AP New Scheme: ఏ రాష్ట్రం విద్యాభివృద్ధిలో ముందుకు సాగుతుందో ఆ రాష్ట్రం ఉన్నత మార్గం వైపు పయనిస్తుంది. అందుకేనేమో ఏపీలో కూటమి ప్రభుత్వం విద్యాభివృద్ధి వైపు ప్రత్యేక దృష్టి సారించింది. సరికొత్త పథకాలతో విద్యార్థులకు మేలు చేసకూర్చేందుకు శ్రీకారం చుట్టింది. తాజాగా రాష్ట్ర వ్యాప్త విద్యార్థుల కోసం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో ఎందరో పేద విద్యార్థులకు ప్రయోజనం చేకూరనుంది. అసలు ఆ ప్రయోజనం ఏమిటి? పథకం అమలెప్పుడు తెలుసుకుందాం.
విద్యార్థులకు అధిక ప్రాధాన్యత..
ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పెద్ద పండుగ పేరుతో ప్రతి బడిలో మౌలిక సదుపాయాల కల్పనకై చర్యలు తీసుకుంది. అంతేకాదు విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించడంతో ఆ మేరకు పది, ఇంటర్ ఫలితాలలో విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. అలాగే ఇప్పటి వరకు అమలవుతున్న మధ్యాహ్న భోజన పథకం మెనూలో సైతం మార్పులు తెచ్చారు. కేవలం టెన్త్ విద్యార్థులకు మాత్రమే పరిమితమైన ఈ స్కీమ్ ను, ఇంటర్ విద్యార్థులకు సైతం పొడిగించారు.
వచ్చే నెలలో అదిరిపోయే స్కీమ్..
వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభం కాగానే తల్లికి వందనం పేరుతో ఏపీ ప్రభుత్వం ఖాతాల్లో నగదు జమ చేయనుంది. ప్రతి విద్యార్థి తల్లి ఖాతాలో రూ. 15000 నగదు జమ చేసేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనితో పాఠశాలల ప్రారంభ దశలో విద్యార్థుల ఖర్చుల కోసం ఈ నగదు ఉపయోగపడాలన్నది ప్రభుత్వ ముఖ్య ఉద్దేశం.
బిగ్ బ్రేకింగ్.. స్కీమ్
ఏపీలోని గురుకుల, వసతి గృహ విద్యార్థుల కోసం సరికొత్త స్కీమ్ ను అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ పథకం తో పేద విద్యార్థులకు అధిక మేలు చేకూరుతుందని చెప్పవచ్చు. ఇప్పటి వరకు అన్ని వసతి గృహాలలో గల విద్యార్థులకు కాస్మోటిక్ ఛార్జీలు, ఇతర సౌకర్యాలు కల్పించడంలో అక్కడక్కడా విమర్శలు వచ్చాయి. ఆ విమర్శలకు ఫుల్ స్టాప్ పెడుతూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
విద్యార్థులకు స్పెషల్ కిట్స్..
వసతి గృహాలలో చదివే విద్యార్థులకు స్పెషల్ కిట్స్ అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది. ఇదే విషయాన్ని మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి వెల్లాడించారు. మంత్రి చెప్పిన ప్రకటన మేరకు, విద్యార్థులకు వచ్చే విద్యా సంవత్సరం నుంచి కాస్మోటిక్ కిట్స్, నైట్ డ్రెస్ లను ప్రభుత్వం అందజేస్తుంది. గురుకులాలు, వసతి గృహాల్లో స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ నిధులతో అదనంగా మరుగుదొడ్లు నిర్మించడం, అలాగే ఉచిత నీట్ కోచింగ్ సెంటర్లు 10 కి పెంచుతున్నట్లు మంత్రి తెలిపారు.
Also Read: Viral Video: డబ్బులు చోరీ చేసిన పక్షి.. ఈ గ్యాంగ్ తో పని కాదు..
కలిగే ప్రయోజనం ఏంటి?
ప్రభుత్వం కాస్మోటిక్ కిట్స్ ఇవ్వడం ద్వారా ఇన్ని రోజులు వసతి గృహాలలో ఎదుర్కొన్న సమస్యలకు ఫుల్ స్టాప్ పడుతుందని చెప్పవచ్చు. అంతేకాకుండా కిట్స్ లో విద్యార్థులకు కావాల్సిన అన్ని వస్తువులు ఇవ్వడం ద్వారా వారికి కాస్త శ్రమ కూడా తగ్గించవచ్చు. అలాగే నైట్ డ్రస్ లు కూడా ఇచ్చేందుకు ప్రభుత్వం సుముఖత చూపడం విశేషమని చెప్పవచ్చు. మొత్తం మీద ఏపీలో విద్యార్థుల సంక్షేమం కోసం ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోంది. సీఎం చంద్రబాబు సారథ్యంలో మంత్రులు లోకేష్, డాక్టర్ స్వామిల ఆధ్వర్యంలో అటు పాఠశాలల్లో, ఇటు వసతి గృహాల్లోని విద్యార్థుల కోసం ఎన్నో పథకాలు వారి ముందుకు రానున్నాయని చెప్పవచ్చు. మరెందుకు ఆలస్యం.. ప్రభుత్వ బడిలో మీ పిల్లలను చేర్పించండి.. వారి బంగారు భవిష్యత్ కు బంగారు బాట వేయండి.