Indian Railways: రైల్వే పనుల కారణంగా పలు వందేభారత్ రైళ్లను రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. మొత్తం 17 రైళ్లు క్యాన్సిల్ కాగా, మరో 4 రైళ్లను దారి మళ్లిస్తున్నట్లు తెలిపారు. ఉత్తర ప్రదేశ్ లోని హర్దోయ్- బలమౌ మధ్య ఉన్న మసీత్ స్టేషన్ లో నాన్ ఇంటర్ లాకింగ్ పనులను నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే బరేలీ గుండా వెళ్లే 17 రైళ్లను క్యాన్సిల్ చేశారు. మరో నాలుగు రైళ్లను వేరే రూట్ కు మళ్లించారు. ఇంకో నాలుగు రైళ్లు రెండు గంటలకు పైగా ఆలస్యంగా నడవనున్నాయి. అంతకు ముందు, పొగమంచు కారణంగా డిసెంబర్ 1 నుంచి ఫిబ్రవరి 29 వరకు బరేలీ మీదుగా వెళ్లే 18 రైళ్లు ఇప్పటికే రద్దు చేయబడ్డాయి. రాబోయే మూడు నెలను దృష్టిలో పెట్టుకుని 40 రైళ్ల ఫ్రీక్వెన్సీని తగ్గించారు.
క్యాన్సిల్ చేసిన రైళ్ల వివరాలు
⦿ సింగ్రౌలీ- తనక్ పూర్ మధ్యలో నడిచే త్రివేణి ఎక్స్ ప్రెస్(15073) డిసెంబర్ 21, 24 తేదీల్లో క్యాన్సిల్ అవుతుంది.
⦿ తనక్ పూర్- సింగ్రౌలి త్రివేణి ఎక్స్ ప్రెస్(15074) డిసెంబర్ 20, 23 తేదీల్లో రద్దు అవుతుంది.
⦿ శక్తినగర్- తనక్ పూర్ త్రివేణి ఎక్స్ ప్రెస్(15075) డిసెంబర్ 23న రద్దు చేయబడుతుంది.
⦿తనక్ పూర్- శక్తినగర్ త్రివేణి ఎక్స్ ప్రెస్(15076) డిసెంబర్ 22న రద్దు చేయబడుతుంది.
⦿ అర్చన ఎక్స్ ప్రెస్(12355/12356) డిసెంబర్ 21, 22 తేదీల్లో రద్దు చేయబడుతుంది.
లక్నోకు వెళ్లనున్న కుంభమేళా ఎక్స్ ప్రెస్
నాన్ ఇంటర్ లాకింగ్ పనుల కారణంగా హౌరా-డెహ్రాడూన్ కుంభమేళా(12369) ఎక్స్ ప్రెస్ డెహ్రాడూన్ కు బదులుగా డిసెంబర్ 22, 23 తేదీల్లో లక్నోకు నడుస్తుంది. ఈ రైలు రెండు రోజుల పాటు లక్నో, డెహ్రాడూన్ మధ్య రద్దు చేయబడుతుంది. అటు డెహ్రాడూన్- హౌరా(12370) కుంభమేళా ఎక్స్ ప్రెస్ డిసెంబర్ 23, 24 తేదీల్లో లక్నో నుంచి డెహ్రాడూన్ వరకు నడుస్తుంది. ఈ రెండు రోజులు లక్నో, డెహ్రాడూన్ మధ్య రద్దు చేయబడుతుంది.
దారి మళ్లించిన నాలుగు రైళ్లు ఇవే!
⦿ డిసెంబర్ 22, 23 తేదీలలో సహర్స-అమృతసర్ గరీబ్ రథ్ ఎక్స్‌ప్రెస్ గోరఖ్ పూర్, సీతాపూర్, షాజహాన్ పూర్, బరేలీ మీదుగా మళ్లించబడుతుంది.
⦿ డిసెంబర్ 22న అమృత్ సర్- సహర్సా గరీబ్ రథ్ ఎక్స్ ప్రెస్ బరేలీ, షాజహాన్ పూర్, సీతాపూర్, గోరఖ్ పూర్ మీదుగా మళ్లించబడుతుంది. ఈ రైళ్లు లక్నో, హర్దోయ్ లో ఆగవు.
⦿ డిసెంబర్ 21 నుంచి 23 వరకు, ముజఫర్ పూర్- ఆనంద్ విహార్ ఎక్స్ ప్రెస్ గోండా, సీతాపూర్, షాజహాన్ పూర్ మీదుగా, ఆనంద్ విహార్-ముజఫర్ పూర్ ఎక్స్ ప్రెస్ డిసెంబర్ 22, 23 తేదీల్లో షాజహాన్ పూర్, సీతాపూర్, గోండా మీదుగా మళ్లించబడతాయి. ఈ రైళ్లు లక్నోకు వెళ్లవు.
రెండు గంటలు ఆలస్యంగా నడిచే రైళ్లు
⦿ జమ్మూ తావి- కోల్‌కతా ఎక్స్‌ప్రెస్, చండీగఢ్- లక్నో ఎక్స్‌ప్రెస్ డిసెంబర్ 22న రెండు గంటలు ఆలస్యంగా బయల్దేరుతాయి.
⦿ అవధ్ అస్సాం ఎక్స్ ప్రెస్ డిసెంబర్ 22న 30 నిమిషాలు ఆలస్యంగా నడవనుంది. జమ్మూ తావి- కోల్‌కతా ఎక్స్ ప్రెస్ గంట 30 నిమిషాలు అదనంగా ఆగుతుంది.
Read Also: విమానాలకు ఎక్కువగా వైట్ కలర్ ఎందుకేస్తారు? న్యూజిలాండ్‌లో మాత్రం నల్ల రంగు ఎందుకు?