, రేపో మాపో..

వైసీపీ ప్లాన్ వెనుక కారణాలు లేకపోలేదు. ఒకప్పడు పార్టీని వెన్నంటి నేతలు ఒకొక్కరుగా రాజీనామాలు చేయడం మొదలుపెట్టారు. పరిస్థితి గమనించిన ఆ పార్టీ పెద్దలు సోషల్‌మీడియా ద్వారా ఫీలర్‌ని బయటపెట్టిందట. ఈ విధంగానైనా పార్టీ నుంచి నేతలు డ్రాపవ్వడం తగ్గుతుందని భావించింది. అయినా బయటకు వెళ్లిపోవాలని నిర్ణయించుకున్న నేతలు వెళ్లిపోతున్నారు. ఉన్న కొందరు నేతలు మిగతా పార్టీలతో మంతనాలు సాగిస్తున్నారు. వారి నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే ఫ్యాన్ పార్టీ ఖాళీ అవ్వడం ఖాయమని అంటున్నారు. ఈ నేపథ్యంలో పీకేతో జగన్ మళ్లీ కలుస్తున్నారంటూ బయటపెట్టడం మొదలైంది. 10 రోజుల కిందట మీడియాతో మాట్లాడిన ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల, వైసీపీ తిరిగి అధికారంలోకి రావడం కష్టమని ఓపెన్‌గా చెప్పేశారు. ఆ పార్టీలో జరుగుతున్న పరిమాణాలు ఆమెకు తెలుసని, అందుకే ఆ వ్యాఖ్యలు చేశారని వైసీపీలో కొందరి నేతల మాట.

పీకె వెర్షన్‌కు వెళ్దాం. ఐ‌ప్యాక్‌కు ఆయన ఎప్పుడో గుడ్ బై చెప్పేశారు. బీహార్‌లో సొంతంగా పార్టీ పెట్టారు. వచ్చే ఏడాది అక్టోబర్ లేదా నవంబర్‌లో బీహార్ శాసనసభకు ఎన్నికలు జరగనున్నాయి. ఆ పనిలో ఆయన బిజీ ఉన్నారు.. ప్రచారంలో నిమగ్నమయ్యారు. ఎత్తుపైఎత్తులు వేస్తూ దూసుకుపోతున్నారు. సింపిల్‌గా చెప్పాలంటే తీరిక లేని షెడ్యూళ్లతో బిజీగా ఉన్నారాయన.

ఒక్కసారి వెనక్కి వెళ్దాం.. మొన్నటి ఏపీ అసెంబ్లీ ఎన్నికల ముందు టీడీపీ ఆయన్ని ఆహ్వానించింది. నావల్ల కాదని చెబుతూనే, కేవలం సలహాలు మాత్రమే ఇచ్చారు. దాన్ని టీడీపీ ఫాలో అయ్యింది.. ఎన్నికలకు రెండు రోజుల ముందు డిజిటల్ మీడియాలో వైసీపీ కచ్చితంగా ఓడిపోతుందని బల్ల గుద్ది మరీ చెప్పారాయన. ఆయన చెప్పినట్టుగా వైసీపీ చిత్తుచిత్తుగా ఓడిపోయింది. 2019 ఎన్నికలకు ముందు వైసీపీకి పీకే వ్యూహకర్తగా వ్యవహరించారు. ప్రచారంతోపాటు అభ్యర్థులను సైతం మార్చేశారు. ప్రజల్లో ఉన్న వ్యక్తులకు ఎక్కువగా సీట్లు ఇప్పించారాయన. ఎంతో మంది డాక్టర్లు శాసనసభ, లోక్‌సభలో ఆ పార్టీ తరపున అడుగుపెట్టిన విషయం తెల్సిందే.

Related News

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Tirumala devotees: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి పట్టే సమయం ఎంతంటే?

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Big Stories

×