Deputy CM Pawan Kalyan: వయసు 96 ఏళ్లు. అయినా కూడా నాయకుడిపై ఉన్న అభిమానానికి, తపస్సుకి ఇది అడ్డుకాదని నిరూపించారు పోతుల పేరంటాలు. పిఠాపురం నియోజకవర్గం యు.కొత్తపల్లి మండలం కొత్త ఇసుకపల్లికి చెందిన ఆమె, జనసేనాని, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విజయం సాధించాలని మనసులో పెంచుకున్న ఆకాంక్షతో వేగులమ్మ తల్లిని ప్రార్థించారు. మొక్కుగా గరగ చేయిస్తానని నిర్ణయించుకొని, తన ప్రతినెల పింఛనులోంచి రూ.2,500 చొప్పున దాచుకుంటూ, మొత్తంగా రూ.27 వేల రూపాయలు కూడగట్టారు.
ఆ సొమ్ముతో ఆలయానికి వెళ్లి గరగ చేయించిన ఆమె, పవన్ కళ్యాణ్ గెలవాలని అమ్మవారిని ప్రార్థించారట. అలాగే తనకు బిడ్డ లాంటి పవన్ తో కలిసి భోజనం చేయాలని ఉందని ఆమె తన కోరికను వెల్లడించారు. ఈ విషయం తెలిసిన వెంటనే పవన్ కళ్యాణ్, వెంటనే తన క్యాంప్ కార్యాలయానికి ఆహ్వానించారు.
ఆమెతో వ్యక్తిగతంగా భోజనం చేశారు. అంతేకాదు స్వయంగా ఆమెకు పవన్ వడ్డించి సేవ చేయడం విశేషం. ఓ 96 ఏళ్ల వృద్ధురాలికి తనపై ఉన్న అభిమానాన్ని చూసి పవన్ తన ఆనందాన్ని పంచుకున్నారు. ఆమెకు గౌరవంగా చీరను, రూ.లక్ష రూపాయల నగదును బహూకరించారు.
Also Read: AP New Scheme: విద్యార్థులకు బంపర్ ఆఫర్.. తల్లికి వందనం ఒక్కటే కాదు.. మరో స్కీమ్ మీకోసమే!
పేరంటాలు ఆనందంతో మురిసిపోతూ, నాది చిన్న మొక్కు, కానీ నాకు అంతటి గౌరవం ఇచ్చినందుకు హృదయపూర్వక ధన్యవాదాలని పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ కూడా మీ ఆశీర్వాదమే నాకు శక్తి. మీరు నన్ను తల్లిలా చూడండని ప్రేమతో స్పందించారు. దీనితో దటీజ్ పవన్ కళ్యాణ్ అంటూ జనసేన సోషల్ మీడియా వైరల్ చేస్తోంది. అలాగే నెటిజన్స్ కూడా పవన్ మనస్తత్వానికి ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
పిఠాపురం నియోజకవర్గం, యు.కొత్తపల్లి మండలం కొత్త ఇసుకపల్లికి చెందిన 96 ఏళ్ల పోతుల పేరంటాలు గారు, ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ మీద అభిమానంతో, ఆయన విజయం సాధించాలని వేగులమ్మ తల్లికి పొర్లు దండాలు పెట్టి, అమ్మవారికి గరగ చేయిస్తానని మొక్కుకున్నారు. తన పింఛను సొమ్ము నుంచి… pic.twitter.com/CU1lVWKXfo
— Deputy CMO, Andhra Pradesh (@APDeputyCMO) May 9, 2025