BigTV English

Allu Arjun Arrest: పుష్ప అరెస్ట్.. రంగంలోకి అంబటి..

Allu Arjun Arrest: పుష్ప అరెస్ట్.. రంగంలోకి అంబటి..

Allu Arjun Arrest: హీరో అల్లు అర్జున్ అరెస్టు పుణ్యమా అంటూ సందట్లో సందడి చేసేందుకు పొలిటికల్ పార్టీలు, నాయకులు తమ హవా కొనసాగిస్తున్నారు. ఇలాగైనా తమ సత్తా చాటుకునేందుకు వారు పడుతున్న ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు. తెలంగాణలో మాజీ మంత్రి కేటీఆర్.. ఇప్పటికే అరెస్ట్ ను వ్యతిరేకిస్తూ ఇప్పటికే ట్వీట్ చేసి నెటిజన్ల నుండి విమర్శలను ఎదుర్కొంటున్నారు. తాజాగా ఏపీ నుండి కూడా బన్నీ అరెస్ట్ నిరసిస్తూ, వైసీపీకి చెందిన మాజీ మంత్రి అంబటి రాంబాబు తాజాగా ట్వీట్ చేశారు.


పుష్ప2 సినిమా సమయం నుండి మాజీ మంత్రి అంబటి రాంబాబు సినిమా ప్రమోషన్స్ రీతిలో కామెంట్స్ చేస్తూ వచ్చారు. సినిమాను ఆపుతారా.. ఎవరక్కడ అంటూ అంబటి మద్దతు పలికారు. కొసమెరుపు ఏమిటంటే సినిమాను ఆపుతామంటూ ఎవరూ బహిరంగంగా ప్రకటించక పోయినా, అంబటి మాత్రం రియాక్ట్ అయ్యారు.

సినిమా రిలీజ్ అయింది. అలాగే రికార్డ్స్ కూడా బద్దలు కొట్టింది. రిలీజ్ సమయంలో అల్లు అర్జున్ ను ఓన్ చేసుకొనేందుకు వైసీపీ నాయకులు కొందరు, భారీ ప్లెక్సీలు ఏర్పాటు చేశారు. అంతేకాదు జగన్ బొమ్మతో ప్లెక్సీలు ఏర్పాటు చేయగా, సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అప్పుడు కూడా అంబటి రాంబాబు.. పుష్ప తగ్గేదేలే అంటూ కామెంట్స్ చేశారు. ఇలా బన్నీని తమ వాడంటూ ప్రపంచానికి చాటి చెప్పేందుకు ఎన్ని తిప్పలు పడ్డా, అల్లు అర్జున్ మాత్రం మొండి చేయి చూపాడని చెప్పవచ్చు.


సినిమా సక్సెస్ మీట్ లో అల్లు అర్జున్ ఒక్క మాట అనకపోగా, బాబాయి పవన్ కళ్యాణ్ కు థ్యాంక్స్ చెప్పారు. తాజాగా అల్లు అర్జున్ ను హైదరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో మహిళ మృతి చెందిన కేసులో బన్నీని పోలీసులు అరెస్ట్ చేశారు.

ఇప్పటికే చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించేందుకు పూర్తి బందోబస్తు ఏర్పాటు చేశారు. మెగా ఫ్యామిలీ కూడా బన్నీకి మద్దతుగా పోలీస్ స్టేషన్ వద్దకు వస్తున్నట్లు సమాచారం. కానీ ఇంతలోనే పొలిటికల్ డ్రామాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. తాజాగా అంబటి రాంబాబు ట్వీట్ చేశారు. బన్నీ అరెస్ట్ అన్యాయమంటూ తన వాదన వినిపించారు.

Also Read: Allu Arjun Arrest: కేటీఆర్.. నీ గోల ఏంటి? కాస్త అలా ఉండు.. బన్నీ లాయర్ వార్నింగ్

దీనితో అక్కడ కేటీఆర్, ఇక్కడ అంబటి ఇద్దరూ ఇద్దరేనంటూ నెటిజన్స్ ట్రోలింగ్స్ చేస్తున్నారు. మహిళ మృతి కేసులో పోలీసులు అదుపులోకి తీసుకుంటే, అదేదో తెలంగాణ ప్రభుత్వం కక్షపూరితంగా అరెస్ట్ చేసిందంటూ ప్రచారం చేసే రేంజ్ లో ఇవేమీ ట్వీట్స్ అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చట్టం తన పని తాను చేసుకుపోతున్న క్రమంలో ప్రతి విషయాన్ని పొలిటికల్ లైన్ లో చూసే ప్రయత్నం మానుకోవాలని బన్నీ ఫ్యాన్స్ కూడా సూచిస్తున్నారు.

Related News

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Pulivendula: పులివెందులలో హై టెన్షన్.. వివేకానంద పుట్టిన రోజు, సునీత సంచలన వ్యాఖ్యలు

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Big Stories

×