BigTV English

Wanaparthy Road Accident : వనపర్తిలో ఘోర రోడ్డుప్రమాదం.. ఐదుగురు మృతి

Wanaparthy Road Accident : వనపర్తిలో ఘోర రోడ్డుప్రమాదం.. ఐదుగురు మృతి
wanaparthy road accident
wanaparthy road accident

Wanaparthy Road Accident (telugu breaking news today) : వనపర్తి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జాతీయ రహదారిపై అతివేగంగా వెళ్తున్న కారు.. అదుపుతప్పి చెట్టును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ఆరుగురికి తీవ్రగాయాలయ్యాయి. మృతుల్లో ముగ్గురు చిన్నారులు ఉన్నారు. టేక్కలయ్య దర్గా సమీపంలో ఎర్టిగా కారు అదుపు తప్పి చెట్టును ఢీ కొట్టింది. ప్రమాద సమయంలో కారులో 11 మంది ప్రయాణిస్తున్నారు.


Read More : తెలంగాణ ప్రజలూ..ఈ 5 రోజులు జాగ్రత్త.. హెచ్చరించిన వాతావరణశాఖ

డ్రైవర్ నిద్రమత్తే ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను మెరుగైన చికిత్సకోసం ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. బళ్లారి నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. కారులో ప్రయాణిస్తున్న వారందరూ ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తులుగా పోలీసులు గుర్తించారు. ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.


Tags

Related News

NTR: సారీ నన్ను క్షమించండి.. ఈవెంట్ తర్వాత ఎన్టీఆర్ స్పెషల్ వీడియో

Mother’s Love: అమ్మకు ప్రేమతో.. హ్యాపీ మదర్స్ డే..!

Cm Revanth Reddy: నేడు పాల‌మూరుకు సీఎం.. రూ.110 కోట్ల‌తో ఎలివేటెడ్ కారిడార్ రోడ్డుకు శంకుస్థాప‌న‌!

Pawan Kalyan: ఇష్టం వ‌చ్చిన‌ట్టు మాట్లాడితే తొక్కిప‌ట్టి నార‌ తీస్తాం.. రోజా, కోడాలికి ప‌వ‌న్ స్ట్రాంగ్ వార్నింగ్!

Chadrababu Naidu vs YS Jagan: తిరుమల డిక్లరేషన్ రగడ.. గెలిచిందెవరు?

Chiranjeevi: చిరు చేసిన పనికి గుండె ఆగిపోయినంత పనైంది- తెలుగు హీరోయిన్..!

Big Stories

×