Gundeninda GudiGantalu Today episode September 5th: నిన్నటి ఎపిసోడ్ లో.. సుశీలను చూసి అందరూ సంతోషపడతారు. ఎన్నాళ్లయింది మిమ్మల్ని చూసి అని అందరూ చాలా సంతోషంగా ఉంటారు. ప్రభావతి మాత్రం ఎందుకు వచ్చిందా అని అడుగుతుంది. రేపు నా మనవడు మనవరాలు పెళ్లిరోజు కదా గ్రాండ్ గా చేయాలి అని అంటుంది సుశీల. ప్రభావతి మాత్రం ఏంటి ఫంక్షన్ హాల్ అంత డబ్బులు మా దగ్గర ఉన్నాయి మీరు అనుకుంటున్నారా అని అంటుంది. మౌనికొస్తే ఏదైనా గొడవ చేస్తారేమో అని టెన్షన్ పడుతుంది మీనా. ప్రభావతి మౌనికకు ఫోన్ చేస్తే సుశీల మాట్లాడుతుంది. సుశీల మౌనిక వాళ్ళ అత్తతో మాట్లాడి వాళ్ళని పంపించండి అమ్మ అని అడుగుతుంది.. సువర్ణ ఇచ్చిన మాట ప్రకారం సంజయ్ మౌనికను పంపిస్తుంది. సంజయ్ ఇంటికి రాదని అది లేదు ఇది లేదు మర్యాద లేదు అంటూ వెటకారంగా మాట్లాడతాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. మీనాను స్పెషల్ గా వంట చెయ్యమని అడుగుతుంది. అయితే ఆ లిస్ట్ చూసి షాక్ అవుతుంది. బాలు ఇవన్నీ చేయడం నీకు సమస్యగా ఉందా ఏదో ఒకటి చేసి పడేయ్ అనేసి అంటాడు.. నాకు వంట చేయడం ఇబ్బంది కాదండి వాడి నోరు కంట్రోల్లో పెట్టుకోకపోతే నేను కంట్రోల్ తప్పేలా ఉన్నాను అని అంటుంది. ఒక్కొక్కటిగా వంటలు చేసావా అని అడుగుతుంది. మీనాకు ఆర్డర్ వేయడం చూసిన సుశీల అన్ని ఒక్కటే ఎలా చేస్తుంది? నీ అల్లుడికి నువ్వే చేసుకోవాలి కదా కోడలు ఎవరైనా చేస్తారా అని అడుగుతుంది. మీ అల్లుడు నీకు గొప్ప అయినప్పుడు నువ్వే చేసుకోవాలి అంతేకనీ మీనా చేయాల్సిన అవసరం లేదు కదా అని సుశీల అంటుంది..ఆ మాటకి ప్రభావతి షాక్ అవుతుంది. ఇక సంజయ్ కి గది ఇవ్వడం గురించి మాట్లాడుకుంటారు. ఆ రోహిణి మా గదిలో మనోజ్ కి కింద పడుకుంటే నిద్ర రాదు అత్తయ్య. గది ఇవ్వడం కుదరదు.
సంజయ్ భోజనానికి కూర్చుంటాడు. అయితే నేను ఇలాంటి ప్లేట్లలో తినను అంటే ప్రభావతి వెండి ప్లేట్ తెచ్చి పెడుతుంది. ఆ ప్లేట్ గురించి బాలు సెటైర్లు వేస్తాడు. ఇది మా తాతయ్య ప్లేటు మా బామ్మ నాకిచ్చింది మా అమ్మ మీకు ఇచ్చింది అని పెద్ద స్టోరీ నే చెప్తాడు. సంజయ్ వేరెవరో తిన్న ప్లేట్లో నేను తినాలా అవసరం లేదు నాకు ఆకు వేయండి చాలు అని అంటాడు. మీరు ఏ హోటల్ కి వెళ్ళినా ఎవరెవరో తిన్న వాటిలోనూ తింటారు కదా లేదా మీ చంకలు మీరు ప్లేట్ ని పెట్టుకొని తిరుగుతారా ఏంటి అని బాలు సెటైర్లు వేస్తాడు.
ఒక్కసారిగా సంజయ్ కోపంతో రగిలిపోతాడు. ఆ తర్వాత వంటల మీద కూడా సంజయ్ ఏదో ఒకటి అంటాడు. ప్రభావతి ఎంత చెప్తున్నా సరే సంజయ్ మాత్రం ఏదో ఒక రకంగా వాళ్ళని అందరినీ అవమానించాలని అనుకుంటాడు. ఇక భోజనం అయ్యాక నాకు నిద్ర వస్తుంది నాకు అది చూపించండి అని సంజయ్ అంటాడు. ముగ్గురు అన్నదమ్ములు కలిసి సంజయ్ ని పైకి తీసుకుని వెళ్తారు. అక్కడ మనోజ్ గదిని కావాలనే ఆ గది మీకు వద్దు అని బాలు అంటాడు..
అది కచ్చితంగా బాలు గాడికి అదే ఉంటది వాడు ఈరోజు వాడి పెళ్ళాంతో బయటే పడుకోవాలి అని సంజయ్ నాకు ఆగదే కావాలి అని అందులో పడుకోడానికి వెళ్తాడు. మనోజు ఎంత చెప్తున్నా సరే సంజయ్ మాత్రం నాకు అదే కావాలి అని అనడంతో ఏమీ చేయలేక మౌనంగా ఉండిపోతాడు. కిందకి వెళ్లి ఆ విషయం నేను రోహిణి తో చెప్తాడు. మీ ఇద్దరిలో ఎవరో ఒకరు గది మాకు ఇవ్వండి అని రోహిణి అంటుంది.. రవి, శృతిలు మా గదిలో పడుకోండి మేం కూడా డాబా పై పడుకుంటాము అని అంటారు..
Also Read : చెంబు కోసం వెతుకులాట.. శ్రీవల్లి సేఫ్ అయ్యినట్లే.. రామరాజు షాకింగ్ నిర్ణయం..?
రోహిణి మనోజ్ ఇద్దరూ కూడా సంతోషంగా ఫీల్ అవుతారు. ఇక డాబాపై సుశీలతో అందరూ ముచ్చట్లు పెట్టుకొని మాట్లాడుకుంటూ ఉంటారు. అక్కడికొచ్చిన మౌనిక అందరితో సరదాగా ఉండాలని అనుకుంటుంది. అందరూ సంతోషంగా ఉండడం చూసి కన్నీళ్లు పెట్టుకుంటుంది. సంజయ్ గురించి అందరూ మాట్లాడటం విన్న సంజయ్ మౌనికను కోపంగా రమ్మని పిలుస్తాడు. మొహం మీదే తలుపు వేస్తాడు ఈ క్రమంలో మౌనిక చెయ్యి తలుపు సందులో పడి నలిగిపోతుంది.. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి…