Suriya : కోలీవుడ్ స్టార్ సూర్య (Suriya) నటించిన మొట్టమొదటి పాన్ ఇండియా మూవీ ‘కంగువ’ (Kanguva). ఈనెల 14న భారీ ఎత్తున రిలీజ్ కాబోతున్న ఈ సినిమాకు శివ దర్శకత్వం వహించారు. అలాగే ఈ మూవీలో బాలీవుడ్ బ్యూటీ దిశా పటాని, బాలీవుడ్ నటుడు బాబి డియోల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. మూవీ రిలీజ్ దగ్గర పడడంతో మేకర్స్ తాజాగా హైదరాబాద్లో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు. అయితే ఇప్పటిదాకా ‘కంగువ’ మూవీ పై ఉన్న నెగెటివిటీని ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ పూర్తిగా తుడిచి పెట్టింది. అసలేం జరిగిందంటే…
‘కంగువ’ (Kanguva) ప్రమోషనల్ స్ట్రాటజీ ప్లాన్ తో సూర్య ఈ మూవీపై ఇప్పటి దాకా తెలుగు ప్రేక్షకుల్లో ఉన్న నెగెటివిటీని దూరం చేశారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ తర్వాత తెలుగు స్టేట్స్ లో ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది. ఇప్పటిదాకా ‘కంగువ’ అనే టైటిల్ విషయంలో తెలుగు ఆడియన్స్ గరం గరంగా ఉన్నారు. అంతకంటే ముందు నుంచే తమిళ సినిమాలను తెలుగులో అదే టైటిల్ తో రిలీజ్ చేస్తున్నారు అనే వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. దీంతో తమిళ వాళ్లకు బాగా పొగరు సినిమా టైటిల్స్ ని వాళ్ల భాషలో మాత్రమే పెట్టి, ఇతర భాషల్లో కూడా రిలీజ్ చేస్తున్నారు అనే విమర్శలు వినిపించాయి. అంతేకాకుండా ఇతర భాషల నుంచి కలెక్షన్లు కావాలి కానీ వారి భాష మీద మాత్రం ప్రేమ ఉండదు వీళ్ళకు అంటూ ‘కంగువ’ సినిమా పై నెగిటివ్ టాక్ వచ్చింది. ఒకానొక టైం లో ఏకంగా బ్యాన్ ‘కంగువ’ అనే ట్యాగ్ కూడా సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యింది. కానీ సూర్య తాజాగా తన ప్రమోషన్స్ తో ఒక్కసారిగా ఆ నెగెటివిటీ మొత్తాన్ని మార్చేశారు.
ఇప్పుడు సూర్య చేసిన పనికి తెలుగు హీరో అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక పలువురు తెలుగు హీరోలు, డైరెక్టర్లు కూడా చాలా మంది ‘కంగువ’కు ప్రమోషన్స్ చేస్తుండడం విశేషం. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ఏకంగా జక్కన్న స్పెషల్ గెస్ట్ గా విచ్చేయగా, రాజమౌళి (SS Rajamouli)తో పాటు డైరెక్టర్ బోయపాటి శ్రీను (Boyapati Srinu), యంగ్ హీరోలు సిద్దు జొన్నలగడ్డ (Siddhu Jonnalagadda), విశ్వక్సేన్ (Vishwak Sen) ముఖ్య అతిథులుగా హాజరు కావడమే అందుకు నిదర్శనం. అలాగే సూర్య టాలీవుడ్లో ఉన్న పాపులర్ షోలలో కూడా కనిపించి తన సినిమాను ప్రమోట్ చేసుకున్నారు. అందులో భాగంగానే బిగ్ బాస్ 8లో నాగార్జునతో కలిసి కనిపించారు. అంతేకాదు ‘అన్ స్టాపబుల్’ అంటూ బాలయ్యతో సందడి చేశారు. మొత్తానికి అన్ని భాషల హీరోలను కలుపుకుంటూ వెళ్తున్న సూర్య తన సినిమా పై వచ్చిన నెగెటివిటీని దూరం చేయడంతో పాటు, ఎలాంటి అపశృతి జరగకుండా చూసుకోవడానికి ఇలాంటి ప్రమోషన్ స్ట్రాటజీని ఫాలో అవ్వడం నిజంగా ఇతర సినిమాలకు, అందులో నటించే హీరోలకు స్ఫూర్తిదాయకం అని చెప్పొచ్చు. అయితే ‘కంగువ’ మూవీకి తెలుగు ఆడియన్స్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.