Big Stories

Cyclone : పొంచి ఉన్న ‘మోచా’ ముప్పు.. తీరం ఎక్కడ దాటుతుందంటే..?

Cyclone : బంగాళాఖాతంలో ఏర్పడిన తుపాను ఆవర్తనం.. అల్పపీడనంగా మారుతుందని వాతావరణశాఖ ప్రకటించింది. ఇది ఈ నెల 9న తీవ్ర వాయుగుండంగా మారుతుందని గోపాల్‌పూర్‌ వాతావరణ అధ్యయన కేంద్రం తెలిపింది. ఈ నెల 10న వాయుగుండం.. తుపానుగా మారుతుందని వివరించింది. ఈ తుపాన్ కు యెమన్‌ దేశం ‘మోచా’గా నామకరణం చేసింది.

- Advertisement -

ఈ నెల 9న వాయుగుండం ఉత్తర దిశగా బంగాళాఖాతంలో ప్రవేశించి ఆ తరువాత ఏ దిశగా కదులుతుందన్న దానిపై ఇంకా స్పష్టత లేదని వాతావరణశాఖ తెలిపింది. తుపాన్ పరిస్థితులపై మంగళవారం పూర్తిగా అంచనా వస్తుందని వివరించింది. ఏపీలోని ఓడరేవుల్లో ఇంతవరకు ఎలాంటి హెచ్చరికలు జారీ చేయలేదు. సముద్రంలో చేపలు వేటకు వెళ్లిన మత్స్యకారులు సోమవారం సాయంత్రంలోగా ఒడ్డుకు చేరుకోవాలని హెచ్చరించింది.

- Advertisement -

తుపాన్ తీవ్రంగా మారినా ఏపీకి ముప్పులేదని వాతావరణశాఖ అంచనా వేస్తోంది. మోచా తుపాన్ మయన్మార్‌ వద్ద తీరం దాటొచ్చని విదేశీ వాతావరణ అధ్యయన సంస్థలు వెల్లడించాయి. ఒడిశాకు కూడా ముప్పు ఉండదని స్పష్టం చేశాయి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News