E-Paper
Advertisement

ఏపీ ఎంపీపీ, జడ్పీ అధ్యక్షుల ఎన్నికల షెడ్యూల్ విడుదల.. పూర్తి వివరాలు ఇవే!

ఏపీ ఎంపీపీ, జడ్పీ అధ్యక్షుల ఎన్నికల షెడ్యూల్ విడుదల.. పూర్తి వివరాలు ఇవే!
Advertisement

AP MPP ZP Chairman Elections 2026: రాష్ట్ర ఎన్నికల సంఘం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మండల, జిల్లా పరిషత్ పరోక్ష ఎన్నికల షెడ్యూల్‌ను తాజాగా విడుదల చేసింది. స్థానిక సంస్థల ప్రతినిధులను ఎన్నుకునేందుకు వీలుగా రాష్ట్రవ్యాప్తంగా అధికారులను వెంటనే ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేయాలని సూచించింది. చాలా కాలంగా వాయిదా పడుతూ వస్తున్న ఈ అధ్యక్ష స్థానాల ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కావడంతో రాష్ట్ర రాజకీయాల్లో ఒక్కసారిగా సందడి నెలకొంది.

చేతులెత్తే పద్ధతిలోనే ఎన్నిక..

Advertisement

ఈ నెల 19న రాష్ట్రంలోని 659 మండల ప్రజా పరిషత్‌లలో ఎంపీపీ (MPP), వైస్ ఎంపీపీ పదవులకు ఎన్నికలు నిర్వహిస్తారు. అలాగే 20వ తేదీన 28 జిల్లా పరిషత్‌ల (ZP) ఛైర్‌పర్సన్, వైస్ ఛైర్‌పర్సన్ స్థానాలకు పోలింగ్ జరగనుంది. ప్రధాన ఎన్నికకు ముందే మండల స్థాయిలో ఒక్కరిని, జిల్లా పరిషత్ స్థాయిలో ఇద్దరి చొప్పున కో-ఆప్షన్ సభ్యులను ఎన్నుకోవాల్సి ఉంటుంది. ఓటింగ్ ప్రక్రియను బహిరంగంగా చేతులెత్తే పద్ధతి ద్వారా పూర్తి చేయనున్నట్లు అధికారులు స్పష్టం చేశారు.

ఎస్ఈసీ కీలక నిర్ణయం..

Advertisement

ఈసారి పరోక్ష ఎన్నికల విధానంలో ఎస్‌ఈసీ కీలక నిర్ణయం తీసుకుంది. శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు, శాసనమండలి సభ్యులు ఈ పరోక్ష ఎన్నికల్లో ఓటు వేసేందుకు అర్హులు కారని తేల్చిచెప్పింది. కేవలం స్థానికంగా ఎన్నికైన సభ్యులకే ఓటు హక్కు పరిమితం కావడంతో ఎంపీటీసీలు, జడ్పీటీసీలకు ప్రాధాన్యం పెరిగింది. ఈ ప్రక్రియతో గ్రామీణ స్థానిక స్వపరిపాలన రూపురేఖలు త్వరలోనే స్పష్టం కానున్నాయి.

Also Read: ఓంకారేశ్వర ఆలయానికి రూ. 1,108 కోట్లా.. జీవో 928ని రద్దు చేయాలన్న FGG!

Tags

Related News

వైసీపీకి బిగ్ షాక్.. రాజీనామా చేసిన అన్నపరెడ్డి.. జగన్ తీరుపై తీవ్ర విమర్శలు!

ఏపీ రాజకీయాల్లో న్యూ ట్రెండ్.. పవన్ విడాకుల వేళ, బాబు-జగన్ సీరియస్ వార్నింగ్!

40 ఏళ్ల రాజకీయంలో ఒక్క మంచి పని చేశావా? అనంత వెంకట్రామిరెడ్డిపై జేసీ ఆగ్రహం

పవన్ కళ్యాణ్ డైవోర్స్ వ్యవహారం.. జ్యోతిష్యుడు వేణుస్వామి పాత వీడియో వైరల్, మేటరేంటి?

ప్రకాశం జిల్లాలో ప్రైవేట్ బస్సు దగ్ధం.. డ్రైవర్ చాకచక్యంతో 33 మంది సేఫ్!

చిత్తూరులో దారుణం.. ఇచ్చిన డబ్బులు అడిగినందుకు కారుతో గుద్ది దారుణ హత్య!

పులివెందులలో టీడీపీ రిగ్గింగ్ వీడియోలు.. బయటపెట్టిన మాజీ మంత్రి పేర్ని నాని!

Big Stories

Advertisement
×