E-Paper
Advertisement

అన్నమయ్య జిల్లాకు భారీ షాక్.. రూ. 10,300 కోట్ల ప్రాజెక్ట్ రద్దుపై భూమన ఫైర్!

అన్నమయ్య జిల్లాకు భారీ షాక్.. రూ. 10,300 కోట్ల ప్రాజెక్ట్ రద్దుపై భూమన ఫైర్!
Advertisement

Bhumana Karunakar Reddy: అన్నమయ్య జిల్లాలో భారీ అంచనాలతో ప్రారంభించాల్సిన రూ. 10,300 కోట్ల పంప్డ్ హైడ్రో స్టోరేజ్ ప్రాజెక్టును ప్రభుత్వం అర్ధరాత్రి జీవోతో రద్దు చేయడంపై తిరుపతి మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత భూమన కరుణాకరరెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఈ హఠాత్తు నిర్ణయం వెనుక ఉన్న అసలు కారణాలను బయటపెట్టాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

పర్యావరణ సాకులు.. ప్రభుత్వ ముందస్తు విశ్లేషణ ఏదీ?

Advertisement

చింతలపాల్యం, కొమ్మూరు, చిట్టడవి ప్రాంతాల్లో 2 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంతో ఈ భారీ ప్రాజెక్టును ఏర్పాటు చేసేందుకు 2025 ఫిబ్రవరి 7న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సుమారు 3 వేల మంది నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు లభిస్తాయని అప్పట్లో గొప్పగా ప్రచారం చేశారు. కానీ, ఇప్పుడు టైగర్ జోన్, పర్యావరణ సున్నిత ప్రాంతం అనే కారణాలు చూపుతూ ప్రాజెక్టును రద్దు చేయడంపై భూమన అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రాథమిక జీవో ఇచ్చే సమయంలో ఈ ప్రాంతం టైగర్ జోన్ అని ప్రభుత్వానికి తెలియదా? పర్యావరణ అనుమతులు లేకుండానే ఈ ప్రాజెక్టును ఎలా ప్రకటించారని ఆయన ప్రశ్నించారు.

రాష్ట్రం నుంచి తరలిపోతున్న పెట్టుబడులు

Advertisement

రాష్ట్రంలో పెట్టుబడులకు అనుకూల వాతావరణం ఉందంటూ నారా లోకేష్ ప్రచారం చేసే ‘స్పీడ్ ఆఫ్ డూయింగ్’ విధానంతో కొత్తగా ఎన్ని ప్రాజెక్టులు వచ్చాయో స్పష్టం చేయాలని భూమన సవాలు విసిరారు. విశాఖ పార్ట్‌నర్‌షిప్ సమ్మిట్‌లో ప్రకటించిన పెట్టుబడుల వాస్తవ పరిస్థితి ఏంటో ప్రజలకు వివరించాలన్నారు. అన్నమయ్య జిల్లా నందలూరు ప్రాంతంలో ఏర్పాటు చేయాల్సిన కీలక ప్రాజెక్టులు ఎందుకు నిలిచిపోతున్నాయో సమాధానం చెప్పాలని, ప్రాజెక్టుల తరలింపు వెనుక పర్సంటేజీలు, కమిషన్ల ఆరోపణలు వస్తున్నాయని ఆయన మండిపడ్డారు.

రాష్ట్రానికి రావాల్సిన పరిశ్రమలు ఇతర రాష్ట్రాలకు తరలిపోతుంటే ప్రభుత్వం చూస్తూ ఊరుకుంటోందని, పంప్డ్ హైడ్రో ప్రాజెక్ట్ రద్దుపై పూర్తిస్థాయి స్పష్టతనిచ్చి వాస్తవాలను ప్రజల ముందు ఉంచాలని ఆయన డిమాండ్ చేశారు.

Also Read: నాగాలాండ్‌లో విషాదం.. కల్తీ మద్యం తాగి 19 మంది మృతి!

Tags

Related News

జగన్ గారూ.. సచివాలయ ఉద్యోగాల కుంభకోణంపై సీబీఐ విచారణకు మీరు సిద్ధమా?- రాంగోపాల్ రెడ్డి

ఇంత దారుణమైన పాలన.. ఎప్పుడూ చూడలేదు.. చంద్రబాబుపై విరుచుకుపడ్డ పెద్దిరెడ్డి!

ఘోర ప్రమాదం.. టెంపోను ఢీకొట్టిన లారీ, 13 మంది బీహార్ కార్మికులకు గాయాలు!

1984లో స్టార్ట్ చేశారు.. కానీ ఇప్పటికీ ఆ కాలేజీకి భవనం లేదు! ఎక్కడో తెలుసా?

కాకినాడలో భారీ వర్షాలు.. అధికారులకు పవన్ కళ్యాణ్ కీలక ఆదేశాలు!

బాబు వెన్నుపోట్లను గడపగడపకూ తీసుకెళ్లండి.. జగన్ హాట్ కామెంట్స్!

కూటమి ప్రభుత్వం కొత్త ట్రెండ్.. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లకు శుభవార్త, ప్రత్యర్థి శిబిరంలో వణుకు

Big Stories

Advertisement
×