BigTV English
Advertisement

India vs England : విద్యార్థులూ…టెస్ట్ మ్యాచ్ చూస్తారా?  అయితే ఫ్రీ!

India vs England : విద్యార్థులూ…టెస్ట్ మ్యాచ్ చూస్తారా?  అయితే ఫ్రీ!

India vs England : భారత్ లో సుదీర్ఘ పర్యటనకు ఇంగ్లాండ్ శ్రీకారం చుట్టనుంది. 5 టెస్ట్  మ్యాచ్ ల సిరీస్ జనవరి 25న హైదరాబాద్ లో ని ఉప్పల్ స్టేడియంలో జరగనుంది. అయితే టెస్ట్ మ్యాచ్ లపై ఇంట్రస్ట్ కలిగించడానికి హైదరాబాద్ క్రికెట్ సంఘం ఒక సరికొత్త ఆలోచనకు శ్రీకారం చుట్టింది. బహుశా ఇది సక్సెస్ అయితే, దేశ వ్యాప్తంగానే కాదు, అంతర్జాతీయంగా కూడా ఈ ఆలోచన అమలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.


ఇంతకీ ఏమిటా ఆలోచన అంటారా? తెలంగాణ రాష్ట్రంలోని 6 నుంచి 12 వరకు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు ఉచితంగా మ్యాచ్ చూసే అవకాశాన్ని హైదరాబాద్ క్రికెట్ సంఘం కల్పించింది. అయితే ముందుగానే ఎంతమంది వస్తున్నారు? స్టాఫ్ ఎంతమంది? తదితర వివరాలను అందించమని కోరారు. అది ఆన్ లైన్ లో కానీ, మెయిల్ ద్వారాగానీ సంప్రదించాలని కోరారు.

అయితే ఒక కండీషన్ పెట్టారు. అదేమిటంటే పిల్లలందరూ స్కూల్ యూనిఫారమ్ వేసుకురావాలని అన్నారు. అయితే ఐదురోజులు కూడా ఈ అవకాశం ఉంటుందని తెలిపారు. అంతేకాదు పిల్లలకు మధ్యాహ్నం భోజన సదుపాయం కూడా కల్పిస్తామని తెలిపారు. ఇది మంచి ఆలోచన అని హైదరాబాద్ క్రికెట్ సంఘాన్ని అందరూ అభినందిస్తున్నారు.


దీనివల్ల రెండు ఉపయోగాలు ఉన్నాయి. ఒకటేమిటంటే చిన్నారులకు క్రికెట్ మీద ఆసక్తి ఏర్పడుతుంది. తద్వారా వారు కెరీర్ ఆప్షన్ గా ఎంచుకునే అవకాశాలున్నాయి. ఇప్పుడు క్రికెట్ అంటే గ్రౌండ్ లో 11 మంది ఆడేది మాత్రమే కాదు, ఆ టీమ్ వెనుక, ఆ క్రికెటర్ల వెనుక ఎంతోమందికి ఉపాధి అవకాశాలు విరివిగా ఉన్నాయి.. ఒకప్పుడు టెస్ట్ మ్యాచ్ లు, వన్డేలు టీమ్ ఇండియా ఆడితేనే చూసేవారు.

కానీ ఇప్పుడు ఐపీఎల్ టీ20 వచ్చింది. రానున్నరోజుల్లో టీ 10 కూడా వచ్చే అవకాశాలున్నాయి. ఏర్పాట్లు కూడా చకచకా జరుగుతున్నాయి. అందువల్ల పిల్లల్లో  క్రికెట్ పట్ల ఆసక్తిని పెంచగలిగితే ఆటోమేటిక్ గా రానున్నరోజుల్లో వారు తమకి నచ్చిన రంగంలో ఉన్నత స్థితికి చేరుకుంటారు. ఇకపోతే  పిల్లలు గ్రౌండ్ కి వెళ్లారు కాబట్టి, తల్లిదండ్రులు కూడా ఇంట్లో టీవీలు దగ్గర మ్యాచ్ చూస్తారు.

దేశవ్యాప్తంగా అందరి ద్రష్టి ఈ టెస్ట్ మ్యాచ్ పైనే ఉంటుంది. అలాగే పిల్లలు ఉత్సాహంగా చప్పట్లు కొట్టడం, తమకి నచ్చిన క్రికెటర్లను అతి దగ్గరగా చూసే అరుదైన అవకాశం రావడం వారికి సరికొత్త అనుభూతి అని వర్ణిస్తున్నారు. ఇక వారు ఫోర్లు, సిక్స్ లు కొట్టినప్పుడు చేసే హడావుడికి,  ఆడే క్రికెటర్లలో కూడా ఉత్సాహం వస్తుందని అంటున్నారు.

చాలా దేశాల్లో టెస్ట్ మ్యాచ్ లు అనేసరికి ప్రేక్షకులు ఎవరూ రావడం లేదు.  సౌతాఫ్రికాలో లో జరిగిన టెస్ట్ మ్యాచ్ లకి, పాక్-ఆస్ట్రేలియా మధ్య జరిగినప్పుడు కూడా స్టేడియంలలో ప్రేక్షకుల సంఖ్య స్వల్పంగానే ఉంది. అందువల్ల రానున్న రోజుల్లో టీ 20, టీ 10ల కారణంగా టెస్ట్ మ్యాచ్ లపై ఆసక్తిని చంపేయకుండా, ఇలా విద్యార్థులను ఉచితంగా తీసుకురావడం వల్ల టెస్ట్ మ్యాచ్ లకి మంచి జరుగుతుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు.

India vs England, India vs England test match, hyderabad cricket association

Tags

Related News

WPL Retention 2026 : రిటైన్ లిస్టు ఇదే..WPL 2026 టోర్న‌మెంట్ షెడ్యూల్ ఇదే..!

IND VS AUS 4th T20I : వాషి యో వాషి..3 వికెట్లు తీసిన వాషింగ్ట‌న్‌, కంగారుల‌పై టీమిండియా విజ‌యం

Kajal Aggarwal: టీమిండియా మ్యాచ్ కు కాజ‌ల్‌..భ‌ర్త‌ను హ‌గ్ చేసుకుని మ‌రీ, ఆస్ట్రేలియా టార్గెట్ ఎంతంటే

Tata Motors: వ‌ర‌ల్డ్ క‌ప్ గెలిచిన టీమిండియా ప్లేయ‌ర్ల‌కు టాటా బంప‌ర్ ఆఫ‌ర్‌

PV Sindhu: బోల్డ్ అందాలతో రెచ్చిపోయిన PV సింధు.. వెకేషన్ లో భర్తతో రొమాన్స్

IND VS AUS, 4th T20I: టాస్ ఓడిన టీమిండియా..మ్యాక్స్‌వెల్ తో పాటు 4 గురు కొత్త‌ ప్లేయ‌ర్లు వ‌చ్చేస్తున్నారు

Harleen Deol: మోడీ సార్‌.. ఎందుకు ఇంత హ్యాండ్స‌మ్ గా ఉంటారు? హర్లీన్ డియోల్ ఫ‌న్నీ క్వ‌శ్చ‌న్‌

Pratika Rawal : ప్రతికా రావల్ ను అవమానించిన ఐసీసీ.. కానీ అమన్ జోత్ చేసిన పనికి ఫిదా అవ్వాల్సిందే

Big Stories

×