Big Stories

Alla Ramakrishna Reddy : వైసీపీకి ఆర్కే రాజీనామా.. మంగళగిరి ఎమ్మెల్యే సంచలన నిర్ణయం..

Alla Ramakrishna Reddy : మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణరెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. వైసీపీకి గుడ్ బై చెప్పారు. అలాగే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. స్పీకర్ కు రిజైన్ లెటర్ పంపించారు. 2014, 2019 ఎన్నికల్లో ఆయన మంగళగిరి నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు.

- Advertisement -

2019లో వైసీపీ అధికారంలోకి రావడంతో మంత్రి పదవి వస్తుందని ఆశించారు. ఎందుకంటే ఎన్నికల ముందు ఆర్కేకు మంత్రి ఇస్తానని పలు వేదికలపై వైఎస్ జగన్ ప్రకటించారు. అయినా సరే తొలి, మలి విడత మంత్రి వర్గాల్లో ఆయనకు చోటు దక్కలేదు.

- Advertisement -

గంజి చిరంజీవికి నియోజకవర్గ ఇన్ ఛార్జ్ బాధ్యతలను వైసీపీ అధిష్టానం అప్పగించింది. వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ కూడా ఆయనకే ఇస్తారనే క్లారిటీ వచ్చేసింది. ఈ నేపథ్యంలోనే ఆర్కే అసంతృప్తిగా ఉన్నారని టాక్ నడుస్తోంది. కొంతకాలంగా ఆర్కే పార్టీ కార్యకలాపాల్లోనూ చురుగ్గా పాల్గొనడంలేదు. ఎన్నికలకు మూడు నెలల ముందు ఇలా సంచలన నిర్ణయంతో వైసీపీకి షాకి ఇచ్చారు ఆర్కే. మరి రాజకీయంగా ఆయన అడుగులు ఎటు వేస్తారనే ఆసక్తి నెలకొంది.

2014లో ఆర్కే కేవలం 12 ఓట్లతేడాతో గెలిచారు. అప్పుడు టీడీపీ అభ్యర్థిగా గంజి చిరంజీవి పోటీ చేశారు. ఆయనపై ఆర్కే గెలిచారు. 2019 ఎన్నికల్లో మంగళగిరి నుంచి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పోటీ చేశారు. అప్పుడు ఆయనపై ఆళ్ల రామకృష్ణారెడ్డి విజయం సాధించారు. గంజి చిరంజీవి టీడీపీ వీడి వైసీపీలో చేరారు. వచ్చే ఎన్నికల్లోనూ నారా లోకేశ్ మంగళగిరి నుంచే పోటీ చేయాలని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వైసీపీ అధిష్టానం గంజి చిరంజీవిని బరిలో దింపాలని భావిస్తోంది. ఈ నిర్ణయం సిట్టింగ్ ఎమ్మెల్యే ఆర్కే రాజీనామాకు దారి తీసింది.

.

.

.

.

.

.

.

.

.

.

.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News