E-Paper
Advertisement

ఘోర ప్రమాదం.. టెంపోను ఢీకొట్టిన లారీ, 13 మంది బీహార్ కార్మికులకు గాయాలు!

ఘోర ప్రమాదం.. టెంపోను ఢీకొట్టిన లారీ, 13 మంది బీహార్ కార్మికులకు గాయాలు!
Advertisement

Annamayya Accident: అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లి నియోజకవర్గం పరిధిలోని కురబలకోట సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. చేనేతనగర్ వద్ద రోడ్డుపై వేగంగా వెళ్తున్న లారీ ఎదురుగా వస్తున్న టెంపోను బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో 13 మంది వలస కూలీలు తీవ్రంగా గాయపడ్డారు.

పనులకు వెళ్తుండగా ప్రమాదం

Advertisement

బీహార్‌లోని పూర్ణియా జిల్లాకు చెందిన వీరంతా పొట్టకూటి కోసం ఏపీకి వచ్చిన వలస కార్మికులు. మదనపల్లె సమీపంలోని రామాచర్లపల్లెకు చెందిన ఓ కాంట్రాక్టర్ వద్ద ఏడాది కాలంగా వీరు భవన నిర్మాణ మోల్డింగ్ పనులు చేస్తున్నారు. శనివారం ఉదయం నిత్యం లాగే మోల్డింగ్ పనుల నిమిత్తం టెంపోలో అంగళ్లకు బయలుదేరారు. ఈ క్రమంలోనే చేనేతనగర్ వద్దకు రాగానే ఎదురుగా వచ్చిన లారీ టెంపోను ఢీకొట్టడంతో ఒక్కసారిగా ప్రాణభయంతో కూలీలు కేకలు వేశారు.

ఆసుపత్రికి తరలింపు.. కేసు నమోదు

Advertisement

ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు స్పందించి, తీవ్రంగా గాయపడిన 13 మంది కూలీలను టెంపో నుంచి బయటకు తీశారు. వెంటనే వారిని చికిత్స కోసం జిల్లా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అత్యవసర విభాగంలో వైద్యులు వారికి తీవ్ర చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న ముదివేడు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు జరుపుతున్నారు.

Also Read: 10 సార్లు ఓటేసిన నా ఓటే తీసేస్తారా? నిజామాబాద్ వేదికగా టీపీసీసీ చీఫ్ షాకింగ్ కామెంట్స్!

Tags

Related News

1984లో స్టార్ట్ చేశారు.. కానీ ఇప్పటికీ ఆ కాలేజీకి భవనం లేదు! ఎక్కడో తెలుసా?

కాకినాడలో భారీ వర్షాలు.. అధికారులకు పవన్ కళ్యాణ్ కీలక ఆదేశాలు!

బాబు వెన్నుపోట్లను గడపగడపకూ తీసుకెళ్లండి.. జగన్ హాట్ కామెంట్స్!

కూటమి ప్రభుత్వం కొత్త ట్రెండ్.. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లకు శుభవార్త, ప్రత్యర్థి శిబిరంలో వణుకు

ట్రావెల్ బస్సులో అగ్నిప్రమాదం.. ప్రమాదం సమయంలో 38 మంది ప్రయాణికులు, శ్రీశైలంలో ఘటన

కళింగపట్నం వద్ద తీరం దాటిన తీవ్ర వాయుగుండం, ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు, విద్యాసంస్థలకు సెలవు

సాయికృష్ణ లాకప్ డెత్ కేసు.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. హైకోర్టు విచారణపై స్టే, ఈనెల 30 లోపు..

Big Stories

Advertisement
×