E-Paper
Advertisement

ఇంత దారుణమైన పాలన.. ఎప్పుడూ చూడలేదు.. చంద్రబాబుపై విరుచుకుపడ్డ పెద్దిరెడ్డి!

ఇంత దారుణమైన పాలన.. ఎప్పుడూ చూడలేదు.. చంద్రబాబుపై విరుచుకుపడ్డ పెద్దిరెడ్డి!
Advertisement

Peddireddy Remarks: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఎంతో మంది ముఖ్యమంత్రులను చూశానని ఇంత దారుణమైన పరిపాలన అందించిన ఘనత సీఎం చంద్రబాబుకే దక్కుతుందని వైసీపీ నేత, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎద్దేవా చేశారు. కడప వైసీపీ కార్యాలయంలో కోర్ కమిటీ మీటింగ్ లో పాల్గొన్న పెద్దిరెడ్డి.. అనంతరం మీడియాతో మాట్లాడారు. అధికార పార్టీ నేతల తొత్తులుగా పోలీసులు పని చేస్తున్నారని మండిపడ్డారు. ఇచ్చిన హామీలను నెరవేర్చిన పరిస్థితి కూటమి ప్రభుత్వంలో లేదని వ్యాఖ్యానించారు.

స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు టీడీపీని వ్యతిరేకిస్తారని స్పష్టంగా తెలుస్తోందని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అభిప్రాయపడ్డారు. అందుకే కుట్రలు చేసి మున్సిపల్ ఎన్నికలు గెలవాలని కూటమి ప్రభుత్వం చూస్తుందని ఆరోపించారు. ‘వైసీపీ తరపున మంచి అభ్యర్థులను బరిలో దించుతాం. స్థానిక సంస్థల ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా తీసుకుని పని చేస్తాం. ఎన్నికల కార్యాచరణపై సమావేశంలో చర్చించాం’ అని పెద్దిరెడ్డి తెలిపారు.

Advertisement

Also Read: మీ ఫోన్ కెమెరా హ్యాకర్ల కంట్రోల్లోకి వెళ్లిందా? వెంటనే ఇలా కనిపెట్టండి.. లేదంటే డేంజరే!

రాబోయే స్థానిక సంస్థ ఎన్నికలు కూటమి అరాచకాలకు, వైసీపీ విశ్వసనీయతకు జరిగే పరీక్షగా ప్రజలు చూస్తున్నారని పెద్దిరెడ్డి అన్నారు. వైసీపీ హయాంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో దౌర్జన్యాలు జరగలేదన్న ఆయన.. తమ ప్రభుత్వంలో జరిగిన అన్ని ఎన్నికలు ప్రజాస్వామ్య బద్దంగా జరిగినవేనన్నారు. బీసీ రిజర్వేషన్లు చెల్లవని కోర్టు తీర్పు ఇచ్చినా.. 50 శాతం స్థానిక సంస్థల సీట్లు బీసీలకు ఇచ్చామని పేర్కొన్నారు. మరోవైపు రాష్ట్రంలో శాంతిభద్రతల గురించి ప్రస్తావిస్తూ.. మనుషులను తీసుకెళ్లి బూడిద ఇచ్చే పరిస్థితికి పోలీసులు వచ్చారని పెద్దిరెడ్డి విమర్శించారు.

Advertisement

Also Read: రైలులో సైకో కిల్లర్.. ఖాకీ దుస్తుల్లో వచ్చి డ్రామాలు.. ప్రయాణికులను బయటకు తోసేస్తూ దారుణాలు!

Tags

Related News

ఘోర ప్రమాదం.. టెంపోను ఢీకొట్టిన లారీ, 13 మంది బీహార్ కార్మికులకు గాయాలు!

1984లో స్టార్ట్ చేశారు.. కానీ ఇప్పటికీ ఆ కాలేజీకి భవనం లేదు! ఎక్కడో తెలుసా?

కాకినాడలో భారీ వర్షాలు.. అధికారులకు పవన్ కళ్యాణ్ కీలక ఆదేశాలు!

బాబు వెన్నుపోట్లను గడపగడపకూ తీసుకెళ్లండి.. జగన్ హాట్ కామెంట్స్!

కూటమి ప్రభుత్వం కొత్త ట్రెండ్.. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లకు శుభవార్త, ప్రత్యర్థి శిబిరంలో వణుకు

ట్రావెల్ బస్సులో అగ్నిప్రమాదం.. ప్రమాదం సమయంలో 38 మంది ప్రయాణికులు, శ్రీశైలంలో ఘటన

కళింగపట్నం వద్ద తీరం దాటిన తీవ్ర వాయుగుండం, ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు, విద్యాసంస్థలకు సెలవు

Big Stories

Advertisement
×