BigTV English

Addanki Assembly Constituency : అద్దంకిలో జనం ఓటు ఎవరికి..? బిగ్ టీవీ సర్వే ఏం చెబుతోంది..?

Addanki Assembly Constituency : అద్దంకిలో జనం ఓటు ఎవరికి..? బిగ్ టీవీ సర్వే ఏం చెబుతోంది..?

Addanki Assembly Constituency : ఆంధ్రప్రదేశ్ లోని అద్దంకి నియోజకవర్గం చారిత్రకంగా భౌగోళికంగా పేరున్న ప్రాంతం. తొలి తెలుగు పద్య శాసనం అద్దంకిలోనే వెలుగు చూసింది. రెడ్డిరాజుల కాలంలో అద్దంకి ఓ వెలుగు వెలిగింది. గుండ్లకమ్మ నది ఒడ్డున ఉన్న అద్దంకి రాజధానిగా చేసుకుని 1324లో ప్రోలయ వేమారెడ్డి పాలించాడు. ప్రోలయ వేమారెడ్డి ఆస్థానకవిగా ఉన్న ఎర్రాప్రగడ మహాభారతాన్ని ఇక్కడే పూర్తిచేశాడు. టంగుటూరి ప్రకాశం పంతులు బాల్యంలో అద్దంకిలోనే చదువుకొన్నాడు. ఇలాంటి గొప్ప విశేషాలకు కారణమైన అద్దంకి నియోజకవర్గం రాజకీయాల్లోనూ చాలా స్పెషల్. ఇక్కడ గొట్టిపాటి రవికుమార్ 2009 నుంచి గెలుస్తూ వస్తున్నారు. 2009లో కాంగ్రెస్ నుంచి గెలిచారు. 2014లో వైసీపీ నుంచి గెలిచారు. 2019లో టీడీపీ నుంచి గెలిచారు. ఇలా పార్టీ ఏదైనా గొట్టిపాటి రవికుమార్ దే విజయం అన్నట్లుగా సీన్ మారిపోయింది. పర్సనల్ ఇమేజ్ తో అద్దంకిలో గొట్టిపాటి పట్టు నిలుపుకొంటున్నారు. ఈ నియోజకవర్గం ఓటరు నాడి ఎలా ఉందో తెలుసుకునే ముందు 2019 అసెంబ్లీ ఫలితాలను ఓసారి చూద్దాం.


2019 RESULTS

బాచిన చెంచు గరటయ్య VS గొట్టిపాటి రవికుమార్


YCP 45%
TDP 51%
OTHERS 4%

2019 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ నుంచి సీనియర్ మోస్ట్ లీడర్ బాచిన చెంచు గరటయ్య పోటీ చేశారు. అదే సమయంలో టీడీపీ నుంచి గొట్టిపాటి రవికుమార్ బరిలో నిలబడి మంచి మెజార్టీతో గెలిచారు. ఇక్కడ వైసీపీకి 45 శాతం ఓట్లు రాగా, టీడీపీకి 51 శాతం ఓట్లు వచ్చాయి. ఇతరులు 4 శాతం ఓట్లు సాధించారు. గత ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా జగన్ వేవ్ కనిపించినా ఇక్కడ మాత్రం గొట్టిపాటి రవికుమార్ తన వ్యక్తిగత ఇమేజ్ తో మంచి మెజార్టీతో విజయం సాధించారు. మరి ఈసారి ఎన్నికల్లో అద్దంకి సెగ్మెంట్ లో రాజకీయం ఎలా ఉండబోతోందో బిగ్‌ టీవీ ఎక్స్‌క్లూజివ్‌ డీటెయిల్డ్‌ ఎలక్షన్‌ సర్వేలో వెల్లడైన అభిప్రాయాలు ఇప్పుడు పరిశీలిద్దాం..

పాణెం హనిమి రెడ్డి (YCP)

పాణెం హనిమి రెడ్డి ప్లస్ పాయింట్స్

  • నియోజకవర్గంలో జోరుగా పర్యటనలు
  • పల్లెపల్లెకు హనిమి రెడ్డి అన్న కార్యక్రమం
  • వైవీ సుబ్బారెడ్డి మద్దతు ఉండడం

పాణెం హనిమి రెడ్డి మైనస్ పాయింట్స్

  • నియోజకవర్గానికి హనిమి రెడ్డి కొత్త కావడం
  • అద్దంకిలో చాలా మందికి పరిచయం లేని పేరు

బాచిన కృష్ణ చైతన్య (YCP)

బాచిన కృష్ణ చైతన్య ప్లస్ పాయింట్స్

  • తండ్రి గరటయ్య రాజకీయ వారసత్వం
  • జనంలో వ్యక్తిగతంగా మంచి ఇమేజ్
  • గడప గడప కార్యక్రమంలో యాక్టివ్ పార్టిసిపేషన్

బాచిన కృష్ణ చైతన్య మైనస్ పాయింట్స్

  • అద్దంకి వైసీపీలో గ్రూపు రాజకీయాల సమస్య

గొట్టిపాటి రవికుమార్ (TDP)

గొట్టిపాటి రవికుమార్ ప్లస్ పాయింట్స్

  • అద్దంకి ప్రజల్లో మంచి ఇమేజ్
  • ప్రజా సమస్యల పరిష్కారంలో గొట్టిపాటి క్యాడర్ ముందుండడం
  • ప్రజానాయకుడిగా గుర్తింపు పొందడం
  • పక్కా ఇళ్లు, హాస్పిటల్స్ లో సౌకర్యాలు పెరగడం

గొట్టిపాటి రవికుమార్ మైనస్ పాయింట్స్

  • తాగునీటి సమస్యలు పెరగడం
  • అద్దంకిలో అద్వాన్నంగా తయారైన రోడ్లు

కుల సమీకరణాలు

ఎస్సీ 29%
కమ్మ 19%
రెడ్డి 11 %
యాదవ్ 8 %
కాపు 7%
ఎస్టీ 6%

అద్దంకి నియోజకవర్గంలో ఎస్సీ సామాజికవర్గం జనాభా ఎక్కువగా ఉంది. ఇక్కడి ఎస్సీల్లో 50 శాతం మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ కు, 45 శాతం మంది టీడీపీ జనసేనకు, 5 శాతం మంది ఇతరులకు మద్దతు ఇస్తామని బిగ్ టీవీ సర్వేలో తమ అభిప్రాయంగా చెప్పారు. అటు కమ్మ కమ్యూనిటీలో 30 శాతం వైసీపీకి, 65 శాతం టీడీపీకి, 5 శాతం ఇతరులకు మద్దతుగా ఉంటామన్నారు. రెడ్డి కమ్యూనిటీలో 55 శాతం వైసీపీకి, 40 శాతం తెలుగుదేశం పార్టీకి, 5 శాతం ఇతరులకు సపోర్ట్ గా ఉంటామన్నారు. ఇక యాదవ సామాజికవర్గంలో 45 శాతం మంది వైసీపీకి, 50 శాతం మంది టీడీపీకి, ఇతరులకు 5 శాతం మంది మద్దతు ఇస్తామన్నారు. అటు కాపు వర్గంలో 40 శాతం వైసీపీకి, 55 శాతం టీడీపీకి, 5 శాతం ఇతరులకు మద్దతుగా ఉంటామని సర్వేలో భాగంగా చెప్పారు. ఎస్టీల్లో 45 శాతం మంది వైసీపీకి, 50 శాతం టీడీపీకి, 5 శాతం ఇతరులకు మద్దతు ఇస్తామంటున్నారు. ఇక వచ్చే ఎన్నికల్లో అద్దంకి నియోజకవర్గంలో ఎవరెవరు పోటీలో ఉంటే ఫలితాలు ఏ విధంగా వచ్చే అవకాశం ఉందో పరిశీలిద్దాం…

పాణెం హనిమి రెడ్డి VS గొట్టిపాటి రవికుమార్

YCP 41%
TDP 54%
OTHERS 5%

ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే అద్దంకిలో టీడీపీ గెలిచేందుకే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు బిగ్ టీవీ సర్వేలో వెల్లడైంది. టీడీపీ అభ్యర్థి గొట్టిపాటి రవికుమార్ కు 54 శాతం ఓట్లు వస్తాయని తేలింది. అదే సమయంలో వైసీపీ నుంచి పాణెం హనిమి రెడ్డి బరిలో ఉంటే 41 శాతం ఓట్లు వచ్చేందుకు ఛాన్సెస్ ఉన్నాయని తేలింది. ఇక ఇతరులకు 5 శాతం ఓట్లు వస్తాయని తేలింది. మొత్తంగా అద్దంకిలో టీడీపీ డామినెంట్ పార్టీగా కనిపిస్తోంది. గొట్టిపాటి రవికుమార్ ఏ పార్టీలో ఉన్నా.. సొంత ఇమేజ్ తో నెగ్గుకు వచ్చే అవకాశాలైతే ఉన్నాయి. అద్దంకిలో ప్రత్యర్థి బలంగా లేకపోవడంతో గొట్టిపాటికి మరింత ప్లస్ అవుతుందని తేలింది. వీటితో పాటే ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు కూడా పెద్ద ఎత్తున పడే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. మరోవైపు ప్రభుత్వం నుంచి లబ్ది పొందిన వారు వైఎస్ఆర్ కాంగ్రెస్ కు మద్దతు ఇచ్చే అవకాశాలున్నాయి. అద్దంకిలో కీలకంగా ఉన్న వైవీ సుబ్బారెడ్డి ఎఫెక్ట్ వైసీపీ ఓట్ షేర్ ను పెంచడంలో ఉపయోగపడడం లేదని తాజా సర్వేలో తేలింది.

.

.

Related News

Pawan Kalyan: రూటు మార్చిన పవన్.. నిన్న మామిడి.. నేడు చీరలు, రేపు?

AP Free Bus Scheme: ఏపీలో ఫ్రీ బస్ స్కీమ్.. ఆ బస్సు లెక్కితే ఉచిత ప్రయాణం ఉండదు

Chandrababu: మళ్లీ జన్మంటూ ఉంటే నాకు అక్కడ పుట్టాలని ఉంది -చంద్రబాబు

Jagan-Sharmila: అన్న పేరెత్తకుండా షర్మిల, చెల్లి పేరు లేకుండా జగన్ రక్షా బంధన్ ట్వీట్లు

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Tirumala devotees: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి పట్టే సమయం ఎంతంటే?

Big Stories

×