BigTV English

India Vs Pakistan War : సచిన్, ధోని.. యుద్ధ రంగంలోకి టెరిటోరియల్ ఆర్మీ..

India Vs Pakistan War : సచిన్, ధోని.. యుద్ధ రంగంలోకి టెరిటోరియల్ ఆర్మీ..
Advertisement

India Vs Pakistan War : ధోనీ గన్ పట్టి పాకిస్తాన్‌తో యుద్ధం చేస్తే చూడాలని ఉందా? హెలికాప్టర్ షాట్‌తో ఫీల్డ్‌లో ప్రత్యర్థులకు చుక్కలు చూపించే ఎమ్‌ఎస్.. హెలికాప్టర్‌లో పాక్ ఆర్మీపై నిప్పులు చెరుగుతుంటే ఆ మజానే వేరేగా ఉంటుంది కదా. క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ ఏకే 47తో పాక్‌ సైన్యాన్ని బౌండరీలు దాటేలా తరిమికొట్టే సీన్.. క్రికెట్ కంటే ఎక్కవ ఆనందాన్ని ఇస్తుందిగా. మలయాళం హీరో మోహన్‌లాల్ సినిమాల్లో మాదిరే రియల్ వార్‌లో తుపాకులతో చెలరేగిపోతుంటే ఎట్టా ఉంటాదో కదా. ఇవన్నీ నిజంగా నిజమయ్యే అవకాశం ఉంది. కుదిరితే ధోనీని వార్ జోన్‌లో చూడొచ్చు. వీలైతే సచిన్ ఇండియన్ ఆర్మీతో కలిసి పాక్‌పై యుద్ధం చేయొచ్చు. ఇవన్నీ సాధ్యమే. త్వరలోనే ధోనీ, సచిన్ లాంటి పలువురు ప్రముఖులను ఆర్మీ డ్రెస్‌లో, యుద్ధ క్షేత్రంలో వీరోచితంగా పోరాడుతుంటే చూసే ఛాన్స్ రావొచ్చు. ఆ దిశగా కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. టెరిటోరియల్ ఆర్మీని రంగంలోకి దింపాలని నిర్ణయించింది.


ఆర్మీకి సపోర్ట్‌గా..

యుద్ధం అంటే చావగొట్టడమే. మళ్లీ తిరిగి కన్నెత్తి చూడకుండా చితక్కొట్టడమే. అందుకే, ఆపరేషన్ సిందూర్‌తో పాకిస్తాన్‌ మళ్లీ కోలుకోకుండా దెబ్బకొడుతోంది ఇండియా. డ్రోన్లు, మిస్సైళ్లతో విరుచుకుపడుతూ.. శత్రు దేశ ఆర్మీ స్థావరాలను, ఎయిర్‌పోర్టులను పీస్ పీస్ చేస్తోంది. సాక్షాత్తు పాక్ ప్రధాని బంకర్లలో దాక్కున్నాడంటే.. ఆర్మీ చీఫ్ అడ్రస్ లేకుండా పోయాడంటే.. మన బలం, బలగం వారిని ఎంతగా భయపెడుతోందో తెలిసిపోతోంది. సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రెగ్యులర్ ఆర్మీకి సపోర్ట్‌గా టెరిటోరియల్ ఆర్మీని రంగంలోకి దింపేందుకు భారత సైన్యాధిపతికి ప్రత్యేక అధికారాలను ఇచ్చింది.


టెరిటోరియల్ ఆర్మీ అంటే ఏంటంటే..

భారత సైన్యానికి మద్దతుగా పార్ట్ టైమ్ వాలంటీర్లతో కూడినదే ఈ టెరిటోరియల్ ఆర్మీ. రిజర్వ్ ఫోర్స్ అని కూడా పిలుస్తారు. ఇందులోని సిబ్బంది, అధికారులకు రెగ్యులర్ ఆర్మీ తరహాలోనే ట్రైనింగ్ ఇస్తారు. వీరంతా బయట ఉద్యోగాలు చేసుకుంటూనే స్వచ్చందంగా ఆర్మీతో కలిసి పని చేస్తుంటారు. పార్ట్ టైమ్ వాలంటీర్లతో కూడిన మిలటరీ రిజర్వ్ ఫోర్స్‌లో అధికారులు, జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్లు, నాన్-కమిషన్డ్ ఆఫీసర్లు, ఇతర సిబ్బంది ఉంటారు. భారత సైన్యంలోని వారితో సమానమైన ర్యాంక్‌లను కలిగి ఉంటారు. రెగ్యులర్ సైన్యానికి స్టాటిక్ విధుల నుంచి ఉపశమనం కలిగించడంలో టెరిటోరియల్ ఆర్మీ ప్రధాన పాత్ర పోషిస్తుంది. అవసరమైన సందర్భాల్లో రెగ్యులర్ సైన్యానికి సాయం కూడా చేస్తుంది.

ఆ ఆర్మీలో ఎవరెవరు ఉన్నారంటే..

ప్రస్తుతం టెరిటోరియల్ ఆర్మీలో చాలా మంది ప్రముఖులు, సెలబ్రెటీలు ఉన్నారు. టీమిండియా మాజీ క్రికెటర్ సచిన్ టెండుల్కర్, టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని, మాజీ కెప్టెన్ కపిల్ దేవ్, షూటర్ అభినవ్ బింద్రా, అనురాగ్ ఠాకూర్, సచిన్ పైలట్, మలయాళం యాక్టర్ మోహన్ లాల్, నానా పటేకర్ తదితరులు టెరిటోరియల్ ఆర్మీలో ఉన్నారు. భారత్‌-పాక్ యుద్ధం నేపథ్యంలో ధోని, సచిన్ వంటి క్రికెటర్లను యుద్ధానికి పంపితే, వారి పాత్ర కూడా ముఖ్యమైనది కావచ్చు. కానీ అది పూర్తిగా సైన్యం అవసరాలపై ఆధారపడి ఉంటుంది. గతంలో భారత స్టార్ క్రికెటర్ హేము అధికారి రెండవ ప్రపంచ యుద్ధంలో పార్టిసిపేట్ చేశాడు. ఆ సమయంలో, అతనికి లెఫ్టినెంట్ కల్నల్ హోదా లభించింది. ఈసారి కూడా అలాంటి దృశ్యాలు చూసే అవకాశం రావొచ్చు. నేరుగా యుద్దమే చేస్తారో.. లేదంటే యుద్ధానికి మద్దతుగా ప్రచారం చేస్తోరో.

యుద్ధం వస్తే.. రాావాల్సిందే..

1948లో టెరిటోరియల్ ఆర్మీ చట్టం ద్వారా ఇది ఏర్పాటైంది. భారత సైన్యం నుంచి నియమితులైన లెఫ్టినెంట్ జనరల్ -ర్యాంకింగ్ అధికారి, రక్షణ మంత్రిత్వ శాఖ సైనిక వ్యవహారాల విభాగం కింద చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ నేతృత్వం వహిస్తారు. టెరిటోరియల్ ఆర్మీ రెండు యూనిట్లను కలిగి ఉంది. 1962లో చైనాతో యుద్ధంలో 1965, 1971 భారత్ పాక్ యుద్ధంలో.. 1999 కార్గిల్ యుద్ధంలో టెరిటోరియల్ ఆర్మీ పాల్గొంది. అందులో ఇప్పటికిప్పుడు 14 టెరిటోరియల్ ఆర్మీ బెటాలియన్లను విధుల్లోకి తక్షణమే రప్పించాలని కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నిర్ణయించారు. ప్రస్తుతం దాదాపు 50 వేల మంది వరకు ఈ ఆర్మీలో ఉన్నట్లు తెలుస్తోంది.

Also Read : ఇంకా కశ్మీర్ కోసమే కక్కుర్తా? పాక్ బుద్ది మారదా?

Related News

Maoist Party: మల్లోజుల లొంగుబాటుపై మావోయిస్ట్ పార్టీ సంచలన లేఖ

Pakistan – Afghanistan: ఉద్రిక్తతలకు తెర.. కాల్పుల విరమణకు అంగీకరించిన పాకిస్థాన్ -అఫ్గానిస్థాన్

Rajnath Singh: ఆపరేషన్ సిందూర్ జస్ట్ ట్రైలర్ మాత్రమే.. ‘బ్రహ్మోస్’ పాక్ తాట తీస్తుంది: రాజ్ నాథ్ సింగ్

Transgenders Suicide Attempt: ఫినైల్ తాగేసి ఆత్మహత్యకు ప్రయత్నించిన 24 మంది హిజ్రాలు.. అసలు ఏమైంది?

Heavy Rains: ఈశాన్య రుతుపవనాలు ఎంట్రీ.. ఓ వైపు వాయుగుండం, ఇంకోవైపు అల్పపీడనం

Gujarat Ministers Resign: గుజరాత్ కేబినెట్ మొత్తం రాజీనామా.. ఎందుకంటే?

Maoist Surrender: ల్యాండ్ మార్క్ డే! 2 రోజుల్లో 258 మంది.. మావోయిస్టుల లొంగుబాటుపై అమిత షా ట్వీట్

Bangalore News: నారా లోకేశ్ కామెంట్స్.. డీకే శివకుమార్ రిప్లై, బెంగళూరుకు సాటి లేదని వ్యాఖ్య

Big Stories

×