BigTV English

Allu Arjun: బన్నీ స్పీచ్.. బాగా మండుతున్నట్లుందే!

Allu Arjun: బన్నీ స్పీచ్.. బాగా మండుతున్నట్లుందే!

Allu Arjun: బన్నీ ఏమో మావాడు.. మావాడు అంటూ డోల్ బాజా మోగిస్తే, ఇప్పుడేమో ఇలా చేస్తే ఎలా. మేము పడ్డ కష్టమంతా బూడిద పాలైందిగా. చివరికి మీరు.. మీరు ఒకటి. మేము మాత్రం పుష్పాలమే కదా బన్నీ అంటూ వైసీపీకి చెందిన కొందరు సోషల్ మీడియా వేదికగా భగ్గుమంటున్నారు. తాను ఒకటి తలిస్తే, దైవం ఇంకొకటి తలుస్తుందని అంటుంటారు పెద్దలు. అదే ఇప్పుడు జరిగింది. మేమంతా ఒక్కటై ఏదో చేద్దాం అనుకుంటే.. డామిట్ కథ అడ్డం తిరిగిందే అంటూ ఆ వర్గం సోషల్ మీడియా కోడై కూస్తోంది.


పుష్ప – 2 సినిమా సక్సెస్ మీట్ లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చేసిన స్పీచ్ అందరికీ షాకిచ్చింది. అందులో వైసీపీ నేతలకు భారీ షాక్ అనే చెప్పవచ్చు. పుష్ప 2 సినిమా రిలీజ్ కు ముందే వైసీపీకి చెందిన కొందరు నేతలు చేసిన హంగామా అంతా ఇంతా కాదు. ఛాన్స్ దొరికితే చాలు.. మావాడు అనే క్యాప్షన్ పెట్టేసేవారు.

ఏదో ఫ్రెండ్ కోసం ఒక్క అడుగు వేస్తే, ఇదే ఛాన్స్ అంటూ వైసీపీ పది అడుగులు బన్నీ వైపు వేసిందని చెప్పవచ్చు. ఈ ఎపిసోడ్ లో మాజీ మంత్రి అంబటి రాంబాబు రూటే వేరు. సినిమాను అడ్డుకుంటారా? ఐకాన్ స్టార్ అంటే ఏమనుకుంటున్నారు? మేమున్నాం అంటూ ఓ రేంజ్ లో రెచ్చిపోయారు. అంతేకాదు ఆయన ట్వీట్ ల పరంపర సినిమా ప్రమోషన్ లెవెల్ లో సాగింది. దీనికి ప్రధాన కారణం బన్నీని బాణంలా గురిపెట్టి డిప్యూటీ సీఎం పవన్ ను టార్గెట్ చేయాలన్నదే అభిమతమని పొలిటికల్ క్రిటిక్స్ భావన.


నిన్న జరిగిన సక్సెస్ మీట్ లో ఒక్క మాటంటే ఒక్క మాట వైసీపీ గురించి బన్నీ నోరెత్తక పోవడంతో ఆ పార్టీ ఖంగుతిందట. అది కూడా ఎవరు పేరు ఎత్తకూడదని వైసీపీ నేతలు భావించారో, ఆ పేరు పలికేశాడు బన్నీ. అది కూడా చెమ్మగిల్లిన కళ్లతో బాబాయ్ అనేశాడు. అది ఇప్పుడు వైసీపీకి మింగుడు పడడం లేదట. బన్నీ సక్సెస్ మీట్ లో ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, సినిమాటోగ్రఫీ మంత్రి దుర్గేష్ కు కృతజ్ఞతలు తెలిపారు. పవన్ కు మాత్రం ప్రత్యేకంగా బాబాయ్ థ్యాంక్యూ అనగానే.. ఫ్యాన్స్ కేకలతో హోరెత్తించారు.

మొన్నటి వరకు మావాడు క్యాప్షన్ తో ప్లెక్సీలు కూడా కట్టారు వైసీపీ క్యాడర్. థియేటర్స్ వద్ద మాకోసం నీవు.. నీకోసం మేమంటూ హల్చల్ చేశాయి ప్లెక్సీలు. కానీ బంధాలు ఆప్యాయతలు ఎప్పటికైనా ఒక్కటి కావాల్సిందేనన్న విషయం ఒక్కసారిగా బన్నీ మాటలతో భోదపడింది. ఊహించని కామెంట్స్ తో షాకిచ్చిన బన్నీ తీరు పట్ల, మొన్నటి వరకు వైసీపీ పడ్డ తాపత్రయం బూడిదపాలేనని రివర్స్ అటాక్ ప్రారంభించింది సోషల్ మీడియా.

బన్నీ మనసు మారడానికి ప్రధాన కారణం ఇదేనంటూ కూడా ప్రచారం సాగుతోంది. సినిమాలో లేని డైలాగులను మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ లకు ఆపాదిస్తూ ఓ వర్గం సోషల్ మీడియా కోడై కూసింది. వాడికి వాడి కొడుక్కి, వాడి బాబాయికి నేనేరా బాస్ అనే డైలాగ్ సినిమాలో ఉందని తెగ ప్రచారం జరిగింది. ఈ డైలాగ్ సినిమాలో లేకపోయినా, మెగా ఫ్యామిలీకి అల్లు ఫ్యామిలీకి ఎవరో పుల్లలు పెట్టే ప్రయత్నం జోరుగా సాగించారన్నది కాస్త ఆలస్యంగా బహిర్గతమైంది.

Also Read: Intinti Ramayanam Today Episode : అవనిని క్షమించిన అక్షయ్.. పల్లవికి షాకిచ్చిన కమల్..

దీనితో అల్లు అర్జున్ కూడా ఇంత నీచానికి దిగుజారుతారా.. లేనిది ఉన్నట్లు ప్రచారం చేసిందెవరో ఇప్పటికే ఒక అంచనాకు వచ్చారట. అందుకే కాబోలు అసలు విషయం గ్రహించిన బన్నీ, తన స్పీచ్ తో మెగా ఫ్యాన్స్ కి ఆనందం కలిగించారని టాక్. ఇదేనన్న మాట అయినవారి మధ్యన తగాదా కోసం వెళితే, చివరకు డామిట్ కథ అడ్డం తిరిగిందని చెప్పక తప్పదంటూ మెగా ఫ్యాన్స్ కౌంటర్ ఇస్తున్నారు. ఈ కౌంటర్ ఎవరికో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదుగా.. ఈ పాటికే మీకు అర్థమయే ఉంటుందిగా!

Related News

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Pulivendula: పులివెందులలో హై టెన్షన్.. వివేకానంద పుట్టిన రోజు, సునీత సంచలన వ్యాఖ్యలు

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Vizag Harbour News: విశాఖలో ఫిషింగ్ హార్బర్ వద్ద ఘోర ప్రమాదం.. ఐదుగురు అక్కడికక్కడే మృతి!

Big Stories

×