Rewind 2024 : తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం సీక్వెల్స్ హవా కొనసాగుతుంది.. ఒక సినిమా హిట్ అయితే రెండో సినిమా పై డైరెక్టర్స్ ఫోకస్ చేస్తున్నారు. ఆ సినిమా కూడా హిట్ అయితే మరో సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇటీవల సీక్వెల్ గా వచ్చిన సినిమాలు కూడా భారీ విజయాన్ని అందుకుంటున్నాయి. పార్ట్-1 సెట్స్ మీద ఉండగానే పార్ట్-2 ప్రకటిస్తున్నారు. ఒకప్పుడు బాలీవుడ్ లో సీక్వెల్స్, ప్రాంచైజీలు ఉండేవి. కానీ ఇప్పుడు తెలుగులోనూ ఊపందుకున్నాయి.. తెలుగు దర్శకులు పార్ట్ లుగా సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఇక 2024 లో టాలీవుడ్ లో ఎన్ని సీక్వెల్ సినిమాలు వచ్చాయో.. అందులో ఎన్ని హిట్ టాక్ ను సొంతం చేసుకున్నాయో? ఎన్ని బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయో? ఒకసారి తెలుసుకుందాం..
హిట్ టాక్ ను అందుకున్న సీక్వెల్స్..
టిల్లు స్క్వేర్..
ఈ ఏడాది మార్చిలో సిద్దు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ నటించిన సీక్వెల్ మూవీ ‘టిల్లు స్క్వేర్’.. 2022 లో వచ్చింది డీజే టిల్లుకు సీక్వెల్ గా ఈ మూవీ వచ్చింది. తక్కువ బడ్జెట్ లో తెరకెక్కిన ఈ మూవీ రూ. 125 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. దీంతో ఈ ఫ్రాంచైజీలో మూడో సినిమాగా ‘టిల్లు క్యూబ్’ రానుందని మేకర్స్ ప్రకటించారు.. త్వరలోనే ఈ మూవీ గురించి అనౌన్స్ మెంట్ రానుంది..
మత్తు వదలరా 2..
ఏంఏం కీరవాణి కుమారుడు హీరోగా ఎంట్రీ ఇచ్చిన మత్తు వదలరా సినిమాతో మంచి హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఆ మూవీకి సీక్వెల్ గా ఐదేళ్ల తర్వాత మత్తు వదలరా 2 వచ్చింది. రితేష్ రానా దర్శకత్వం వహించిన ఈ క్రైమ్ కామెడీ చిత్రంలో శ్రీ సింహా, సత్య, ఫరియా అబ్దుల్లా ప్రధాన పాత్రలు పోషించారు. ఇది చిన్న సినిమాగా విడుదలై, బాక్సాఫీస్ వద్ద పెద్ద విజయం అందుకుంది. ముఖ్యంగా ఓవర్ సీస్ లో అనూహ్యమైన వసూళ్లు రాబట్టింది.. ఓటీటీ లో కూడా మంచి రెస్పాన్స్ ను అందుకుంది.
పుష్ప 2..
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా నటించిన లేటెస్ట్ బ్లాక్ బాస్టర్ మూవీ పుష్ప 2.. పుష్ప: ది రైజ్’ చిత్రానికి సెకండ్ పార్ట్ గా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కింది. అల్లు అర్జున్, రష్మిక మందన్న హీరో హీరోయిన్లుగా నటించారు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం.. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతోంది. భారతీయ సినీ చరిత్రలో ఆల్ టైమ్ బిగ్గెస్ట్ ఓపెనర్ గా నిలవడమే కాదు.. కేవలం మూడు రోజుల్లోనే 500 కోట్లు అందుకోవడం మామూలు విషయం కాదు. ఇదే జోరులో దూసుకుపోతే మాత్రం సినిమా మరో వారం రోజుల్లోనే 1000 కోట్ల క్లబ్ లోకి చేరిపోతుందని సినీ వర్గాల్లో టాక్..
ప్లాఫ్ టాక్ అందుకున్న సీక్వెల్స్..
ఈ ఏడాది హిట్ టాక్ ను అందుకున్న సీక్వెల్స్ తో పాటుగా కొన్ని సీక్వెల్ గా వచ్చిన సినిమా థియేటర్లలో రిలీజ్ అయ్యి బోల్తా కొట్టాయి. ‘ఇస్మార్ట్ శంకర్’ సీక్వెల్ గా వచ్చిన ‘డబుల్ ఇస్మార్ట్’ మూవీ పాన్ ఇండియా వైడ్ గా తీవ్ర నిరాశ పరిచింది. పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రామ్ పోతినేని హీరోగా నటించారు. ఇక ఘోర పరాజయం చవిచూసిన మరో సీక్వెల్ ‘యాత్ర 2’. అలాగే గీతాంజలి 2 మూవీ కూడా రిలీజ్ అయ్యింది. ‘ప్రతినిధి’ మూవీకి సీక్వెల్ గా తెరకెక్కిన ‘ప్రతినిధి 2’ చిత్రం నిరాశ పరిచింది. ప్రియమణి ప్రధాన పాత్రలో రూపొందిన ‘భామాకలాపం 2’ సినిమా కూడా ఈ ఏడాదే వచ్చింది.. ఈ సినిమాలు అన్ని ప్లాప్ అయ్యాయి.
ఇక ఇండస్ట్రీలో ఇంకా సీక్వెల్ సినిమాలు వస్తున్నాయి. జై హనుమాన్, హిట్-3, గూఢచారి-2, అఖండ 2: తాండవం, దేవర-2, కల్కి-2, సలార్-2, బింబిసార-2, పొలిమేర-3, పుష్ప-3, డీజే టిల్లు-3, మ్యాడ్ మ్యాక్స్, కార్తికేయ-3, ఆదిత్య 999 మ్యాక్స్, శతమానం భవతి-2, మంగళవారం-2, ఫలక్ నుమా దాస్-2, దాస్ కా ధమ్కీ-2, ఈనగరానికి ఏమైంది-2 వంటి సినిమాలు సీక్వెల్స్ రాబోతున్నాయి. ఈ సినిమాలపై అంచనాలు ఎక్కువగానే ఉన్నాయని చెప్పాలి. వచ్చే ఏడాదిలో ఈ సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. మరి ఎలాంటి టాక్ ను అందుకుంటాయో చూడాలి..