BigTV English

Aghori Car Accident: అఘోరీ కారుకు ఘోర ప్రమాదం.. నుజ్జు నుజ్జైన కారు.. ప్ర‌స్తుతం ఎలా ఉందంటే?

Aghori Car Accident: అఘోరీ కారుకు ఘోర ప్రమాదం.. నుజ్జు నుజ్జైన కారు.. ప్ర‌స్తుతం ఎలా ఉందంటే?

Aghori Car Accident: లేడీ అఘోరీ ఈ పేరు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు..దేశవ్యాప్తంగా ప్ర‌స్తుతం మారు మోగిపోతోంది. ఎక్క‌డ నుండి వ‌చ్చిందో ఏమో కానీ ఒక్క‌సారిగా మీడియాలో ఫేమ‌స్ అయిపోయింది. ముత్యాల‌మ్మ గుడి సంఘ‌ట‌న అఘోరీ బ‌య‌ట‌కు రాగా అంత‌కు ముందే తెలంగాణ‌లో ఒక‌టి రెండు ప్రాంతాల్లో క‌నిపించింది. ఆ స‌మ‌యంలో ఎవ‌రూ పెద్ద‌గా ప‌ట్టించుకోలేదు. కానీ ముత్యాల‌మ్మ గుడి ఘ‌ట‌న త‌ర‌వాత మీడియాతో సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసి వార్త‌ల్లో నిలిచింది. మ‌రోవైపు అఘెరీ అంటే ఎలాంటి హంగులు లేకుండా ఉంటారు. కానీ లేడీ అఘోరీ కారులో రావ‌డం, ఐఫోన్ వాడ‌టంతో ఆమె వ్య‌వ‌హారం మ‌రింత హాట్ టాపిక్ గా మారింది.


Also read: కొంప ముంచిన ఫార్ములా ఈ రేస్, కేటీఆర్ చుట్టూ ఉచ్చు.. రంగంలో ఈడీ?

ఇక ముత్యాల‌మ్మ గుడివ‌ద్ద ద‌గ్గ‌ర ఆత్మ‌హ‌త్య చేసుకుంటానని ప్ర‌క‌టించ‌డంతో పోలీసులు మంచిర్యాల‌లోని ఆమె నివాసానికి తీసుకువెళ్లి గృహ నిర్భందం చేశారు. త‌ర‌వాత ఆత్మ‌హ‌త్య విర‌మించుకోవ‌డం, ఇత‌ర రాష్ట్రాల‌కు వెళ‌తాన‌ని చెప్ప‌డంతో పోలీసులు మ‌హ‌రాష్ట్ర వైపుకు తీసుకువెళ్లి వ‌దిలిపెట్టారు. కానీ మ‌రుస‌టి రోజే ఏపీకి వెళ్లింది. ఏపీలోని శ్రీకాళ‌హ‌స్తికి చేరుకోగా దిగంబ‌రిగా ద‌ర్శ‌నం చేసుకునేందుకు నిరాక‌రించారు. దీంతో కాషాయ దుస్తుల్లో దేవుడి ద‌ర్శ‌నం చేసుకుంది. అంతే కాకుండా నిన్న శ్రీకాళ‌హ‌స్తిలో పెట్రోల్ పోలీసుకుని ఆత్మ‌హ‌త్య చేసుకుంటాన‌ని హ‌ల్ చేసింది. మొత్తానికి ద‌ర్శ‌నం అనంత‌రం శ్రీకాళ‌హ‌స్తి నుండి కారులో వెళుతుండ‌గా అఘోరీ కారుకు ఘోర ప్రమాదం జ‌రిగింది.


కారుకు లైట్లు లేక‌పోవ‌డంతో డివైడ‌ర్ ను ఢీ కొట్టిన‌ట్టు స‌మాచారం. ప్ర‌మాదంలో కారు ఎడ‌మ భాగం నుజ్జునుజ్జు అయింది. ఘ‌ట‌న అనంత‌రం మీడియాతో మాట్లాడిన అఘోరీ తాను సేఫ్ గానే ఉన్న‌ట్టు ప్ర‌క‌టించింది. శ్రీకాళ‌హ‌స్తి నుండి పోలీసులు త‌న‌ను వెళ్లండి వెళ్లండి అన‌డంతో బ‌య‌లుదేరాన‌ని చెప్పారు. కారుకు లైటు లేద‌ని చెప్పినా విన‌లేద‌న మండిప‌డ్డారు. పోలీసుల వ‌ల్లే త‌న కారుకు యాక్సిడెంట్ అయింద‌ని ఆరోపించారు. శ్రీకాళ‌హ‌స్తి నుండి సింగిల్ రోడ్డు ఉంద‌ని డ‌బుల్ రోడ్డు కూడా లేద‌న్నారు. ఇదంతా పోలీసుల వ‌ల్లే జ‌రిగింద‌ని కొద్దిలో ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డ్డాన‌ని అన్నారు.

Related News

Jagan-Sharmila: అన్న పేరెత్తకుండా షర్మిల, చెల్లి పేరు లేకుండా జగన్ రక్షా బంధన్ ట్వీట్లు

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Tirumala devotees: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి పట్టే సమయం ఎంతంటే?

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Big Stories

×