CM Revanth Yadadri Temple Visit Live: యాదాద్రి లక్ష్మి నరసింహస్వామిని దర్శించుకున్నారు సీఎం రేవంత్‌రెడ్డి దంపతులు. శుక్రవారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పుట్టిన రోజు కావడంతో హైదరాబాద్ నుంచి నేరుగా హెలికాఫ్టర్‌లో యాదగిరి గుట్టుకు చేరుకున్నారు.
ఉదయం 10 గంటలకు స్వామిని దర్శించుకున్నారు. ఆలయంలో వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తర్వాత ఆలయ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఆ కార్యక్రమం తర్వాత మధ్యాహ్నం ఒకటిన్నర గంటలకు రోడ్డు మార్గంలో వలిగొండ మండలం సంగెం గ్రామానికి చేరుకుంటారు. అక్కడి నుంచి మూసీ పరివాహక ప్రాంత రైతులతో నది వెంబడి పాదయాత్ర చేయనున్నారు. ముఖ్యంగా భీమలింగం, ధర్మారెడ్డి, కాలువలను సందర్శిస్తారు.