Chandrababu Govt Plan: రేపో మాపో రాజధాని అమరావతి పనులు మొదలు కానున్నాయి. కేంద్రం-రాష్ట్ర ప్రభుత్వాల మధ్య మంచి సంబంధాలు ఉండడంతో చంద్రబాబు ప్రభుత్వం కొత్త స్కెచ్ వేసింది. అందుకు ఇదే సరైన సమయమని భావించింది. పనిలో పనిగా రాజధాని అమరావతి విస్తరణ కోసం ఇప్పటి నుంచే ప్లాన్ చేస్తున్నట్లు ప్రభుత్వ వర్గాల నుంచి ఓ ఫీలర్ బయటకు వచ్చింది. దాని ప్రకారం మరో 30 వేల ఎకరాలు సేకరించాలనే ఆలోచన పెట్టుకున్నట్లు తెలుస్తోంది. దీనివల్ల అమరావతి ప్రపంచ నగరాల్లో ఒకటి చేయాలన్నది ప్రభుత్వ ఆలోచనగా చెబుతున్నారు.
బాబు మాస్టర్ ప్లాన్
రాజధాని అమరావతిని అభివృద్ధి చేస్తూనే మరో వైపు విస్తరణ కోసం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది చంద్రబాబు సర్కార్. దాదాపు రూ. 31 వేల కోట్లకు సంబంధించి టెండర్ల ప్రక్రియను పూర్తి చేసింది. వివిధ నిర్మాణ సంస్థలు రేపూ మాపో పని మొదలు పెట్టనున్నాయి. ఇందుకోసం ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు ఆధారంగా దశలవారీగా నిధులను విడుదల చేస్తున్నాయి.
ప్రస్తుతం 33 వేల ఎకరాల్లో నిర్మాణ పనులు జరుగుతున్నాయి. భవిష్యత్తులో రాజధాని అవసరాలను దృష్టిలో ఉంచుకుని అదనంగా భూమిని రెడీ చేయాలని ఆలోచన చేస్తోంది. అమరావతిలో ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు తోపాటు ఔటర్ రింగురోడ్డు, ఇన్నర్ రింగ్ రోడ్లకు అనుసంధానంగా ఏర్పాటు అయ్యే ప్రాజెక్టుల కోసం భూమి సమీకరించాలని భావిస్తోంది. కోర్ క్యాపిటల్ చుట్టూ పక్కల ఉన్న గ్రామాల్లో ఈ సమీకరణ ప్రక్రియ చేపట్టేందుకు అమరావతి మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ ప్లాన్ చేస్తోంది.
అమరావతి విస్తరణకు ప్లాన్
భూసేకరణకు సంబంధించిన సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తోంది ప్రభుత్వం. విమానాశ్రయం కోసం అవసరమైన ప్రతిపాదనలను రెడీ చేసే పనిలో పడింది ఏపీ ఏవియేషన్ కార్పొరేషన్. టెక్నో-ఫీజిబిలిటీ నివేదికను రూపొందించడానికి టెండర్లను ఆహ్వానించింది. నివేదికను వీలైనంత త్వరగా రెడీ చేసి కేంద్ర పౌర విమానయాన శాఖకు పంపాలని భావిస్తోంది. కేంద్రం నుండి అనుమతి రాగానే ప్రాజెక్టుకు సంబంధించి తదుపరి కార్యాచరణను మొదలుపెట్టాలని భావిస్తోంది.
ALSO READ: ఇకపై భూమనకు చుక్కలు చూపిస్తామన్న టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు
ఒక విధంగా చెప్పాలంటే మరో 30 వేల భూమి సేకరణ అనేది చంద్రబాబు సర్కార్‌కు బిగ్ ఛాలెంజ్. కాకపోతే అమరావతిలో పనులు కొద్ది రోజుల్లో మొదలు కానున్నాయి. పనులు మొదలయితే భూములు సేకరించడం ఈజీ అవుతుందని భావిస్తోంది. గతంలో మాదిరిగా భూమి సేకరణ విషయంలో చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలన్నది కొందరు అధికారుల మాట. కేవలం మూడేళ్లలో రాజధాని నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకుంది ప్రభుత్వం.
ఈలోగా మిగతా 30 వేల ఎకరాలు సేకరిస్తే, తర్వాత ప్రభుత్వంలో పనులు మొదలు పెట్టవచ్చన్నది ఆలోచన. ముఖ్యంగా పౌర విమానయానశాఖకు రామ్మోహన్ నాయుడు మంత్రిగా ఉన్నారు. అన్ని ఫార్మాల్టీలను పూర్తి చేస్తే పర్మిషన్ సునాయశంగా వస్తుందని అంటున్నారు. మొత్తానికి చంద్రబాబు సర్కార్ ఆలోచన మామూలుగా లేదని అంటున్నారు. నిత్యం నిర్మాణాలు జరిగితే ప్రభుత్వానికి ఆదాయం కూడా వస్తుందని కొందరు అధికారులు చెబుతున్నారు.