E-Paper
Advertisement

Sai Pallavi : తండేల్ కోసం తంటాలు పడుతున్న సాయి పల్లవి..

Sai Pallavi : తండేల్ కోసం తంటాలు పడుతున్న సాయి పల్లవి..
Advertisement
Sai Pallavi

Sai Pallavi : కెరీర్ లో ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న నాగచైతన్య ఈసారి ఎలా అయినా సక్సెస్ సాధించాలి అని వినూత్నమైన చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీగా ఉన్నాడు గీత ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ చిత్రానికి చందు ముండేటి దర్శకత్వ బాధ్యతలు వహిస్తున్నాడు ఇక ఈ మూవీకి తండేల్ అనే వెరైటీ టైటిల్ ని కూడా ఇచ్చారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పనులు కూడా మొదలయ్యాయి.

భారీ బడ్జెట్ తో పాన్ ఇండియన్ లెవెల్ లో నిర్మిస్తున్న ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ జనవరి నుంచి మొదలు కాబోతోంది. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ స్టార్ట్ అవుతున్నాయి. ఇక ఈ మూవీలో నాగచైతన్య జోడిగా.. సాయి పల్లవి నటిస్తున్న విషయం తెలిసిందే.ఇంతకుముందు వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన లవ్ స్టోరీ చిత్రం మంచి సక్సెస్ సాధించింది. ఆన్ స్క్రీన్ ఇద్దరికీ కెమిస్ట్రీ కూడా బాగా సెట్ అవ్వడంతో ఈ ఈ మూవీ కోసం సాయి పల్లవి ని సెలెక్ట్ చేసుకున్నారు.

Advertisement

ఈ మూవీ లో సాయి పల్లవి శ్రీకాకుళానికి చెందిన ఒక పల్లెటూరి అమ్మాయి పాత్రలో కనిపించబోతోంది. అంతేకాదు ఈ పాత్రకు ఎన్నో వేరియేషన్స్ కూడా ఉన్నాయట. ఈ మూవీలో ఒక పక్క శ్రీకాకుళం సాంగ్ ఉంది.. అందులో పాటతో పాటు ఆమె పాత్రకు కొన్ని సంభాషణలు కూడా ఉన్నాయట. సాయి పల్లవి అంటే ఎంత పర్ఫెక్ట్ గా నటిస్తుందో అందరికీ తెలిసిందే కదా.. అందుకే తన పాత్ర పర్ఫెక్ట్ గా ఉండడం కోసం ప్రస్తుతం సాయి పల్లవి ప్రత్యేకంగా శ్రీకాకుళం స్లాంగ్ నేర్చుకునే ప్రయత్నంలో ఉంది.

దీనికోసం ప్రత్యేకమైన వర్క్ షాప్స్ కూడా అటెండ్ అవుతున్నట్లు టాక్. ప్రస్తుతం సాయి పల్లవి పూర్తిస్థాయిలో ఆమె పాత్ర పై పట్టు సాధించడం కోసం ప్రయత్నం చేస్తోంది. అలాగే ఈ మూవీలో మనం కొత్త సాయి పల్లవి ని చూస్తామని చిత్ర బృందం కాన్ఫిడెంట్ గా ఉంది. ఒకపక్క నాగచైతన్య ప్రేమించే అమ్మాయిగా కనిపించే సాయి పల్లవి ..తన హక్కుల కోసం పోరాడే ఒక డేరింగ్ ఉమెన్ పాత్రలో తన పవర్ఫుల్ పర్ఫామెన్స్ ని ప్రదర్శిస్తుందట. ఇలా సినిమాలో పరిస్థితిని బట్టి ఆమె పాత్రలో విభిన్నమైన వేరియేషన్స్ ను మనం గమనించవచ్చు అని డైరెక్టర్ వెల్లడించారు.

Advertisement

విరాట పర్వం ,లవ్ స్టోరీ సినిమాల తర్వాత సాయి పల్లవి తన సినీ కెరీర్ కు చాలా లాంగ్ గ్యాప్ తీసుకుంది. మధ్యలో చాలా సినిమాల ఆఫర్లు వచ్చిన ఆమె ఎందుకో నిరాకరిస్తూ వచ్చింది.ఈ నేపథ్యంలో ఆమె ఇంక సినిమాల్లో నటించదు అన్న వార్తలు కూడా బాగా ప్రచారం అయ్యాయి. కానీ సడన్ గా తండేల్ మూవీకి ఓకే చెప్పింది. మామూలుగా సాయి పల్లవి ఒక సినిమా స్టోరీ కి ఒకే చెప్పాలి అంటే కేవలం స్టోరీ కాదు..హీరోయిన్ క్యారెక్టర్ కూడా ఆమెకి బాగా నచ్చాలి. అందుకే ఆమె చేసిన సినిమాల్లో క్యారెక్టర్స్ ఎంతో స్పెషల్ గా ఉంటాయి.. దీన్ని బట్టి ఈ మూవీలో ఆమె పాత్ర ఎంత గొప్పగా ఉండబోతుందో ఆలోచించండి. ఇక మనం..తండేల్ మూవీ లో సిక్కోలు యువతిగా కొత్త సాయి పల్లవి ని చూడడం ఖాయం అన్నమాట.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×