BigTV English

Actress Arrest in Vizag : బంగారం చోరీ కేసు.. విశాఖలో సినీ నటి అరెస్ట్

Actress Arrest in Vizag : బంగారం చోరీ కేసు.. విశాఖలో సినీ నటి అరెస్ట్
actress sowmya arrested in gold robbery case
actress sowmya arrested in gold robbery case

Actress Sowmya Arrest in Gold Robbery Case(Andhra news today): ఇన్‌స్టాగ్రామ్‌లో హాట్ ఫోటోలు, మత్తెక్కించే రీల్స్ పోస్టు చేస్తూ నెటిజన్లకు కనువిందు చేసే ఓ హీరోయిన్‌ను పోలీసులు అరెస్టు చేశారు. అదీ.. ఒకరి ఇంట్లో చోరీ చేసిందనే ఘటనలో. నగరంలోని దొండపర్తి సమీపంలోని బాలాజీ మెట్రో అపార్టుమెంటులో ప్లాట్ నంబర్ 102లో నివాసం ఉంటున్న ప్రసాద్ బాబు కుమార్తెతో సౌమ్యశెట్టికి స్నేహం ఉంది. ప్రసాద్‌బాబు పోస్టల్ శాఖలో పనిచేసి రిటైర్డ్ అయ్యారు. తరచూ సౌమ్య.. తమ స్నేహితురాలి ఇంటికి వెళ్లేది. తనకు అలవాటైన యాక్టింగ్‌కు తోడు చోరకళ కూడా యాడ్ చేసి.. ఎవరికీ తెలియకుండా బంగారం కొట్టేసింది. ఆ బంగారాన్ని అమ్మేసి గోవాకు మకాం మార్చింది. అక్కడ హాట్ షో తో హీటెక్కించే రీల్స్ చేస్తూ రెచ్చిపోతోంది.


బంగారం చోరీ కేసులో పోలీసులు దర్యాప్తు చేసి మన రీల్స్ సుందరే నిందితురాలని తేల్చడంతో.. ఇప్పుడు జైలులో ఊచలు లెక్క పెడుతోంది. ప్రసాద్ బాబు, తన కుమార్తె మౌనికతో కలిసి నివాసముంటున్నారు. వీళ్లు ఫిబ్రవరి 23న యలమంచిలిలో బంధువుల వివాహానికి వెళ్లేందుకు రెడీ అయ్యారు. ఈ క్రమంలోనే బంగారు ఆభరణాల కోసం బీరువా లాకర్ తెరవగా అందులోని కిలో బంగారు ఆభరణాలు కనిపించలేదు. దీంతో.. ప్రసాద్ వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు.. క్లూస్ టీం సహాయంతో బీరువాపై ఉన్న వేలి ముద్రలను సేకరించింది.

Read More : ప్రధాని మోదీ దేశవ్యాప్త పర్యటన షెడ్యూల్.. నేడు తెలంగాణకు రాక


రిటైర్డ్ పోస్టల్ ఉద్యోగి ప్రసాద్ బాబు, ఆయన కుమార్తెను పోలీసులు విచారించగా.. ఇటీవల తమ ఇంటిలోకి వచ్చిన కొందరిపై అనుమానం ఉందని తెలిపారు. జనవరి 29, ఫిబ్రవరి 19 తేదీల్లో తన కుమార్తె స్నేహితులైన భార్యభర్తలు, మరికొంతమంది ఇంటికి వచ్చారని.. బాత్రూమ్‌కి వెళ్లాలన్న సాకుతో బెడ్‌రూమ్‌లోకి వెళ్లి కొద్దిసేపటి తర్వాత బయటికి వచ్చారని మౌనిక తెలిపింది. దీంతో పోలీసులు రెండు బృందాలుగా ఏర్పడి 11 మంది అనుమానితులపై దర్యాప్తు చేపట్టారు. వీరిలో ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారించారు. ఈ క్రమంలోనే.. హీరోయిన్ బండారం బయటపడింది. ఇన్ స్టాలో వీడియోలు చేస్తూ ఫేమ్ తెచ్చుకున్న సౌమ్య.. “ట్రిప్” అనే సినిమాలో నటించింది. ప్రస్తుతం శివమ్ అనే చిత్రంలోనూ చేస్తోంది.

గతంలో జూనియర్ ఆర్టిస్టుగా పనిచేసిన సౌమ్యకు.. 2016లో మౌనికతో పరిచయం ఏర్పడింది. ఫ్రెండ్ షిప్ పేరుతో తరచూ మౌనిక ఇంటికి వచ్చేది సౌమ్య. ఆ సమయంలోనే వాష్ రూమ్ కి వెళ్లాలంటూ నేరుగా బెడ్రూమ్ లోకి వెళ్లి బాత్రూమ్ ను యూజ్ చేసుకునేది. గదిలోకి వెళ్లిన ప్రతీసారి చాలా టైమ్‌ వరకు బయటికి వచ్చేది కాదు. అలా రెండు మూడుసార్లు చేసిన సౌమ్య సరైన సమయం కోసం వేచిచూసింది. దొరికిందే ఛాన్స్ అనుకుని తనలో దాగున్న చోరకళను బయటకు తీసి.. బంగారాన్ని మాయం చేసింది.

Read More : వనపర్తిలో ఘోరరోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి

రంగంలోకి దిగిన పోలీసులు తమదైన శైలిలో విచారణ చేయగా.. ఆమె దగ్గరున్న కొంత బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. మిగతా బంగారం గురించి అడిగితే.. తన దగ్గర అంతే ఉందని.. మిగిలింది ఇవ్వలేనని చెప్పేసింది. ఇంకా గట్టిగా అడిగితే సూసైడ్ చేసుకుంటానని బెదిరించినట్లు తెలుస్తోంది. తర్వాత సౌమ్యను కోర్టులో హాజరు పరుచగా.. న్యాయమూర్తి ఆమెకు 15 రోజులపాటు రిమాండ్ విధించారు.

Tags

Related News

YS Jagan: ఉప ఎన్నికల వేళ జగన్ 8 ప్రశ్నలు.. ఓటమిని ముందే ఒప్పుకున్నారా..?

Pulivendula Campaign: ఖైదీల వేషధారణలో ఎన్నికల ప్రచారం.. వైసీపీ పరువు తీసేశారుగా!

Nara Lokesh: ర్యాగింగ్ ఘటనపై లోకేష్ ఘాటు రియాక్షన్

Visakhapatnam 2050: విశాఖ నగరం 2050లో.. ఇలా ఉంటుందా? అసలు ఊహించలేం కదా!

Araku Coffee: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. అరకులో ఇకపై అందరూ లక్షాధికారులే!

Pawan Kalyan project: పవన్ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం.. కోట్లల్లో ఖర్చు.. ఎందుకంటే?

Big Stories

×