Tirupati Airport: ఈ మధ్యకాలంలో ప్రయాణికులు పలు విమానాల సంస్థలపై రుసరుసలాడుతున్నారు. అసలు కారణమేంటో తెలీకుండా సడన్ సర్వీసులను క్యాన్సిల్ చేయడం ఇందుకు కారణమవుతోంది. తాజాగా అలాంటి ఘటన ఒకటి ఏపీలో జరిగింది. రేణిగుంట ఎయిర్‌పోర్టులో స్పైస్ జెట్ విమాన యాజమాన్యంపై శివాలెత్తారు నటుడు ప్రదీప్.
రేణుగుంట ఎయిర్‌పోర్టులో గతరాత్రి తిరుపతి-హైదరాబాద్ రావాల్సిన స్పైస్ జెట్ విమానం ఒక్కసారిగా రద్దయ్యింది. ఈ విషయంలో ప్రయాణికుల ముందుస్తు సమాచారం ఇవ్వలేదు. విమానం ఎంతసేపుకి బయలు దేరకపోవడంతో ప్రయాణికులు స్పైస్ జెట్ కౌంటర్ వద్దకు వెళ్లారు. అలా వెళ్లినవారిలో నటుడు ప్రదీప్ కూడా ఉన్నాడు.
ఆయన కూడా తిరుపతి నుంచి హైదరాబాద్‌కు రావాల్సివుంది. సడన్‌గా సర్వీసు రద్దు చేయడంపై ప్రయాణికులు తప్పుబట్టారు. ఓ అడుగు ముందుకేసిన నటుడు ప్రదీప్ యాజమాన్యం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ కంపెనీ సిబ్బంది కడిగి పారేశారు. ప్రదీప్ ప్రశ్నలకు ఆ సిబ్బంది కళ్లు తేలేశారు.
సర్వీసు క్యాన్సిల్ చేసినట్టు ప్రయాణికులకు ప్రత్యామ్నాయం చూపించాల్సిన బాధ్యత లేదా? అంటూ నిలదీశాడు. ఇప్పుడేకాదు.. తిరుపతి వెళ్లిన ప్రయాణికులకు నెలలో రెండువారాల ఒకసారి ఇలాంటి పరిస్థితులు పునరావృతమవుతున్నాయి. విమానం లోపమో, ప్రయాణికులకు లేక మరేదైనా కారణాలు కావచ్చు.
ALSO READ: టీటీడీ స్ట్రాంగ్ వార్నింగ్.. ఇకపై కేసులు నమోదు
ముందుగా టికెట్ తీసుకున్న ప్రయాణికులకు ప్రత్యామ్నాయం చూపించాల్సిన బాధ్యత సంబంధిన ఎయిర్ లైన్స్ సంస్థపై ఉంది. ఆ సంస్థ ఇలాగే చేస్తే ప్రయాణికులు దూరమయ్యే అవకాశముందని అంటున్నారు ప్రయాణికులు.
స్పైస్ జెట్ సిబ్బందిపై నటుడు ప్రదీప్ ఆగ్రహం వ్యక్తం చేసిన వేళ అక్కడే ఉన్న ఓ ట్రావెలర్ ఈ తతంగాన్ని తన సెల్‌ఫోన్‌లో చిత్రీకరించాడు. సోషల్ మీడియా పోస్టు చేశారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అయ్యింది.
విమాన సర్వీస్ రద్దు.. స్పైస్ జెట్ యాజమాన్యంపై నటుడు ప్రదీప్ మండిపాటు..
రేణుగుంట విమాశ్రయంలో నిన్న రాత్రి రద్దు అయిన తిరుపతి-హైదరాబాద్ విమాన సర్వీసు
ప్రయాణికులకు ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వని స్పైస్ జెట్ నిర్వాహకులు
దీంతో అసహనానికి గురై స్పైస్ జెట్ సిబ్బందితో గొడవ పడ్డ నటుడు… pic.twitter.com/LZAxq0NX5l
— BIG TV Breaking News (@bigtvtelugu) September 5, 2025