Allu Arjun Bail : అల్లు అర్జున్ అరెస్ట్‌తో సినీ ఇండస్ట్రీతో పాటు పొలిటికల్ గా హీట్ పెరిగింది. ఇప్పటికే అల్లు అర్జున్ మద్దతు దారులు చిక్కడిపల్లి పోలీస్ స్టేషన్ కు చేరుకుంటున్నారు. దిల్ రాజు ఇప్పటికే పోలీస్ స్టేషన్ కు చేరుకోగా, మెగాస్టార్ చిరంజీవిని పోలీసులు అడ్డుకున్నారు. లా అండ్ /ఆర్డర్ ప్రాబ్లమ్స్ పేరుతో చిరంజీవిని పోలీసులు చిక్కడిపల్లి పోలీస్ స్టేషన్ కు రాణివ్వడం లేదు. ఇదంత పక్కన పెడితే, అల్లు అర్జున్ బెయిల్ పై ఉత్కంఠ మాత్రం తగ్గడం లేదు. అరెస్ట్ అయి ఇన్ని గంటలు గడుస్తున్నా… బెయిల్ పై ఇంకా స్పష్టత రాలేదు. బన్నీ టీం బెయిల్ కోసం అన్ని విధాలుగా ట్రై చేస్తున్నారు. రేపు రెండో శనివారం, తర్వాత ఆదివారం కావడంతో అల్లు అర్జున్ అభిమానుల్లో టెన్షన్ మొదలైంది.
అయితే, తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం… అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ విచారణ తెలంగాణ హై కోర్టు సాయంత్రం 4 గంటలకు ఉంటుందని తెలుస్తుంది. 2:30 నిర్ణయం చెబుతా అని అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ బన్నీ టీం కి చెప్పాడు. తాజాగా అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ ను విచారించడానికి సాయంత్రం 4 గంటలకు అనుమతి ఇచ్చింది.